ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లో కీలక ప్రాజెక్టులను ఈ నెల 24 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
గుజరాత్ రైతుల కోసం ‘కిసాన్ సూర్యోదయ్ యోజన’ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
యు.ఎన్. మెహతా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రిసర్చ్ సెంటర్ కు అనుబంధం గా ఏర్పాటైన పీడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
గిర్ నార్ లో రోప్ వే ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు
Posted On:
22 OCT 2020 5:21PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో మూడు కీలక పథకాలను ఈ నెల 24 న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి గుజరాత్ లోని రైతుల కోసం ‘కిసాన్ సూర్యోదయ యోజన’ ను ప్రారంభిస్తారు. యు.ఎన్. మెహతా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రిసర్చ్ సెంటర్ కు అనుబంధంగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. అలాగే అహమదాబాద్ లో గల అహమదాబాద్ సివిల్ హాస్పిటల్ లో టెలీ-కార్డియాలజీ కోసం అభివృద్ధిపరచిన ఒక మొబైల్ అప్లికేషన్ ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఇదే సందర్భం లో గిర్ నార్ లో రోప్ వే ను కూడా ఆయన ప్రారంభిస్తారు.
కిసాన్ సూర్యోదయ యోజన
సేద్యపు నీటి పారుదల కోసం పగటి పూట విద్యుత్తు సరఫరాను అందించడానికి ‘కిసాన్ సూర్యోదయ యోజన’ ను ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ నాయకత్వం లోని గుజరాత్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ పథకం లో భాగం గా రైతులు ఉదయం 5 గంటలు మొదలుకొని రాత్రి 9 గంటల వరకు విద్యుత్తు సరఫరా సౌకర్యాన్ని పొందగలుగుతారు. ఈ పథకం లో భాగంగా 2023 కల్లా ప్రసార సంబంధిత మౌలిక సదుపాయాలను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం 3500 కోట్ల రూపాయల బడ్జెటును కేటాయించింది. ఈ పథకం లో భాగం గా 220 కెవి సామర్ధ్యం కలిగిన సబ్ స్టేషన్ల కు తోడు, మొత్తం 3490 సర్క్యూట్ కిలో మీటర్ల (సికెఎమ్) పొడవుతో కూడిన ‘66 కిలో వాట్’ సామర్ధ్యం కలిగిన 234 ట్రాన్స్ మిషన్ లైన్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఈ పథకం లో 2020-21 కి గాను దాహోద్, పాటన్, మహీసాగర్, పంచ్ మహల్, ఛోటా ఉదేపుర్, ఖేడా, తాపీ, వల్సాడ్, ఆణంద్ లతో పాటు గిర్-సోమ్ నాథ్ లను చేర్చడం జరిగింది. మిగిలిన జిల్లాలను దశలవారీగా 2022-23 కల్లా ఈ ప్రాజెక్టు కిందకు తీసుకురావడం జరుగుతుంది.
యు.ఎన్. మెహతా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రిసర్చ్ సెంటర్ కు అనుబంధంగా పీడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్
ప్రధాన మంత్రి యు.ఎన్. మెహతా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రిసర్చ్ సెంటర్ కు అనుబంధంగా ఏర్పాటైన పీడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్ ను కూడా ప్రారంభించనున్నారు. అలాగే అహమదాబాద్ లో గల అహమదాబాద్ సివిల్ హాస్పిటల్ లోని టెలి-కార్డియాలజీ విభాగం కోసం అభివృద్ధిపరచిన ఒక మొబైల్ అప్లికేషన్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. యు.ఎన్. మెహతా ఇన్స్ టిట్యూట్ ఇక ప్రపంచ శ్రేణి వైద్య సంబంధిత మౌలిక సదుపాయాలు కలిగిన అతి కొద్ది ఆసుపత్రుల లో ఒకటి కావడంతో పాటు భారతదేశంలో హృదయ వ్యాధి చికిత్సకు ఏర్పాటైన అతి పెద్ద ఆసుపత్రి గా కూడా పేరును తెచ్చుకోనుంది.
యు.ఎన్. మెహతా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ 470 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరణ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ విస్తరణ పథకం పూర్తి అయిన తరువాత దీనిలో పడకల సంఖ్య 450 నుంచి 1251 కి పెరగనుంది. ఈ ఇన్స్ టిట్యూట్ దేశం లో అతి పెద్దదైన సింగిల్ సూపర్ స్పెషాలిటీ కార్డియేక్ టీచింగ్ ఇన్స్ టిట్యూట్ గా ఖ్యాతి ని పొందడమే కాక ప్రపంచంలో అతి పెద్దవైన సింగిల్ సూపర్ స్పెషాలిటీ కార్డియేక్ హాస్పిటల్స్ లో ఒకటి గా కూడా కాబోతోంది.
ఈ భవనంలో భూకంపాలకు తట్టుకొని నిలచే నిర్మాణం, మంటలను ఆర్పివేసేందుకు నీటిని చిమ్మే వ్యవస్థ, ఫైర్ మిస్ట్ సిస్టమ్ ల వంటి సురక్ష సంబంధిత ముందుజాగ్రత్తలను చేపట్టడం జరిగింది. ఈ పరిశోధన కేంద్రంలో ఇసిఎమ్ఒ, హీమాడాయలిసిస్, ఐఎబిపి, వెంటిలేటర్స్ కలిగిన దేశంలో తొలి అధునాతన కార్డియేక్ ఐసియు ఆన్ వీల్స్ విత్ ఒ.టి. ఏర్పాటు కానుంది. ఈ సంస్థలో 14 శస్త్ర చికిత్స కేంద్రాలు, 7 కార్డియేక్ కాథిటరైజేశన్ ల్యాబులను కూడా ప్రారంభించడం జరుగుతుంది.
గిర్ నార్ రోప్ వే
ప్రధాన మంత్రి ఈ నెల 24 న గిర్ నార్ లో రోప్ వే ను ప్రారంభించనుండటం తో గుజరాత్ మరో మారు ప్రపంచ పర్యాటక ముఖచిత్రంలో విశిష్టతను సంపాదించుకోనుంది. ఆరంభ దశ లో ప్రతి ఒక్క కేబిన్ 8 మందికి సరిపోయేటటువంటి 25 నుంచి 30 కేబిన్ ల దాకా ఉండబోతున్నాయి. 2.3 కిలో మీటర్ల దూరాన్ని రోప్ వే మాధ్యమం ద్వారా 7.5 నిమిషాల వ్యవధిలో అధిగమించేందుకు వీలు ఉంటుంది. దీనికి అదనంగా ఈ రోప్ వే గిర్ నార్ పర్వతం చుట్టూరా ఉన్న చిక్కని హరిత శోభ ను సుందరంగా వీక్షించే అవకాశాన్ని కూడా కల్పించనుంది.
***
(Release ID: 1666836)
Visitor Counter : 272
Read this release in:
Urdu
,
Assamese
,
English
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam