ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మొత్తం పరీక్షల్లో 10 కోట్ల మైలు రాయిని దాటిన భారత్
9 రోజుల్లోనే చివరి ఒక కోటి పరీక్షలు
గడచిన 24 గంటల్లో సుమారు 14.5 లక్షల కోవిడ్ పరీక్షల నిర్వహణ
Posted On:
23 OCT 2020 12:18PM by PIB Hyderabad
2020 జనవరి నుండి భారతదేశం కోవిడ్-19 సంచిత పరీక్షల సంఖ్యలో విపరీతమైన పెరుగుదలను సూచిస్తోంది. ఇది ఈ రోజు మొత్తం 10 కోట్ల (10,01,13,085) మైలురాయిని దాటింది.
అలాగే 14,42,722 పరీక్షలు జరగడం మరో పెద్ద విజయం.
చివరి 24 గంటలు. దేశం పరీక్షా సామర్థ్యాలు దేశవ్యాప్తంగా దాదాపు 2000 ల్యాబ్‌లతో కేంద్ర, రాష్ట్ర / యుటి ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగా అనేక రెట్లు పెరిగాయి. ప్రతిరోజూ 15 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించవచ్చు.
పరీక్షా సంఖ్య పెరుగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా వాటి మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషించాయి. 1122 ప్రభుత్వ ప్రయోగశాలలు, 867 ప్రైవేట్ ప్రయోగశాలలతో సహా దేశంలో 1989 పరీక్షా ప్రయోగశాలలతో, రోజువారీ పరీక్షా సామర్థ్యం గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందింది. నిరంతర ప్రాతిపదికన సమగ్ర స్థాయి పరీక్షలు కూడా జాతీయ పాజిటివ్ కేసుల రేటును తగ్గించటానికి కారణమయ్యాయి. సంక్రమణ వ్యాప్తి రేటు సమర్థవంతంగా నియంత్రించినట్టు ఇది సూచిస్తుంది. మొత్తం పరీక్షలు 10 కోట్లు దాటడంతో సంచిత రేటు తగ్గుతూనే ఉంది. జాతీయ పాజిటివిటీ రేటు ఇపుడు 7.75%. ఇది టెస్ట్, ట్రాక్, ట్రేస్, ట్రీట్ మరియు టెక్నాలజీ వంటి కేంద్ర ప్రభుత్వ వ్యూహాలు సమర్థవంతంగా రాష్ట్రాలు/యుటిలు అనుసరించడం వల్ల విజయవంతమైన ఫలితాలు చూస్తున్నాం. .
విస్తృత ప్రాంతాలలో అధిక పరీక్షలలో పాజిటివ్ కేసులను ముందుగా గుర్తించడం, సమర్థవంతమైన నిఘా మరియు సరైన సమయంలో వ్యాధిని ఛేదించి, గృహాలు / ప్రాంగణాల్లో సరైన సమయంలోనూ, తీవ్రమైన కేసులకు ఆసుపత్రులలోనూ సమర్థవంతమైన చికిత్స అందుతోంది. ఈ చర్యల వల్ల మరణాల రేటును తగ్గుతున్నాయి. చివరి ఒక కోటి పరీక్షలు 9 రోజుల్లో జరిగాయి.
15 రాష్ట్రాలు, యుటిలు జాతీయ సంఖ్యతో పోలిస్తే అధిక పోసిటివ్ రేటును సూచిస్తున్నాయి, ఈ ప్రాంతాలలో అధిక స్థాయి సమగ్ర పరీక్షల చేయాల్సిన అవసరం ఉంది.
****
(Release ID: 1667047)
Visitor Counter : 214
Read this release in:
Tamil
,
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada