ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్-19 సంసిద్ధతను మరియు కోవిడ్ తగిన ప్రవర్తన కోసం చర్యలను సమీక్షించిన - డాక్టర్ హర్ష్ వర్ధన్

"దేశం కోసం కోవిడ్ పరిస్థితిని నిర్ణయించడంలో వచ్చే 3 నెలలు నిర్ణయాత్మకమైనవి. రాబోయే పండుగ మరియు శీతాకాలంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకుని, కోవిడ్ తగిన ప్రవర్తనను అనుసరిస్తే, కరోనాతో పోరాడటానికి మనం మంచి స్థితిలో ఉంటాము”

Posted On: 23 OCT 2020 4:10PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్-19 సంసిద్ధతను మరియు కోవిడ్ తగిన ప్రవర్తన కోసం చర్యలను సమీక్షించడానికి, ఆ రాష్ట్రానికి చెందిన  ఆరోగ్య మరియు వైద్య విద్యా మంత్రులతో సహా ఇతర ఉన్నతాధికారులతో ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యారు. 

కోవిడ్-19 ను ఎదుర్కోవడంలో కరోనా యోధుల కృషిని డాక్టర్ హర్ష వర్ధన్ ప్రశంసించారు.  గత మూడు నెలల్లో, కోవిడ్ నియంత్రణలో దేశం గణనీయమైన మెరుగుదల కనబరిచినట్లు వివరిస్తూ, "ఒక రోజులో నమోదయ్యే కేసుల సంఖ్య 95,000 నుండి 55,000 కంటే తక్కువకు గణనీయంగా తగ్గింది.  భారతదేశంలో రికవరీ రేటు 90 శాతానికి చేరుకుంటోంది.  కేసు మరణాల రేటు (సి.ఎఫ్.ఆర్) కూడా తగ్గుతోంది.  ప్రస్తుతం 1.51 శాతంగా ఉన్న సి.ఎఫ్.ఆర్. 1 శాతం కన్నా తక్కువగా ఉండాలనే లక్ష్యానికి చేరువలో ఉంది. ”అని ఆయన చెప్పారు.  

ఈ సందర్భంగా, డాక్టర్ హర్ష వర్ధన్ మరిన్ని వివరాలు తెలియజేస్తూ, “ ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 7 లక్షల కన్నా తక్కువగా ఉంది.  కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే సమయం 97.2 రోజులకు పెరిగింది.   దేశంలో కేవలం ఒక ప్రయోగశాలతో ప్రారంభమైన ఈ ప్రయాణం, ఇప్పుడు దేశంలో దాదాపు 2000 ప్రయోగశాలలతో ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటింది.  మనం సరైన దిశలో పయనిస్తున్నట్లు గుర్తించడానికి, ఇది ఒక సానుకూల సూచన ”. అని చెప్పారు.  

డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, “కోవిడ్-19 ను ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ,  దేశంలో కోవిడ్ పరిస్థితిని నిర్ధారించడంలో రాబోయే మూడు నెలలు నిర్ణయాత్మకమైనవి.  రాబోయే పండుగ మరియు శీతాకాలంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకుని, కోవిడ్ తగిన ప్రవర్తనను అనుసరిస్తే, కరోనాతో పోరాడటానికి మనం మంచి స్థితిలో ఉంటాము”  అని పేర్కొన్నారు.  ఆయన ఇంకా మాట్లాడుతూ “ఉత్తర ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో, కరోనా వైరస్ ను నివారించడంలో సమర్థవంతంగా పనిచేసే సాధారణ ముందు జాగ్రత్త చర్యలపై మరింతగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేదా ఫేస్ కవర్ ధరించడం, చేతులను తరచుగా శుభ్రపరచుకోవడంతో పాటు శ్వాసకోశానికి సంబంధించిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.” అని సూచించారు.  కొత్త కేసులు లేదా మరణాలు పెరుగుతున్న జిల్లాల అధికారులతో కూడా డాక్టర్ వర్ధన్ మాట్లాడారు. 

ప్రస్తుతం, ఉత్తరప్రదేశ్ లో మరణాల రేటు 1.46 గా ఉందనీ, ఇది జాతీయ సగటు కంటే తక్కువని, ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో రికవరీ రేటు (92.2 శాతం) జాతీయ రికవరీ రేటు కంటే ఎక్కువగా ఉంది. పాజిటివిటీ రేటు 3.44 శాతంగా ఉంది.  

మరణాల రేటు తక్కువగా ఉండటానికి - పరీక్ష, నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు ముందస్తు రోగ నిర్ధారణపై రాష్ట్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని డాక్టర్ హర్ష వర్ధన్ నొక్కి చెప్పారు.  కరోనా కారణంగా రోగనిరోధకత నుండి బయటపడిన పిల్లలకు టీకాలు వేయడానికి ఉత్తరప్రదేశ్ చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.  

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, శ్రీ రాజేష్ భూషణ్;  కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి, శ్రీమతి ఆర్తి అహుజా తో పాటు,  ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. సంయుక్త కార్యదర్శి,  శ్రీ లవ్ అగర్వాల్ కూడా ఈ సమావేశంలో  పాల్గొన్నారు.  రాష్ట్రానికి చెందిన ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

*****


(Release ID: 1667131) Visitor Counter : 178