PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
14 OCT 2020 6:23PM by PIB Hyderabad
#Unite2FightCorona
#IndiaFightsCorona
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- కోవిడ్ పరీక్షలలో భారత్ సరికొత్త మైలురాయి దాటింది. మొత్తం పరీక్షలు రికార్డు స్థాయిలో 9 కోట్లు దాటాయి.
- 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైన పాజిటివ్ ల శాతం
- చికిత్సలో ఉన్న కేసులు స్థిరంగా తగ్గుదల, ప్రస్తుతం 8,26, 876 గా నమోదు, ఇవి నిర్థారణ అయిన కేసుల్లో 11.42%
- గత 24 గంటల్లో కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు 74,632 కాగా, కొత్తగా నిర్థారణ అయినవారు 63,509 మంది
- ఎక్కువ మంది కోలుకుంటుండటంతో జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 87.05 కు చేరింది.
- పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో ప్రయాణీకులకు మార్గదర్శకాలు జారీచేసిన రైల్వేలు
కోవిడ్ నిర్థారణలో సరికొత్త మైలురాయి దాటిన భారత్ , 9 కోట్లు దాటిన మొత్తం కోవిడ్ పరీక్షలు , 20 రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువ పాజిటివ్ కేసుల నమోదు
భారతదేశంలో జరిగిన మొత్తం కోవిడ్ నిర్థారణ పరీక్షలు 2020 జనవరి నుంచి క్రమంగా పెద్ద ఎత్తున పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజుకు వాటి సంఖ్య 9 కోట్లకు పైబడింది. గడిచిన 24 గంటల్లో 11,45,015 పరీక్షలు జరగగా ఇప్పటివరకు మొత్తం 9,00,90, 122 శాంపిల్స్ పరీక్షించారు. దేశంలో కోవిడ్ పరీక్షల సామర్థ్యం పెరుగుతూ వచ్చి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1900 లాబ్ లు ఉన్న స్థితికి చేరింది. దేశంలో మొత్తం 1935 లాబ్ లు ఉండగా వాటిలో 1112 ప్రభుత్వ లాబ్ లు కాగా ప్రైవేట్ రంగంలో 823 ఉన్నాయి. మొత్తంగా చూసినప్పుడు రోజువారీ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచగలిగే పరిస్థితి వచ్చింది. 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జాతీయ సగటు కంటే తక్కువ శాతం పాజిటివ్ కేసులు నమోదు కావటం గమనించవచ్చు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో పాజిటివ్ కేసుల శాతం 8.04 ఉండగా అది క్రమంగా తగ్గుతూ వస్తోంది. భారతదేశంలో కొత్తగా కోలుకుంటున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతూ వస్తోంది. ఫలితంగా, చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు 8,26,876 మంది. మొత్తం నమోదైన పాజిటివ్ కేసులలో వీరి వాటా 11.42% మాత్రమే. 74,632 మంది కోవిడ్ బాధితులు గడిచిన 24 గంటలలో కోలుకున్నారు. కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ జరిగిన కేసుల సంఖ్య 63,509. ఇలా కోలుకున్నవారే ఎక్కువగా ఉండటం వల్ల జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 87.05 కు చేరుకోవటంతోబాటు ఇంకా పెరుగుదలబాట కొనసాగిస్తూ ఉంది. ఇప్పటిదాకామొత్తం కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 63,01, 927 కు చేరింది. కోలుకున్నవారికీ, చికిత్స పొందుతున్నవారికీ మధ్య తేడా 54,75,051 ఉంది. ఇలా కోలుకుంటున్నవారు పెరుగుతున్న కొద్దీ అంతరం కూడా విస్తరిస్తూ వస్తోంది. కోలుకున్నవారిలో 79% మంది 10 రాష్ట్రాల్లోనే కేంద్రీకృత మైనట్టు తెలుస్తోంది. అవి మహారాష్ట, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్, ఒడిశా, ఢిల్లీ, వీటిలో మహారాష్ట్ర ఒక్కరోజులో 15,00 కు పైగా కోలుకున్నవారిని నమోదు చేసుకొని మొదటి స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో 63,509 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కెసుల్లో 77% కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచే కావటం గమనార్హం. కొత్తగా నమోదవుతున్న కేసులలో కేరళ రాష్ట్రం మహారాష్ట్రను దాటిపోయింది. కేరళ, మహారాష్ట్ర, కర్నాటక 8,000 కు పైగా కేసులు నమోదవుతూ ఉండగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 4,000 కు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 730 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 80% మరణాలు కేవలం 10 రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 187 మరణాలు ( 25%) నమోదయ్యాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664297
రూ.68 825 కోట్ల సేకరణకు 20 రాష్ట్రాలకు అనుమతి.
బహిరంగ మార్కెట్ లో అదనంగా రూ.68 825 కోట్లను రుణాలుగా తీసుకోడానికి కేంద్రం 20 రాష్ట్రాలను అనుమతించింది. జి ఎస్ టి అమలు చేయడం వల్ల తగ్గిన ఆదాయ వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి ఆర్ధిక మంత్రిత్వ శాఖ సూచించిన మొదటి ఆప్షన్ కు అంగీకరించిన రాష్ట్రాలు తమ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ( జి ఎస్ డి పి)లో 0.50% వరకు ఈ రుణాలను సేకరించవచ్చు.
2020 ఆగష్టు 27 వ తేదీన జరిగిన జి ఎస్ టి కౌన్సిల్ సమావేశంలో రెండు ప్రతిపాదనలు తెచ్చి ఆ తరువాత వాటిని రాష్ట్రాలకు పంపడం జరిగింది. 20 రాష్ట్రాలు మొదటి ఆప్షన్ వైపు మొగ్గు చూపాయి. ఈ ఆప్షన్ కు అంగీకరించిన రాష్ట్రాలకు తగ్గిన పన్ను ఆదాయ లోటును భర్తీ చేసుకోవడానికి రుణ జారీని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక విభాగం సమన్వయం చేస్తుంది. రాష్ట్రాలకు ఈ పద్దు కింద 1.1 కోట్ల రూపాయల మేరకు ఆదాయం తగ్గిందని లెక్క వేశారు. కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని సంస్కరణల అంశాన్ని మినహాయిస్తూ అదనంగా సమీకరించుకోడానికి అనుమతించిన 2 శాతం మొత్తంలో రాష్ట్రాలు తమ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ( జి ఎస్ డి పి)లో 0 .50 %ను సమీకరించుకోడానికి అనుమతిస్తారు. .2020 మే 17 వ తేదీన తమ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ( జి ఎస్ డి పి)లో రెండు మొత్తాన్ని అదనంగా సమీకరించుకోడానికి రాష్ట్రాలకు ఖర్చుల విభాగం అనుమతి ఇచ్చింది. ఈ రెండు శాతం పరిమితిలో 0 . 5 % న నిధుల సమీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన నాలుగు సంస్కరణల్లో కనీసం మూడు అమలు చేసే అంశానికి ముడి పెట్టింది. దీంతో ఆప్షన్ 1 కి అంగీకరించిన 20 రాష్ట్రాలు బహిరంగ విపణి ద్వారా 68, 825 కోట్ల రూపాయలను సమీకరించుకోడానికి అర్హత సాధించాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664149
నియామక లేఖలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమర్పించిన స్విట్జర్లాండ్, మాల్టా, బోట్స్వానా దౌత్యాధికారులు
స్విట్జర్లాండ్, మాల్టా, బోట్స్వానా దౌత్యాధికారులు తమ నియామక పత్రాలను ఈరోజు వర్చువల్ విధానంలో జరిగిన వేడుకలో రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమర్పించారు. డాక్టర్ రాల్ఫ్ హెక్నర్ (స్విట్జర్లాండ్), శ్రీ రూబెన్ గౌసి (మాల్టా), శ్రీ గిల్బెర్ట్ షిమానే మంగోల్ ( బోట్స్వానా) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ, నియమితులైనవారికి అభినందనలు తెలియజేశారు. అంతర్జాతీయ సహకారపు అవసరాన్ని కోవిడ్ సంక్షోభం నొక్కి చెప్పిందన్నారు. అంతర్జాతీయ సమాజం త్వరలోనే ఈ మహమ్మారికి ఒక పరిష్కారం కనుక్కుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664344
196 జతల పండుగ స్పెషల్స్ కు రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం కో
పండుగ రద్దీని తట్టుకునేందుకు రైల్వే మంత్రిత్వశాఖ 196 జతల (392) ప్రత్యేక రైళ్ళు నడపటానికి ఆమోదముద్ర వేసింది. ఈ రైళ్ళు అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు నడుస్తాయి. ప్రత్యేక రైళ్ళకు వర్తించే చార్జీలే ఈ పండుగ స్పెషల్స్ కు కూడా వర్తిస్తాయి. ఆ రైళ్ళ జాబితా ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664226
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం వరి ధాన్యం సేకరణ వేగవంతం
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21 ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వం గరిష్ఠ మద్దతు ధర ప్రకారం కొనుగోళ్ళు ప్రారంభించింది. గత సీజన్ల లాగానే ప్రస్తుత గరిష్ఠ మద్దతు ధరకు అనుగుణంగా ఈ కొనుగోళ్ళు సాగుతున్నాయి. భారత ఆహార సంస్థతో బాటు ఇతర ప్రభుత్వ సంస్థలు 2020 అక్టోబర్ 12 వరకు 48.53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరి ధాన్యం సేకరించగా మద్దతు ధరకింద రూ. 9164.30 కోట్లు చెల్లించి 4.16 లక్షలమంది రైతులకు లబ్ధి చేకూర్చింది. ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా 630.06 మెట్రిక్ టన్నుల మినుములు, శెనగలు సేకరించగా రూ. 4.53 కోట్లు చెల్లించి 554 మంది తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా రైతులకు లబ్ధి చేకూర్చింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664232
పండుగ సీజన్ సందర్భంగా ప్రయాణీకులకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మార్గదర్శకాలు
పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైలు ప్రయాణీకులకోసం మార్గదర్శకాలు జారీచేసింది. రైల్వే స్టేషన్లలో ఉన్నప్పుడు, రైలులో ఉన్నప్పుడు, ఇతర రైల్వే ప్రాంతాలలో ఉన్నప్పుడు కోవిడ్ వ్యాప్తికి దారితీసే కొన్ని పనులకు ప్రజలు దూరంగా ఉండాలని కోరింది. దీనివలన రైల్వేలు అందించే సౌకర్యాలకు ఇబ్బంది కలగవచ్చునని హెచ్చరించింది. ఉద్దేశపూర్వకంగా ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించే చర్యలకు, ప్రమాదం కలిగించే పనులకు దూరంగా ఉందాలని కోరింది. నిర్లక్ష్యంగా వ్యవహరించే పక్షంలో జైలుశిక్ష, లేదా జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664497
పిఐబి క్షేత్ర సిబంది నుంచి అందిన సమాచారం
• హిమాచల్ ప్రదేశ్ : హిమాచల్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు అక్టోబర్ 14 నుంచి నడపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆ రాష్ట్ర రవాణాశాఖామంత్రి చెప్పారు. మొదటి దశలో 25 అంతర్రాష్ట్ర రూట్లలో సర్వీసులు నడుస్తాయన్నారు. చందీగఢ్, పఠాన్ కోట్, బడ్దీ, హోషియార్ పూర్, లుధియానా, అమ్బాలా, హరిద్వార్ అందులో ఉంటాయన్నారు. ఈ మార్గాల్లో రాత్రి సర్వీసులు సహా నాన్-ఎసి బస్సులు మాత్రమే నడుస్తాయి.
• అరుణాచల్ ప్రదేశ్ : అరుణాచల్ ప్రదేశ్ లో మరో 193 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు. 170 మంది కోవిడ్ నుమ్చించి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ లో మాత్రమే మొత్తం 28 మరణాలలో 11 కోవిడ్ కి సంబంధించినవి.
• అస్సాం: అస్సాంలో మరో 1482 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు. నిన్న 1020 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 196786 కు చేరగా 167056 మంది డిశ్చార్జ్ అయ్యారు., 28897 మంది ఇంకా చికిత్సలో ఉండగా 830 మంది ఇప్పటిదాకా మరణించారు.
• మేఘాలయ: మేఘాలయలో ఈరోజు 133 మంది కోవిడ్ బారినుంచి కోలుకున్నారు. చికిత్సలో ఉన్నవారు 2367 మంది కాగా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 5406.
• నాగాలాండ్ : నాగాలండ్ లో మరో 123 మంది కోవిడ్ పాజిటివ్ లుగా నమోదయ్యారు.
• కేరళ: కోవిడ్ బాధితులని డిశ్చార్జ్ చెయ్యటానికి కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. వీటి ప్రకారం రోగులని ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి. వేరు వేరు విభాగాలుగా వర్గీకరిస్తారు. లక్షణాలు కనబడని బాధితులకు 10 వ రోజున రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేస్తారు. నెగటివ్ వస్తే డిశ్చార్జ్ చేస్తారు. పాజిటివ్ వస్తే రోజు మార్చి రోజు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేస్తారు. నెగటివ్ వచ్చాకే డిశ్చార్జ్ చేస్తారు. అకస్మాత్తుగా కేసులు పెరుగుతూ ఉందటంతో ఈ కొత్త మార్గదర్శకాలు విడుదలచేసిన్మట్టు ఆరోగ్య శాఖామంత్రి చెప్పారు. అన్ని విఉభాగాల్ రోగులూ తప్పనిసరిగా 7 రోజుల క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుంది. నిన్న కేరళలో 8,764 కొత్త కేసులు వచ్చాయి. ప్రస్తుతం 95,407 మంది రోగులు చికిత్స పొందుతూ ఉన్నారు. 2.82 లక్షలమంది అబ్జర్వేషన్ లో ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,046 మరణాలు నమోదయ్యాయి..
• తమిళనాడు: కోవిడ్ పరిస్థితి దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. షణ్ముగంకు మూడు మెలల పదవీకాలం పొడిగింపు లభించింది. ఇది అయనకు రెండో విడత పొడిగింపు.ఇప్పుడున్న ఈ-పాస్ స్థానంలో త్వరలో ఈ-రిజిస్త్రేషన్ విధానం ప్రవేశ పెడుతున్నట్టు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడి హైకోర్టుకు తెలియజేసింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపటం మీద మూడు రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వ వివరణ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. వరుసగా రెండోరోజు కూడా తమిళనాడులో 5 వేలకు లోపే కేసులు నమోదయ్యాయి. మంగళ వారం నాడు 4,666 కెసులు రాగా 57 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు వచ్చిన కేసుల సంఖ్య 6,65,930 క, మరణాలు మొత్తం 10,371కి చేరాయి.
• కర్నాటక: వచ్చే పండుగ సీజన్ లో కోవిడ్ నిబంధనలు ఎలా అమలు చేస్తారో తెలియజేయాలని హైకోర్టు కర్నాటక ప్రభుత్వాన్ని కోరింది. కోవిడ్ రోగులకు పడకల అందుబాటుపై అఫిడవిట్ దాఖలు చేయాలని కూదా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. రేపు రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. మరింత సమన్వయం సాధించటానికి ఆరోగ్య, వైద్య విద్యా శాఖలు కలసి పనిచేస్తాయని మంత్రి డాక్టర్ కె సుధాకర్ చెప్పారు. మూఖ్యమంత్రి ఆదేసాలకు అనుగుణంగా అన్ని సమస్యలూ పరిష్కరిస్తామన్నారు. కర్నాటకలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య నిన్నటికి 6 లక్షలు దాటింది. అక్టోబర్ 1 నుంచి 1.17 లక్షలమంది కోలుకున్నారు.
• ఆంధ్రప్రదేశ్: 13 జిల్లాల ఫిల్మ్ ఎగ్జిబిటర్లు ఈరోజు విజయవాడలో సమావేశమయ్యారు. రేపటినుంచి థియేటర్లు తెరవకూడదని నిర్ణయించారు. తెరవటానికి ఒక్కొక్క థియేటర్ కి రూ. 10 లక్షలు ఖర్చవుతుందని, సగం కెపాసిటీతో నడపటం లాభదాయకం కాదని తేల్చారు. స్థిరమైన విద్యుత్ చార్జీల నిబంధన తొలగిమ్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ వెలుగు చూసినప్పటినుంచి ఏడు నెలలు పూర్తి కాగా మొత్తం 7,63,573 కేసులు వచ్చాయి. మరణాలు 6,291కి చేరాయి. ఇప్పటివరకు7,14,427 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 67 లక్షల శాంపిల్స్ పరీక్షించారు.
• తెలంగాణ: 1446 కొత్త కేసులు, 1918 కోలుకున్నవారు 8 8 మరణాలు గత 24 గంటలలో నమోదయ్యాయి. 1446 కెసులలో 252 హైదరాబాద్ పరిధిలోనివే. . మొత్తం 2,16,238 కెసులు కాగా చికిత్సలో ఉన్నవి 23,728 కేసులు; మరణాలు: 1241; డిశ్చార్జ్ అయినవారు :1,91,269 మంది. మంహళవారం నాడు హైదరాబాద్ లో అత్యధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరన పరొశోధనా సంస్థ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం కురిసింది. అనేక రోడ్లు, లోతట్టు ప్రాంతాలుమ్ జలమయమయ్యాయి.
• మహారాష్ట్ర: మహారాష్ట్రలో 12.5 లక్షల లోపభూయిష్టమైన ఆర్ టి-పిసిఆర్ పరీక్షల కిట్లు వాడకంలో ఉన్నట్టు తేలింది. వాటినిఉ మారుస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. ప్రభుత్వం వీటిని ఒక ప్రైవేట్ సంస్థనుంచి కొనుగోలు చేసిందన్నారు. వీటిని వాడుతూ జరిపిన పరీక్షలు తప్పుడు ఫలితాలు ఇచ్చాయన్నారు. పూణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ విషయాన్ని నిర్థారించిందన్నారు. ప్రభుత్వం వెంటనే వాటి వాడకం నిలిపివేసిందన్నారు. ఆ కంపెనీ మీద తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 8,522 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 15,356 మంది కోలుకోగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య 2,05,415 కు తగ్గింది.
• గుజరాత: గుజరాత్ లో చికిత్సలో ఉన్న కేసులు గత 24 గంటల్లో మొదటిసారిగా 10% లోపుకు తగ్గాయి. 1,375 మంది గత 24 గంటల్లో డిశ్చార్జ్ అయ్యారు.ప్పుడు చికిత్సలో ఉన్నవారి సంఖ్య 15,209 కు తగ్గింది. మంగళవారం కూడా 50,933 పరీక్షలు జరిగాయి. దీంతో మొత్తం పరీక్షలు 51.14 లక్షలు దాటాయి. ఇలా ఉందగా గుజరాత్ ప్రభుత్వం నర్మదా జిల్లాలోని ఐక్యతా స్ఫూర్తి మూర్తిని అక్టోబర్ 17 నుంచి పునఃప్రారంభించాలని నిర్ణయించింది.
• రాజస్థాన్ : కోవిడ్ నుమ్చి కోలుకున్నవారు ప్లాస్మా న్దానం చేయాలని రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా పిలుపునిచ్చారు. వ్యాధి తీవ్రంగా ఉన్న బాధితులు కోలుకోవటానికి సాయం చేయాలని కోరారు. ప్లాస్మా దానం చాలా సులభమని ఈ సందర్భంగా గుర్తు చేసారు. రాష్ట్రంలో కోలుకున్నవారు లక్షకు పైగా ఉన్నారని వాళ్లంతా ముందుకు రావాలని కోరారు. రాజస్థాన్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 21,924గా నమోదైంది.
• మధ్య ప్రదేశ్: తాజా కోవిడ్ కేసులు గత మూడు వారాల్లో 37% తగ్గాయి. కోలుకున్నవారి సాతం రాష్ట్రంలో 88.4% చేరింది. నేటికి రాష్ట్రంలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 661
• చతీస్ గఢ్: రాష్ట్రంలో కరోన వ్యాప్తి నివారించటానికి చేపట్టిన సర్వే అక్టోబర్ 12 న పూర్తయింది. దీనికింద ఇంటింటికీ సర్వే చేపట్టారు. గ్రామీన, పట్టఅ ప్రాంతాల్లో కోవిడ్ లక్షణాలున్న బాధితులను గుర్తించారు. 56 లక్షల ఇళ్ళు సర్వే చేయగా లక్షా ఏడు వేలకు ప్రజలకు పరీక్షలు జరపగా వారిలో 6,000 మందికి పైగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది.
• గోవా: గోవా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సినిమా థియేటర్లు గురువారం నుంచి తెరవటానికి అనుమతించినప్పటికీ థియేటర్ యజమానులు మాత్రం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేదాకా థియేటర్లు తెరవబోమని ప్రకటించారు.
*****
(Release ID: 1664592)
Visitor Counter : 323