రైల్వే మంత్రిత్వ శాఖ
కరోనా వైరస్ వ్యాప్తికి తోడ్పడే చర్యలు లేక ఉల్లంఘనలు రైల్వే యంత్రాంగం ప్రయాణీకులు అందించే సౌకర్యాలలో జోక్యం చేసుకోవడమే
ఉద్దేశపూర్వక ఉల్లంఘన లేక ఇతరుల భద్రత పట్ల నిర్లక్ష్యం లేక ఏ వ్యక్తి భద్రకు అయినా భంగం కలిగించడం లేక ప్రయాణిస్తున్న వ్యక్తి భ్రదతకు భంగం కలిగించే తొందరపాటు నిర్లక్ష్య చర్య లేక ఉల్లంఘన లేక రైల్వేలలో ఉండడాన్ని రైల్వే చట్టం, 1989లోని 145, 153, 154 సెక్షన్ల కింద శిక్షార్హం - అటువంటి వారికి జైలు శిక్ష లేక జరిమానా విధించడం జరుగుతుంది
Posted On:
14 OCT 2020 4:54PM by PIB Hyderabad
పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ప్రయాణీకులకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్్స (రైల్వే భద్రతా దళం) మార్గదర్శకాలను జారీ చేసింది. రైల్వే స్టేషన్లలో, రైళ్ళలో లేక ఇతర రైల్వే ప్రాంతాలలో దిగువ ఇచ్చిన పనులు చేయకుండా ఉండాలని సాధారణ ప్రజలకు సూచించింది:
1) మాస్క్ ధరించకపోవడం లేక మాస్్కను సరిగా ధరించకపోవడం
2) సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటించకపోవడం
3) కోవిడ్ పాజిటివ్ అని తేలిన తర్వాత రైల్వే ప్రాంతాలకు లేదా స్టేషన్‌కు రావడం లేదా రైలు ఎక్కడం
4) కరోనా వైరస్ పరీక్ష కోసం శాంపుళ్ళు ఇచ్చి, ఫలితాల కోసం వేచి చూస్తున్నప్పుడు రైల్వే ప్రాంతాలకు లేక స్టేషన్‌కు లేక రైలు ఎక్కడం.
5) రైల్వే స్టేషన్ వద్ద మోహరించిన హెల్త్ చెకప్ బృందం నిరాకరించిన తర్వాత కూడా రైలు ఎక్కడం
6) బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయడం లేక మల మూత్ర విసర్జనల వంటివి చేయడం
7) రైల్వే స్టేషన్లలో, రైళ్ళలో ప్రజారోగ్యానికి, భద్రతను ప్రబావివతం చేసేలా లేక అపరిశుభ్ర, అనారోగ్యకర పరిస్థితులను సృష్టించే కార్యకలాపాలకు పాల్పడడం.
8) కోవిడ్ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రైల్వే యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడకపోవడం
9) కరోనా వైరస్ వ్యాప్తికి తోడ్పడే చర్య కానీ మార్గదర్శకాలను అనుసరించకపోవడం.
కరోనావైరస్ వ్యాప్తి ఇటువంటి చర్యలు లేక ఉల్లంఘనలు తోడ్పడుతాయి కనుక, రైల్వే యంత్రాంగం అందించే ప్యాసెంజర్ సౌకర్యాలలో అది జోక్యం చేసుకోవడం అవుతుంది. తెలిసి తెలిసి చేసే ఉల్లంఘనలు లేక నిర్లక్ష్యం లేక ప్రయాణిస్తున్న ఏ వ్యక్తి భ్రదతకు అయినా భంగం కలిగించడం లేక ఆ చర్యలకు పాల్పడుతూ రైళ్ళల్లో ప్రయాణించడం రైల్వే చట్టం, 1989లోని సెక్షన్ 145, 153, 154 కింద నేరం. అటువంటి వారికి జైలు లేక జరిమానా విధించడం ద్వారా శిక్షించడం జరుగుతుంది.
***
(Release ID: 1664497)
Visitor Counter : 239