రాష్ట్రపతి సచివాలయం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'లెటర్ ఆఫ్ క్రెడెన్స్' సమర్పించిన స్విట్జర్లాండ్, మాల్టా, బోట్స్వానా రాయబారులు
Posted On:
14 OCT 2020 2:40PM by PIB Hyderabad
భారత్‌లో నియమితులైన స్విట్జర్లాండ్, మాల్టా, బోట్స్వానా రాయబారులు/హై కమిషనర్ల 'లెటర్ ఆఫ్ క్రెడెన్స్'ను రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమం జరిగింది. పరిచయ పత్రాలను అందజేసిన వారు:
1. డా.రాల్ఫ్ హెక్నర్, స్విట్జర్లాండ్ రాయబారి
2. రూబెన్ గౌసీ, మాల్టా హై కమిషనర్
3. గిల్బర్ట్ షిమానే మంగోల్, బోట్స్వానా హై కమిషనర్
భారత్‌లో నియమితులైన రాయబారులకు రాష్ట్రపతి కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ మూడు దేశాలు భారత్ మిత్రులని; శాంతి, శ్రేయస్సు దృష్టితో తమ బంధం లోతుగా వేళ్లూనుకుందని అన్నారు. 2021-22 కాలానికి ఐరాస భద్రత మండలిలో భారతదేశ తాత్కాలిక సభ్యత్వానికి మద్దతు తెలిపినందుకు మూడు దేశాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలందరి ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు కోసం ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవలసిన అవసరాన్ని కొవిడ్-19 గట్టిగా తెలియజెప్పిందని రాష్ట్రపతి అన్నారు. కొవిడ్ విరుగుడును ప్రపంచం త్వరలోనే కనిపెడుతుందని; బలమైన, స్థితిస్థాపక స్థాయికి పునఃనిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
***
(Release ID: 1664344)
Visitor Counter : 197