వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో ఎమ్.ఎస్.పి. ఆపరేషన్ కోసం వరి సేకరణ మంచిగా పుంజుకుంది

4.53 కోట్ల రూపాయల ఎమ్.ఎస్.పి. విలువ కలిగిన, 630.06 మెట్రిక్ టన్నుల శనగ పప్పు, మినప పప్పు; 52.40 కోట్ల రూపాయల ఎమ్.ఎస్.పి. విలువ కలిగిన, 5089 మెట్రిక్ టన్నుల కొబ్బరి; 122.52 కోట్ల రూపాయల ఎమ్.ఎస్.పి. విలువ కలిగిన, 43,376 బేళ్ళ పత్తి ని కూడా సేకరించడం జరిగింది.

Posted On: 13 OCT 2020 6:38PM by PIB Hyderabad

2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కె.ఎం.ఎస్) 2020-21 ఇప్పటికే ప్రారంభమైంది.  గత సీజన్లలో చేసినట్లుగా, ప్రస్తుత ఎమ్.ఎస్.పి. పథకాల ప్రకారం ప్రభుత్వం, 2020-21 ఖరీఫ్ లో పంటలను కూడా  రైతుల నుండి ఎం.ఎస్.పి. వద్ద సేకరిస్తూనే ఉంది.

వరి పండించే రాష్ట్రాలలో సేకరణ పరిమాణం పెరగడంతో, కే.ఎమ్.ఎస్. 2020-21 కోసం వరి సేకరణ ఊపందుకుంది.  ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి, భారత ఆహార సంస్థ, 12.10.2020 వరకు, 4.16 లక్షల మంది రైతుల నుండి మొత్తం 9164.30 కోట్ల రూపాయల ఎం.ఎస్.పి. విలువతో 48.53 లక్షల మెట్రిక్ టన్నుల వరిని, కొనుగోలు చేసింది. 

వరి పండించే ప్రధాన రాష్ట్రాలలో 12.10.2020 తేదీ వరకు వరి సేకరణ  వివరాలు :

 

    

వీటితో పాటురాష్ట్రాల ప్రతిపాదనల ఆధారంగా, తమిళనాడు, కర్ణాటకమహారాష్ట్రతెలంగాణగుజరాత్హర్యానాఉత్తర ప్రదేశ్ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాల కోసం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020 కోసం 41.67 లక్షల మెట్రిక్ టన్నుల పప్పులునూనె గింజలను సేకరించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది.  వీటితో పాటుఆంధ్రప్రదేశ్కర్ణాటకతమిళనాడుకేరళ రాష్ట్రాలకు 1.23 లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరి (బహు వార్షిక పంట) కొనుగోలుకు అనుమతి ఇవ్వబడింది.   ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కోసం ధర మద్దతు పథకం (పి.ఎస్.ఎస్) కింద పప్పుధాన్యాలునూనెగింజలుకొబ్బరి సేకరణకు కూడా ప్రతిపాదనలు స్వీకరించినప్పుడు అనుమతి ఇవ్వబడుతుంది.  అందువలనసంబంధిత రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలోగుర్తించిన పంట కాలం వ్యవధిలో మార్కెట్ రేటు ఎం.ఎస్.పి. కంటే తక్కువగా ఉన్నట్లయితేరాష్ట్రాలు గుర్తించిన సేకరణ  ఏజెన్సీల ద్వారా సెంట్రల్ నోడల్ ఏజెన్సీలుఎఫ్..క్యూగ్రేడ్ కు చెందిన  పంటలను నమోదు చేసుకున్న రైతుల నుండి నేరుగా 2020-21 సంవత్సరానికి ప్రకటించిన ఎం.ఎస్.పి. వద్ద సేకరించవచ్చు. 

12.10.2020 వరకు తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోని 554 మంది రైతుల నుండి  4.53 కోట్ల రూపాయల మేర ఎమ్.ఎస్.పి. విలువ కలిగిన  630.06 మెట్రిక్ టన్నుల పెసలు మరియు మినుములను ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీ  ద్వారా సేకరించింది.  అదేవిధంగా,  కర్ణాటకతమిళనాడు రాష్ట్రాలలోని 3,961 మంది రైతులకు లబ్ది చేకూరే  విధంగా 52.40 కోట్ల రూపాయల మేర ఎమ్.ఎస్.పివిలువ కలిగిన 5,089 మెట్రిక్ టన్నుల కొబ్బరి ని సేకరించడం జరిగింది.    కొబ్బరిమినుముల ధరల విషయానికి వస్తేవీటిని ప్రధానంగా పండించే చాలా రాష్ట్రాల్లోవీటి ధరలు ఎమ్.ఎస్.పికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నాయి.      పెసలుఇతర ఖరీఫ్ పప్పుధాన్యాలునూనెగింజలకు సంబంధించిఆయా రాష్ట్రాలు నిర్ణయించిన తేదీ నుండి సంబంధిత రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సేకరణను ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

 

 

  

2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో పత్తి గింజల (కపాస్) సేకరణ 2020 అక్టోబర్, 1 తేదీ నుండి ప్రారంభమైంది.   భారత ప్రత్తి సంస్థ 2020 అక్టోబర్, 12 తేదీ వరకు  8,943 మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా మొత్తం 12,252 లక్షల రూపాయల మేర ఎమ్.ఎస్.పి. విలువ కలిగిన  43,376   బేళ్లను సేకరించింది.

*****(Release ID: 1664232) Visitor Counter : 189