ఆర్థిక మంత్రిత్వ శాఖ

రూ.68 825 కోట్ల సేకరణకు 20 రాష్ట్రాలకు అనుమతి.

Posted On: 13 OCT 2020 6:28PM by PIB Hyderabad

బహిరంగ మార్కెట్ లో అదనంగా రూ.68 825 కోట్లను రుణాలుగా తీసుకోడానికి కేంద్రం ఈ రోజు 20  రాష్ట్రాలకు అనుమతి మంజూరు చేసింది. దీనికి సంబంచింది కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ ఖర్చుల శాఖ అనుమతులు జారీచేసింది.

    జి ఎస్ టి అమలు చేయడం వల్ల తగ్గిన ఆదాయ వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి ఆర్ధిక మంత్రిత్వ శాఖ సూచించిన రెండు ఆప్షన్లలో మొదటి ఆప్షన్ కు అంగీకరించిన రాష్ట్రాలు తమ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ( జి ఎస్ డి పి)లో  0 . 50 %వరకు ఈ రుణాలను సేకరించవచ్చును.

2020 ఆగష్టు 27 వ తేదీన జరిగిన జి ఎస్ టి కౌన్సిల్ సమావేశంలో రెండు ప్రతిపాదనలు తెచ్చి ఆ తరువాత వాటిని రాష్ట్రాలకు పంపడం జరిగింది. 20 రాష్ట్రాలు మొదటి ఆప్షన్ వైపు మొగ్గు చూపాయి. ఆంధ్రప్రదేశ్,అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజొరాం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మొదటి ఆప్షన్ కు అంగీకరించాయి. ఎనిమిది రాష్ట్రాలు నిర్ణయాన్ని తీసుకోవలసి ఉంది.    మొదటి ఆప్షన్ కు అంగీకరించిన రాష్ట్రాలకు లభించే సౌకర్యాలు:

   ఎ. తగ్గిన పన్ను ఆదాయ లోటును భర్తీ చేసుకోవడానికి రుణ జారీని  ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక విభాగం సమన్వయం చేస్తుంది. రాష్ట్రాలకు  ఈ పద్దు కింద సుమారు 1 . 1 కోట్ల రూపాయల మేరకు ఆదాయం తగ్గిందని లెక్క వేయడం జరిగింది.

  బి. కోవిద్ వల్ల ఏర్పడిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని  సంస్కరణల అంశాన్ని మినహాయిస్తూ అదనంగా సమీకరించుకోడానికి అనుమతించిన రెండు శాతం మొత్తంలో రాష్ట్రాలు తమ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ( జి ఎస్ డి పి)లో  0 . 50 %ను సమీకరించుకోడానికి అనుమతి ఇవ్వడం.

         2020 మే 17 వ తేదీన తమ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ( జి ఎస్ డి పి)లో రెండు మొత్తాన్ని అదనంగా సమీకరించుకోడానికి రాష్ట్రాలకు ఖర్చుల విభాగం అనుమతి ఇచ్చింది. ఈ రెండు శాతం పరిమితిలో 0 . 5 % న నిధుల సమీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన నాలుగు సంస్కరణల్లో కనీసం మూడు వాటిని అమలు చేసే అంశానికి ముడి పెట్టడం జరిగింది. అయితే, మొదటి ఆప్షన్ కు అంగీకరించిన రాష్ట్రాలకు జి ఎస్ టి అమలు వల్ల ఆదాయంలో తగ్గిన  లోటును భర్తీ చేసుకోడానికి అదనపు రుణాలను సమీకరించుకోడానికి ముందు అమలు చేయవలసి ఉన్నసంస్కరణల నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. దీనితో ఆప్షన్ 1 కి అంగీకరించిన 20 రాష్ట్రాలు బహిరంగ విపణి ద్వారా 68, 825 కోట్ల రూపాయలను సెమీకరించుకోడానికి అర్హత సాధించాయి. రుణ సమీకరణ కోసం ఏర్పాటు అయ్యే ప్రత్యేక వేదికపై చర్యలను తీసుకోవడం జరుగుతుంది.         

 

S.

No.

State

Additional borrowing allowed on 13.10.2020

(Rs in crore)

1

Andhra Pradesh

5,051.00

2

Arunachal Pradesh

143.00

3

Assam

1,869.00

4

Bihar

3,231.00

5

Goa

446.00

6

Gujarat 

8,704.00

7

Haryana

4,293.00

8

Himachal Pradesh 

877.00

9

Karnataka

9,018.00

10

Madhya Pradesh

4,746.00

11

Maharashtra

15,394.00

12

Manipur

151.00

13

Meghalaya

194.00

14

Mizoram

132.00

15

Nagaland

157.00

16

Odisha

2,858.00

17

Sikkim     

156.00

18

Tripura

297.00

19

Uttar Pradesh

9,703.00

20

Uttarakhand

1,405.00

 

Total

68,825.00

 

***

 (Release ID: 1664149) Visitor Counter : 27