రైల్వే మంత్రిత్వ శాఖ
196 జతల "పండుగ ప్రత్యేక రైళ్ల"కు రైల్వే శాఖ ఆమోదం ఈనెల 20 నుంచి వచ్చేనెల 30 వరకు పండుగ ప్రత్యేక రైళ్ల సేవలు పండుగ ప్రత్యేక రైళ్ల ఛార్జీలు ప్రత్యేక రైళ్లకు వర్తింపు
प्रविष्टि तिथि:
13 OCT 2020 6:45PM by PIB Hyderabad
వరుసగా వస్తున్న పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని, 196 జతల (392) "పండుగ ప్రత్యేక రైళ్ల"ను నడిపేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈనెల 20 నుంచి పండుగ ప్రత్యేక రైళ్ల సేవలు అందుబాటులోకి వస్తాయి. వచ్చేనెల 30 వరకు కొనసాగుతాయి. పండుగ ప్రత్యేక రైళ్ల ఛార్జీలు ప్రత్యేక రైళ్లకు వర్తిస్తాయి.
జోనల్ రైల్వేలు, వాటి పరిధిలోని పండుగ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌ను ముందుగానే తెలియజేస్తాయి. క్రింది లింక్ ద్వారా రైళ్ల జాబితాను చూడవచ్చు.
196 జతల రైళ్ల వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
(रिलीज़ आईडी: 1664226)
आगंतुक पटल : 372