PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 28 SEP 2020 6:07PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్తవాలను నిఖీచేసిన అంశాలు ఇందులో భ్యవుతాయి)

  • దేశంలో 50 క్షల (50,16,520) మైలురాయిని దాటిన కోలుకునేవారి సంఖ్య; గత 24 గంటల్లో 74,893 మందికి వ్యాధి నయం.
  • రోజువారీ అత్యధికంగా కోలుకునేవారి సంఖ్య లోగడ పలు రోజులపాటు వరుసగా 90,000గా నమోదు.
  • కోలుకునేవారి జాతీయ సగటు నేడు 82.58 శాతానికి పెరుగుదల.
  • గడచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య 82,170.
  • కోవిడ్సంక్షోభం వేళ దేశవ్యాప్తంగా రైతులు అద్భుత సంకల్పబలం ప్రదర్శించారని ప్రధానమంత్రి ప్రశంస.
  • దేశంలో 4 లక్షల దూరవాణి-సంప్రదింపుల మైలురాయిని చేరుకున్న కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని -సంజీవని వేదిక.
  • వైద్యపరమైన ద్రవ-వాయు ఆక్సిజన్సిలిండర్ల ధరలపై పరిమితి నిర్దేశించిన ఎన్పీపీఏ.

దేశంలో 50 ల‌క్ష‌ల మైలురాయిని దాటిన కోలుకునేవారి సంఖ్య‌; 11 రోజుల్లోనే 10 ల‌క్ష‌ల మందికి న‌యం; ప‌్ర‌స్తుత కేసుల‌క‌న్నా కోలుకున్న‌వి 5 రెట్లకుమించి అధికం

దేశంలో కోవిడ్-19 నుంచి కోలుకున్నవారి సంఖ్య 50 ల‌క్ష‌లు (50,16,520) దాట‌డంతో భార‌త్ ఇవాళ స‌రికొత్త మైలురాయిని అధిగ‌మించింది. ఒకేరోజు అధిక సంఖ్య‌లో వ్యాధి న‌య‌మ‌య్యేవారి సంఖ్య కొన‌సాగుతోంది. ఈ మేర‌కు గ‌త 24 గంట‌ల్లో 74,893 మంది కోలుకున్నారు. కాగా, రోజువారీగా 90,000 మంది వ‌ర‌కూ వ్యాధి న‌యం చేసుకుని ఇళ్ల‌కు వెళ్లిన ఉదంతాలు ఇప్ప‌టికే ప‌లు రోజుల్లో న‌మోద‌య్యాయి. త‌ద‌నుగుణంగా ప్రస్తుత కేసుల‌తో పోలిస్తే కోలుకున్న‌వి 5 రెట్ల‌కుమించి న‌మోదవ‌గా నేడు స‌గ‌టు 82.58 శాతంగా ఉంది. మొత్తంమీద గ‌డ‌చిన నెల వ్య‌వ‌ధిలో కోలుకునేవారి స‌గ‌టు దాదాపు 100 శాతానికి చేరింది. ఈ విష‌యంలో 15 రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాలు జాతీయ స‌గ‌టును మించి న‌మోదు చేశాయి. ఈ మేర‌కు తాజాగా కోలుకున్నవారిలో 73 శాతం ప‌ది రాష్ట్రాలు- మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, కేరళ, ఒడిషా, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌ల‌లోనే ఉన్నారు. వీటిలోనూ 13,000 మంది కోలుకున్న మహారాష్ట్ర అగ్ర‌స్థానంలో ఉంది. కాగా 2020 జూన్ 1 నుంచి వ్యాధి న‌య‌మ‌య్యేవారి సంఖ్య వేగంగా పెరుగుతూ కేవ‌లం గ‌త 11 రోజుల్లోనే 10 ల‌క్ష‌ల మంది కోలుకున్నారు. ఇక ఇప్ప‌టిదాకా దేశ‌వ్యాప్తంగా కోలుకున్న మొత్తం రోగుల‌లో 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 78 శాతం ఉండ‌గా, ఈ స‌గ‌టు గ‌రిష్ఠంగా న‌మోదైన రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తంమీద గ‌డ‌చిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 82,170 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల‌లో 79 శాతం ప‌ది రాష్ట్రాల్లోనివి కాగా- మ‌హ‌రాష్ట్ర 18,000, క‌ర్ణాట‌క 9,000 వంతున గ‌రిష్ఠంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో ప్ర‌థ‌మ‌, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. భార‌త్‌లో గ‌త 24 గంటల్లో 1,039 మ‌ర‌ణాలు సంభ‌వించ‌గా- వీటిలో 84 శాతం ప‌ది రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల్లోనివే. ఇక నిన్న‌టి మొత్తం మ‌ర‌ణాల్లో 36 శాతం (380) ఒక్క మ‌హారాష్ట్రలో న‌మోదైన‌వి కాగా- త‌మిళ‌నాడు (80), క‌ర్ణాట‌క (79) మ‌ర‌ణాల‌తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659752

దేశంలోని రైతులకు ప్రధానమంత్రి ప్రశంస

కోవిడ్-19 సంక్షోభ సమయంలో దేశవ్యాప్తంగా రైతులు అద్భుతమైన సంకల్పబలం ప్రదర్శించారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’లో ప్రసంగిస్తూ- వ్యవసాయ రంగం శక్తిమంతంగా ఉంటే స్వయం సమృద్ధ భారతం కూడా బలంగానే ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఈ రంగం అనేక బంధనాల నుంచి విముక్తమైందని, అనేకానేక అపోహలను కూడా ఛేదించిందని గుర్తుచేశారు. ఇప్పుడిక కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకునే అధికారం రైతుకు సంక్రమించిందని తెలిపారు. వారి ప్రగతికి ఇదే సముచిత మార్గమని, ఇవాళ ఇది అన్నిరకాల ఉత్పత్తులకూ సంబంధించి దేశంలోని రైతులందరికీ అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. పండ్లు, కూరగాయలను వ్యవసాయ మార్కెట్ల పరిధినుంచి తప్పించడంవల్ల కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. మహారాష్ట్రలో రైతు ఉత్పత్తుల సంస్థ ‘శ్రీ స్వామి సమర్థ ఫార్మ్‌ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌’ను ఉదాహరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659558

మన్‌ కీ బాత్‌ 2.0’ 16వ సంచికలో భాగంగా 27.09.2020న  ప్రధాని ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659558

సండే సంవాద్-3లో సామాజిక మాధ్య‌మ వాడకందారులతో డాక్టర్ హర్షవర్ధ‌న్ మాటామంతీ

సండే సంవాద్-3లో భాగంగా కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిన్న సామాజిక మాధ్య‌మ వాడకందారులతో మాటామంతీ కార్యక్రమం నిర్వ‌హించారు. దేశంలో ప్రస్తుత కోవిడ్ సంక్షోభం, మౌలిక వైద్య సౌక‌ర్యాలు, ప్రజారోగ్యం భవిష్యత్తు, వాతావరణ మార్పులపై పరిశోధనలో భారత్ పాత్ర త‌దితర ప‌లు ప్రశ్నలకు సంద‌ర్భంగా ఆయ‌న జ‌వాబులిచ్చారు. ప్రభుత్వం, పౌర‌ సమాజం కలసిక‌ట్టుగా పోరాడితేనే మహమ్మారిని అంతం చేయగలమని స్ప‌ష్టం చేశారు. ఇందులో భాగంగా  “రెండు గ‌జాల దూరం-మ‌రింత అవ‌గాహ‌న‌తో క‌రోనాపై ఎదురుదాడి” అంటూ స‌రికొత్త నినాదమిచ్చారు. ఐసీఎంఆర్ సెరో సర్వే నివేదికతో ప్రజలు ఉదాసీనంగా ఉండరాదని ఆయన హెచ్చరించారు. దేశవ్యాప్తంగా నవ్య కరోనా వైరస్‌ వ్యాప్తి 0.73 శాతం మాత్రమేనని 2020 మే నెలలో నిర్వహించిన తొలి సర్వేలో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో కోవిడ్ పరీక్షల ధరలను తగ్గించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించినట్లు డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659611

ఆరోగ్యశాఖ వేదిక -సంజీవనిదూరవాణి సంప్రదింపులలో కొత్త మైలురాయి

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని ఈ-సంజీవని ఓపీడీ వేదిక దేశవ్యాప్తంగా 4 లక్షల దూరవాణి-సంప్రదింపుల మైలురాయిని చేరుకుంది. ఈ మేరకు అత్యధిక  సంఖ్యలో ఓపీడీ సంప్రదింపులరీత్యా తమిళనాడు (1,33,167), ఉత్తరప్రదేశ్ (1,00124) ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. హిమాచల్ ప్రదేశ్ (36,527), కేరళ (33,340), ఆంధ్రప్రదేశ్ (31,034), ఉత్తరాఖండ్ (11,526), ​​గుజరాత్ (8914), మధ్యప్రదేశ్ (8904), కర్ణాటక (7684), మహారాష్ట్ర (7103) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా- తమిళనాడులో విల్లుపురంవంటి చిన్న జిల్లాల్లో ప్రజలు ఈ-సంజీవని సేవను విరివిగా వినియోగించుకోగా 16,000 సంప్రదింపులు నమోదవడం గమనార్హం. మొత్తంమీద జాతీయంగా ఈ-సంజీవని వేదికను 26 రాష్ట్రాలు ఉపయోగిస్తున్న నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విభాగాలు నియమించిన 12,000 వైద్యులు దూరవాణి-సంప్రదింపుల సేవల్లో భాగస్వాములయ్యారు. దేశంలోని 510 జిల్లాల ప్రజలు వారి సేవలను వాడుకోవడంతో తొలి 1,00,000 సంప్రదింపులు పూర్తయ్యేందుకు 3 నెలలు పట్టగా- చివరి 1,00,000 కేవలం 18 రోజుల్లోనే నమోదవడం విశేషం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659422

సీఎస్‌ఆర్‌ నిధులనుంచి రూ.2.5 కోట్ల చెక్కును కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే సమక్షంలో ఐసీఎంఆర్‌కు అందజేసిన ఫోర్టిస్ హెల్త్‌కేర్

ప్రైవేటురంగ వైద్యసేవా సంస్థ ఫోర్టిస్ హెల్త్‌కేర్ శనివారం తమ కార్యాలయంలో కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమశాఖ మంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే సమక్షంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధుల నుంచి రూ.2.5 కోట్ల చెక్కును ఐసీఎంఆర్‌కు అందజేసింది. ఈ సందర్భంగా  శ్రీ చౌబే మాట్లాడుతూ- “పరిశోధన రంగంలో అత్యుత్తమ పరామితులను నెలకొల్పిన సంస్థ ఐసీఎంఆర్‌.. దేశంలోనేగాక అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ పరిశోధన సంస్థలలో ఒకటి. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సంక్షోభ సమయాన తొలిరోజునుంచే సంస్థ శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు నిర్విరామంగా కృషిచేశారు” అని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659348

వైద్యపరమైన ద్రవ-వాయు ఆక్సిజన్ సిలిండర్ల ధరలపై పరిమితి నిర్దేశించిన ఎన్పీపీఏ

కోవిడ్‌-19 ప్రస్తుత పరిస్థితి ఫలితంగా దేశంలో వైద్యపరమైన ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రాణవాయు లభ్యతకు చాలా ప్రాముఖ్యం ఉండటంతో చాలా రాష్ట్రాలు/కేంద్ర  ప్రాంతాలు ఇతర రాష్ట్రాలనుంచి ఆక్సిజన్‌ సరఫరాలపై ఆధారపడి ఉన్నాయి. ఆ మేరకు ప్రాణవాయువు నిరంతర సరఫరాకు కట్టుబడిన కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. అయినప్పటికీ ద్రవ, వైద్య ఆక్సిజన్‌ ధరలపై పరిమితి లేనందువల్ల తయారీదారులు సిలిండర్ల ధరలను పెంచేశారు. దీంతో ద్రవ ఆక్సిజన్‌ను సరసమైన ధరలకు సరఫరా చేసేలా చూడటం కోసం ధరలపై పరిమితి విధించడంపై పరిశీలించాలని సాధికార బృందం-2 ఎన్‌పీపీఏకి సిఫారసు చేసింది. తదనుగుణంగా ఎన్‌పీపీఏ ద్రవ-వైద్యపరమైన ఆక్సిజన్‌ ధరలపై పరిమితి విధించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659424

ఖరీఫ్ 2020-21లో రాష్ట్రాలకు కనీస మద్దతుధర కార్యకలాపాల కోసం తొలి విడతగా రూ.19,444 కోట్లు మంజూరు చేసిన ఎన్‌సీడీసీ

ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, తెలంగాణ రాష్ట్రాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కార్యకలాపాల కింద కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ పరిధిలోని అత్యున్నత ఆర్థిక సహాయ విభాగం ‘జాతీయ సహకార అభివృద్ధి సంస్థ’ (ఎన్‌సీడీసీ) తొలివిడత కింద రూ.19444 కోట్లు మంజూరు చేసింది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఎన్‌సీడీసీ తీసుకున్న ముందస్తు చర్యతో దేశవ్యాప్త ధాన్యం ఉత్పత్తిలో దాదాపు 75 శాతం వాటాగల ఈ మూడు రాష్ట్రాల రైతులకు అవసరమైన ఆర్థిక సహాయం అందుతుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659715

టోక్యో వెళ్లాల్సిన పారా అథ్లెట్లు-అథ్లెట్లకు కోవిడ్‌ నుంచి రక్షణకోసంఎన్‌సిఓఈ-ఇంటెగ్రిటీ ఆఫ్ జోనింగ్‌లో సాయ్‌ సమగ్ర శిక్షణ ప్రణాళిక

‘ఖేలో ఇండియా ఫిర్ సే’ తదుపరి దశలో భాగంగా టోక్యో ఒలింపిక్స్‌కు  వెళ్లే పారా అథ్లెట్లు-అథ్లెట్ల కోసం దేశంలోని ‘జాతీయ క్రీడా నైపుణ్య కేంద్రం’ (NCOEs)లో క్రీడా కార్యకలాపాలను దశలవారీగా పునఃప్రారంభించాలని భారత క్రీడా ప్రాధికార సంస్థ (SAI) నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలిదశ కింద జూన్ నెలారంభంలో వివిధ కేంద్రాలలో ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లకు మాత్రమే శిక్షణను ప్రారంభించింది. తదుపరి దశకింద కోవిడ్‌ నుంచి రక్షణ కల్పిస్తూ (2024 పారిస్ ఒలింపిక్స్, 2022 ఆసియా/కామన్వెల్త్ క్రీడల దృష్ట్యా) పారా-అథ్లెట్లు, ఇతర అథ్లెట్లకు తొమ్మిది క్రీడా విభాగాల్లో శిక్షణకు ప్రణాళిక సిద్ధం చేసింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659684

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: కోవిడ్‌-19 సంక్రమణ గొలుసును ఛేదించే దిశగా పంజాబ్ ఆరోగ్య విభాగం పరిచయాల అన్వేషణ కార్యక్రమం చేపట్టింది. మేరకు కోవిడ్సోకిన వ్యక్తులతో సగటు పరిచయాలున్న 7.6 మంది వంతున గతవారం గుర్తించి, పరీక్షలు కూడా నిర్వహించారు. పరిచయాలున్న వ్యక్తులను పసిగట్టడం, సత్వరం నమూనాలు సేకరణ/పరీక్షల నిర్వహణ చేపట్టడమే వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కీలకమని పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి అన్నారు.
  • హర్యానా: రాష్ట్రంలో ప్రస్తుతం 46,367 నిర్బంధవైద్య పర్యవేక్షణ పడకలు, 3486 నియంత్రణ మండళ్లు, 10,145 ఏకాంత చికిత్స పడకలు, 2,231 ఐసీయూ పడకలు, 1,070 వెంటిలేటర్లు, 3.78 లక్షల పీపీఈ కిట్లు, 7.25 లక్షల ఎన్-95 మాస్కులు అందుబాటులో ఉన్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. దీంతోపాటు ప్రైవేటు ప్రయోగశాలల్లో కోవిడ్-19 పరీక్ష ధరలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేరకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు రూ.2,400, రాపిడ్ యాంటిజెన్ పరీక్షకు రూ.650, ఎలిసా పరీక్షకు రూ.250 వంతున నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కొద్ది రోజులుగా కోవిడ్ మరణాలు పెరగడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నేపథ్యంలో రోగులకు... ముఖ్యంగా ఇతరత్రా అనారోగ్యాలతో బాధపడే కోవిడ్రోగులకు సరైన చికిత్స అందించేలా చూడాలని వైద్యనిపుణులకు సూచించారు. అలాగే లక్షణరహిత రోగులకు ఏకాంత గృహ చికిత్సకు సముచిత విధానాన్ని అనుసరించాలని ఆయన అన్నారు. కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులలో సరైన పరిశుభ్రత, పారిశుధ్యం పాటించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
  • అసోం: రాష్ట్రంలో 875 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,69,985కు పెరిగింది. కాగా, 1670 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లడంతో మొత్తం వ్యాధి నయమైనవారి సంఖ్య 1,39,977కు చేరింది. ప్రస్తుతం క్రియాశీల రోగుల సంఖ్య 29,350 కాగా, మృతుల సంఖ్య 655గా ఉంది.
  • మణిపూర్: రాష్ట్రంలో 248 కొత్త కేసులు నమోదవగా, మొత్తం కేసులు 10,299కి పెరిగాయి. మణిపూర్లో 76 శాతం కోలుకునే సగటుతో ప్రస్తుతం 2106 క్రియాశీల కేసులున్నాయి.
  • మేఘాలయ: రాష్ట్రంలో ఒకేరోజు అత్యధికంగా 311 మంది కోలుకోగా ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1515గా ఉంది. ఇక మేఘాలయలోఇప్పటిదాకా 3654 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలో కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో కొహిమాలోని మరిన్ని ప్రదేశాల్లో దిగ్బంధం ప్రకటించారు. మేరకు జైనుయోబాడ్జే, కెఎంసి టాటా పార్కింగ్, ఎగువ బయాబు, ఎల్ ఖేల్ గ్రామం, ఆఫీసర్స్ హిల్, మినిస్టర్స్ హిల్, లీరి కాలనీ, పాటర్లేన్ వద్దగల నివాసాలకు సీలువేశారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలోని మరాఠ్వాడా ప్రాంతంతోపాటు, నాసిక్ డివిజన్లో చేపట్టిన కోవిడ్ సంబంధిత చర్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమీక్షించారు. లక్షణరహిత రోగుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేస్తూ వారు ఇళ్లలోనే చికిత్స పొందడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉండాలని, బయట తిరుగుతూ ఇతరులకు వ్యాధి సంక్రమింపజేయరాదని సూచించారు. కాగా, మహారాష్ట్రలో ప్రస్తుతం 2.73 లక్షల క్రియాశీల కేసులున్నాయి.
  • గుజరాత్: రాష్ట్రంలో పౌరులు-వాణిజ్య సంస్థలుసహా కోవిడ్నిబంధనలను ఉల్లంఘించిన వారినుంచి అహ్మదాబాద్ పురపాలక సంస్థ ఇప్పటిదాకా రూ.5.5 కోట్లకుపైగా జరిమానా వసూలుచేసింది. భారీస్థాయి నియంత్రణ కార్యక్రమం నిర్వహించినా ప్రజలు ఇప్పటికీ మార్గదర్శకాలను పాటించడం లేదని పురపాలక సంఘం విచారం వ్యక్తం చేసింది. కోవిడ్ సముచిత ప్రవర్తన అలవరచేందుకు AMC 48 వార్డులకుగాను 192 బృందాలను ఏర్పాటు చేసింది.
  • రాజస్థాన్: రాష్ట్ర రాజధాని జైపూర్లో క్రియాశీల కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల సమన్వయంతో రాజస్థాన్ప్రభుత్వం కోవిడ్ చికిత్స సదుపాయాల మెరుగులో భాగంగా 2 వేల అదనపు పడకల ఏర్పాటు చర్యలు చేపట్టింది. మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ జైపూర్, జోధ్పూర్, కోటా, ఉదయపూర్, అజ్మీర్, బికానెర్ జిల్లా కేంద్రాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కోవిడ్ చికిత్స కోసం 30 శాతం పడకలను కేటాయించాలని ఆదేశించారు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కరోనా వైరస్వ్యాప్తి దృష్ట్యా మధ్యప్రదేశ్ జైళ్లలోని 3,900మంది ఖైదీలకు పెరోల్మంజూరుచేసిన ప్రభుత్వం తాజాగా దీన్ని మరో 60 రోజులు పొడిగించింది. రాష్ట్రంలోని 125జైళ్లలో 43,000 మందికిగాను 3,900 మందికిపైగా ఖైదీలకు పెరోల్‌, మరో 3 వేలమందికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
  • ఛత్తీస్గఢ్‌: రాష్ట్రంలో మహమ్మారి విజృంభణ నేపథ్యంలో 14 పురపాలక సంఘాల్లో పరిధిలోని అన్ని పట్టణ మురికివాడలలో ఇకపై ఇళ్లముంగిటకే వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. మేరకు ప్రభుత్వం సంచార వైద్యశాలల ద్వారా ప్రజలకు చికిత్సను చేరువ చేసింది. తొలిదశలో ఇలాంటి 60 యూనిట్లను ప్రారంభిస్తారు. వీటిలో ఒక డాక్టర్తోపాటు పారామెడికల్సిబ్బంది ఉంటారు. కాగా, ఛత్తీస్గఢ్లో 31,616 యాక్టివ్ కేసులున్నాయి.
  • కేరళ: రాష్ట్రంలో రోజువారీ నమోదయ్యే కేసుల సంఖ్య వరుసగా రెండోరోజు 7000 దాటగా, మరణాల సంఖ్య 700 స్థాయిని అధిగమించింది. దీంతో వైరస్నిరోధానికి దిగ్బంధం ఆంక్షలు విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిపై చర్చల కోసం రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. మరోవైపు భారీగా కేసులున్న రాజధాని జిల్లాలో సంపూర్ణ దిగ్బంధం విధించాలని తిరువనంతపురం జిల్లా యంత్రాంగం ప్రభుత్వాన్ని కోరింది. కాగా, రాష్ట్రంలో మరో 6 కోవిడ్ మరణాలతో మృతుల సంఖ్య ఇవాళ 703కు చేరింది. కేరళలో ఆదివారం 7,445 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 56,709మంది చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 2,27,831 మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కరైకల్లో అక్టోబర్ 5నుంచి పాఠశాలలు దశలవారీగా పునఃప్రారంభం కానున్నాయి. కాగా, విద్యార్థులపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఆన్లైన్తరగతులు, వీడియో పాఠాల ప్రసారాలకు నెల 25దాకా ప్రభుత్వం విరామం  ప్రకటించింది. కోయంబత్తూర్లో నిర్ధారిత కోవిడ్కేసులను 5 శాతంకన్నా తక్కువకు తెచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.షణ్ముగన్ ఇవాళ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
  • కర్ణాటక: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కర్ణాటకలోని రైతు సంస్థలు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించగా, మిశ్రమ స్పందన లభించింది. కాగా, బెంగళూరు నగరంలో ఇవాళ ఆరోగ్యశాఖ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉమ్మడి న్యాయ ప్రవేశపరీక్ష నిర్వహించారు. బెంగళూరులో నిన్న 4217 కొత్త కేసులతో ఒకేరోజులో అత్యధికంగా నమోదైనట్లయింది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా కేసులపై ఆన్లైన్అప్పాయింట్మెంట్విధానాన్ని దేశంలోనే తొలిసారిగా కర్ణాటక హైకోర్టు ప్రవేశపెట్టింది.
  • ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, తమిళనాడుల నుంచి ఇతర ప్రాంతాలకు కోవిడ్వ్యాప్తి పెద్దగా లేదనిజర్నల్ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్లో ప్రచురితమైన ఐఐటీ-మండీ పరిశోధనాధ్యయనం పేర్కొంది. దీని ప్రకారం... యునైటెడ్కింగ్డమ్‌, దుబాయ్ నుంచి భారత్వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులద్వారా ప్రధానంగా కరోనా వైరస్మన దేశంలోకి ప్రవేశించింది. ఆర్టీసీ బస్సులను పూర్తి సీట్ల సామర్థ్యంతో నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం కోవిడ్-19 పరిమితులను తొలగించింది. కాగా, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని సమాచారం. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1378 కొత్త కేసులు, 7 మరణాలు నమోదవగా, 1932మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 254 జీహెచ్ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,87,211; క్రియాశీల కేసులు: 29,673; మరణాలు: 1107; డిశ్చార్జి: 1,56,431గా ఉన్నాయి. రాష్ట్రంలో 20 మంది ఆరోగ్య కార్యకర్తలు ఇప్పటికే కోవిడ్-19 (రాష్ట్రాల స్థాయిలో ఆరో అత్యధికం)కు బలికాగా, మహమ్మారి సంక్షోభం మొదలైనప్పటి నుంచి కోవిడ్నిర్ధారణ అయిన ఆరోగ్య కార్యకర్తల సంఖ్య 2,500 దాటిందని అధికారవర్గాలు తెలిపాయి. పరిశ్రమలకు ఉత్తేజమివ్వడంపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడాలేని విధంగా వలస కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పేర్ల నమోదు, సరైన వేతనాలకు హామీతో నిర్ణీతకాల కాంట్రాక్టువంటి అంశాలతో రక్షణ కల్పించనుంది.

***



(Release ID: 1659889) Visitor Counter : 181