యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
టోక్యో పోటీలలో పాల్గొననున్న పారాఅథ్లెట్, అథ్లెట్‌లకు ఎన్.సి.ఒ.ఇలలో అక్టోబర్5 నుంచి సమగ్ర శిక్షణకు ఎస్.ఎ.ఐ ఏర్పాట్లు.
కోవిడ్ మహమ్మారి నుంచి క్రీడాకారులకు సమగ్ర రక్షణకుచర్యలు
Posted On:
27 SEP 2020 7:52PM by PIB Hyderabad
ఖేలో ఇండియా ఫిర్ సే కార్యక్రమం తదుపరి దశలోకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్.ఎ.ఐ) అడుగు పెట్టింది. టోక్యోలో ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లు,పారా అథ్లెట్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కు దేశవ్యాప్తంగా గల నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్‌సిఒఇ)లలో దశలవారీగా క్రీడాకార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.
తొలిదశలో, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూన్ మొదట్లో వివిధ ఎస్.ఎ.ఐ కేంద్రాలలో ఒలింపిక్ క్రీడలలో పాల్గొనబోయే వారికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది. ఎస్.ఎ.ఐ వద్ద ఉన్న మౌలికసదుపాయాలన్నీ దాని స్వంత సదుపాయాలు కావడంతో మనజాతీయస్థాయి క్రీడాకారులకు కోవిడ్ నుంచి రక్షణ కల్పించగలవు. ఇక ఆ తదుపరిదశలో టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే పారా అథ్లెట్లు, అథ్లెట్లకు ఎన్.సి.ఒ.ఇలలో దశల వారీగా పారా అథ్లెటిక్స్,పారా పవర్ లిఫ్టింగ్, పారా షూటింగ్, పారా ఆర్చరి, సైక్లింగ్, హాకీ,వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరి, రెజ్లింగ్, జుడో, అథ్లెటిక్స్,బాక్సింగ్, ఫెన్సింగ్ వంటి వాటితోపాటు తొమ్మిది క్రీడలలొ (2024 పారిస్ ఒలింపిక్స్, 2022 ఆసియా కామన్ వెల్త్ క్రీడలనుకూడా దృష్ఠిలో ఉంచుకుని) శిక్షణ ఇస్తారు.
ఇది కూడా ఎస్.ఎ.ఐ ప్రాంతీయ కేంద్రాలలో రెసిడెన్షియల్ సదుపాయాలతో నిర్వహిస్తారు. క్రీడాకారులు కోవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్త వహించేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి సవివరమైన చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020(21)కు సంవత్సరం లోపు క్రీడాకారులు కోవిడ్ మహమ్మారి బెడదను ఎదుర్కోకుండా చూసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
క్రీడాకారుల పూర్తి భద్రతను దృష్టిలోఉంచుకుని , క్వారంటైన్ ప్రొటోకాల్స్‌ను పాటించడంతోపాటు,ఎస్.ఎ.ఐ ఎస్.ఒ.పిలను, రాష్ట్రకోవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటిస్తున్నారు. ఒకే క్రీడాంశాల కింద శిక్షణ పొందుతున్న వారినికూడా బ్యాచ్‌లలో చేర్చుకుంటారు. తొలి దశ క్రీడాకార్యకలాపాలు 2020 అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి.
ప్రాంతీయ కేంద్రాలలో బయో-బబల్ (జోనింగ్)ను ఏర్పాటు చేయాల్సిందిగా ఎస్.ఎ.ఐ అన్ని ప్రాంతీయకేంద్రాలను ఆదేశించింది. ఎన్.సి.ఒ.ఇలలో శిక్షణార్థులకు కోవిడ్ వైరస్ సోకకుండా ఉండేందుకు ఈచర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనే కోచ్‌లు, వారికి సహకారం అందించే సిబ్బంది కూడా ఎన్.సి.ఒ.ఇలోనే ఉండేందుకు ఏర్పాట్లుచేశారు. క్రీడాకారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేశారు.
ఎస్.ఎ.ఐ తనకు స్వంతంగా రెసిడెన్షియల్ మౌలికసదుపాయాలు లేని క్రీడలకు సంబంధించిన క్రీడాకారులకు కూడా మద్దతు నివ్వాలని నిర్ణయించింది. అయితే ప్లేఅండ్ స్టే తరహా శిక్షణ సదుపాయాలు ఉన్న చోట, ఆయా సదుపాయాల నిర్వాహకులు, శిక్షణ నిచ్చేవారు, క్రీడాకారులు కోవిడ్ -19ను కు సంబంధించి తగిన ముందస్తుజాగ్రత్తలు తీసుకుంటే అలాంటి వాటికి మద్దతునివ్వాలని నిర్ణయించారు.
*****
(Release ID: 1659684)
Visitor Counter : 240