ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

‘ఈ సంజీవని’ టెలీ మెడిసిన్ సేవల తొలి మైలురాయి 4లక్షలుగా నమోదైన టెలీ కన్సల్టేషన్లు

లక్ష చొప్పున టెలీ కన్సల్టేషన్లను దాటేసిన తమిళనాడు, ఉత్తరప్రదేశ్

Posted On: 26 SEP 2020 2:36PM by PIB Hyderabad

   కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సంజీవని అవుట్ పేషెంట్ విభాగం (.పి.డి.) తన పనితీరులో ప్రత్యేకతను చాటుతూ ఒక మైలు రాయిని దాటింది.  4 లక్షలకు పైగా టెలీ కన్సల్టేషన్లు (టెలిఫోన్ ద్వారా డాక్టర్లతో సంప్రదింపులు) పూర్తి చేసింది. ఇందులో తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. తమిళనాడు 1,33,167 టెలీ కన్సల్టేషన్లను, ఉత్తరప్రదేశ్ 1,00,124 కన్సల్టేషన్లను నమోదు చేశాయి.

  సంజీవని, సంజీవని .పి.డి. ద్వారా ఎక్కువ సంఖ్యలో టెలీ కన్సల్టేషన్లు నమోదు చేసిన రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ (36,527), కేరళ (33,340), ఆంధ్రప్రదేశ్ (31,034), ఉత్తరాఖండ్ (11,526), గుజరాత్ (8914), మధ్యప్రదేశ్ (8904), కర్ణాటక (7684), మహారాష్ట్ర (7103) ఉన్నాయి. తమిళనాడులోని విల్లుపురం వంటి జిల్లాల్లో సేవలు త్వరగా ఊపందుకున్నాయని లబ్ధిదారులు వీటిని వినియోగించుకున్న తీరునుబట్టి తెలుస్తోంది. విల్లుపురంలో 16వేలకు పైగా టెలీ కన్సల్టేషన్లు నమోదయ్యాయి. టెలీ కన్సల్టేషన్ల సేవలను వినియోగంచుకోవడంలో విల్లుపురం దేశంలోనే అగ్రగ్రామి జిల్లాగా నిలిచింది.

 

టెలీ కన్సల్టేషన్లలో 10 అగ్రశ్రేణి జిల్లాలు కింది విధంగా ఉన్నాయి

సంజీవని .పి.డి. (జిల్లాల్లో అమలు)

క్రమ సంఖ్య 

జిల్లా పేరు

రాష్ట్రం

కన్సల్టేషన్లు

1

విల్లుపురం

తమిళనాడు

16,368

2

మదురై

తమిళనాడు

12,866

3

మీరట్

ఉత్తరప్రదేశ్

10,795

4

తిరువణ్ణామలై

తమిళనాడు

9,765

5

నాగపట్నం

తమిళనాడు

9,135

6

తిరునెల్వేలీ

తమిళనాడు

7,321

7

మైలాడుదురై

తమిళనాడు

7,131

8

బహ్రయిచ్

ఉత్తరప్రదేశ్

6,641

9

విరుధూనగర్

తమిళనాడు

6,514

10

తిరువనంతపురం

కేరళ

6,351

 

   దేశవ్యాప్తంగా సంజీవని వేదికను 26 రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖలకు చెందిన 12వేలమంది ప్రాక్టీషనర్లు (వైద్యులు) సంజీవని వ్యవస్థ ద్వారా అందుబాటులో ఉంటున్నారు. దేశంలోని 510 జిల్లాల చెందిన ప్రజలు సేవలను వినియోగించుకుంటున్నారు.

   చివరి లక్ష కన్సల్టేషన్లు కేవలం 18 రోజుల్లోనే నమోదయ్యాయి. తొలి లక్ష కన్సల్టేషన్లు నమోదు కావడానికి దాదాపు 3 నెలల వ్యవధి పట్టింది. కోవిడ్-19 మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రోగులు డాక్టర్ల ద్వారా టెలీ మెడిసిన్ సేవలు పొందేందుకు సంజీవని .పి.డి. వేదిక బాగా దొహదపడింది. కోవిడ్ మార్గదర్శక సూత్రమైన భౌతిక దూరం అమలయ్యేలా చూసేందుకు, అదే సమయంలో కోవిడ్ కేసులు కాకుండా ఇతర అనారోగ్య కేసులకు అవసరమైన సేవలందించడానికి సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

  సంజీవని ద్వారా దాదాపు 20శాతం మంది రోగులు ఒకసారికి మించి ఆరోగ్య సేవలందుకున్నారు. సుదూరంలో ఉన్న వారికి ఆరోగ్య సేవలందించే డిజిటల్ వేదికను సేవలందించే వారితోపాటుగాలబ్ధిదారులు కూడా సమర్థవంతంగా వాడుకోగలిగారని వివరాలు సూచిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు రోజుకు 12 గంటలు, వారానికి ఏడు రోజులు ఆరోగ్య సేవలందిస్తూ వస్తున్నాయి.

  మొదటగా సంజీవని, కేవలం సాధారణ .పి.డి.సేవలను ఆన్ లైన్ ద్వారా అందించే వేదికగా రంగప్రవేశం చేసింది. అయితే సదుపాయం వినియోగం, జనంలోకి వెళ్తున్న తీరును పరిశీలించిన వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖలు,..స్పెషాల్టీ .పి.డి.గా కూడా  సేవలను ప్రవేశపెట్టారు. అందుకు తగినట్టుగాస్పెషాలిటీ, సూపర్ స్పెషాలటీ సేవలందించేలా సంజీవని .పి.డి సేవల స్థాయిని విస్తరింపజేశారు. రోజున  ఆన్ లైన్ ద్వారా 196 .పి.డి. సేవలను సంజీవని నడుపుతోంది. అందులో 27 జనరల్ .పి.డి.లు, 169 స్పెషాలటీ, సూపర్ స్పెషాలటీ .పి.డి. సేవలు ఉన్నాయి. 24 రాష్ట్రాల్లో సేవలన్నీ అందుబాటులో ఉంటున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని రోగులకు స్పెషాలటీ వైద్య సూచనల సేవలందించేందుకు ప్రముఖ వైద్య సేవా సంస్థలు సంజీవనిని వినియోగించుకుంటున్నాయి. భటిండా, రుషీకేశ్, బీబీనగర్ లలోని అఖిల భారత వైద్య విజ్ఞాన అధ్యయన సంస్థలు, తిరువనంతపురంలోని లేడీ హార్డింగే వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రులు, ప్రాంతీయ కేన్సర్ చికిత్సా కేంద్రం, ఎర్నాకుళంలోని కొచ్చిన్ కేన్సర్ కేంద్రం వంటివి తమ  స్పెషాలటీ వైద్య సూచనలను సంజీవని ద్వారా అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సి.జి.హెచ్.ఎస్.) కింద సంజీవనిలో 4 స్పెషాలిటీ .పి.డి.లను సంజీవనిపై ఏర్పాటు చేశారు. వీటి ద్వారా న్యూఢిల్లీలోని లబ్ధిదారులకు సేవలను అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని సి.జి.హెచ్.ఎస్. లబ్ధిదారులకు కూడా టెలీ మెడిసిన్ సేవలను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

   టెలిమెడిసిన్ వేదిక ద్వారా సేవలకు సంబంధించి, రాష్ట్రాలు కూడా సృజనాత్మకమైన అప్లికేషన్లను రూపొందించుకున్నాయి. కేరళలో సంజీవని వేదికను  పాల్ఘాట్ జిల్లా జైల్లోని ఖైదీలకు వైద్య సేవలందించేందుకు వినియోగిస్తున్నారు. తమిళనాడులో రోగుల ప్రాణాలు కాపాడేలా వైద్య సేవలను వారి ఇళ్లవద్దనే అందించేందుకు సంజీవని దోహదపడుతోంది.

   కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సంజీవని వేదికకు,.. మొహాళీలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్.డ్ కంప్యూటింగ్ లో రూపకల్పన జరిగింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న సృజనాత్మక డిజిటల్ వేదిక. ఆరోగ్య సేవలందించేందుకు ఏదైనా దేశం దీన్ని ఏర్పాటు చేస్తుంది. రెండు రకాల టెలీ మెడిసిన్ సేవలను అందించేందుకు సంజీవని సహాయపడుతుంది. డాక్టర్ కు డాక్టర్ టెలీ కన్సల్టేషన్ సేవలందించే వ్యవస్థను ( సంజీవని)గా వ్యవహరిస్తారు. అలాగే, రోగికి, డాక్టర్ టెలీ మెడిసిన్ సేవలందించే వ్యవస్థను సంజీవని .పి.డి.గా పేర్కొంటారు. ఇందులో మొదటిదైన డాక్టర్.కు డాక్టర్ సేవలను అందించే వ్యవస్థ, ఆయుష్మాన్ భారత్, వెల్ నెస్ సెంటర్ పథకాలకు మూల స్తంబం లాంటిది. ఇది 2019 నవంబరులో ప్రారంభమైంది. 2022 డిసెంబరు కల్లా మొత్తం ఒకటిన్నర లక్షల ఆరోగ్య, వెల్ నెస్ కేంద్రాల్లో 'హబ్ అండ్ స్పోక్' నమూనాలో టెలీ కన్సల్టేషన్ వ్యవస్థను అమలు చేసే లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో వైద్య కళాశాలలను, జిల్లాల్లోని ఆసుపత్రులను 'హబ్'లుగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 'స్పోక్'లు గా వ్యవహరిస్తారు. వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులను హబ్ లుగా గుర్తించి వాటి ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెలీ కన్సల్టేషన్ సేవలందిస్తారు. ఇక రోగి, డాక్టర్ టెలీ మెడిసిన్  సేవలందించే రెండవ వ్యవస్థ అయిన సంజీవని .పి.డి. సేవను ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏడాది ఏప్రిల్ 13 చేపట్టింది

*****

 



(Release ID: 1659422) Visitor Counter : 222