ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
50 లక్షల మైలురాయి దాటిన కోలుకున్నవారి సంఖ్య
కేవలం 11 రోజుల్లోనే కోలుకున్నవారు10 లక్షలమంది
చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారి ఐదురెట్లు అధికం
Posted On:
28 SEP 2020 11:40AM by PIB Hyderabad
భారతదేశంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 50 లక్షల మైలురాయి దాటింది. ఈ రోజు ఆ సంఖ్య 50,16,520 కి చేరింది. ప్రతి రోజూ ఇలా పెద్ద సంఖ్యలో కోలుకుంటూ ఉండటంతో భారత్ లో కోలుకుంటున్న తీరు అదే పనిగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 74,893 మంది కోలుకున్నారు. కొద్దిరోజులుగా దేశమంతటా కోలుకుంటున్నవారి సంఖ్య సగటున రోజుకు 90 వేలకు పైగా ఉంటోంది.
ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా ఐదు రెట్లు ఎక్కువగా నమోదైంది. కోలుకుంటున్నవారి సంక్యలో పెరుగుదల గత నెల రోజులలో దాదాపు వందశాతం పెరగటం కూదా గమనార్హం. జాతీయ స్థాయిలో కోలుకుంటున్నవారి శాతం 82.58% గా నమోదైంది. 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కోలుకున్నవారి శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదైంది. కొత్తగా కోలుకుంటున్న కేసులలో 73% పది రాష్ట్రాలనుంచే ఉండటం కూడా గమనార్హం. అవి మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు. వీటిలో 13,000 మంది కోలుకున్నట్టు నమోదైన మహారాష్ట్ర ఈ జాబితాలో ముందుంది.
2020 జూన్ లో కోలుకున్నవారి సంఖ్య లక్ష ఉండగా అది చాలా వేగంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 11 రోజులలోనే ఈ సంఖ్యకు 10 లక్షలు జోడించినట్టయింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన చర్యలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేయటం వలన, మౌలిక సదుపాయాలు పెంచటం, ప్రామాణిక చికిత్సావిధానాలు అమలు చేయటం, వైద్య, పారామెడికల్ సిబ్బంది అంకితభావంతో అందించిన సేవలు ఒక సంపూర్ణ విధానం రూపంలో అమలుకావటం వలన ఈ ఫలితాలు సాధించటం సాధ్యమైంది.
కోలుకున్న వారిలో మొత్తం 78% కేవలం పది రాష్ట్రాలనుంచే నమోదయ్యాయి. కోలుకున్నవారి సంఖ్య లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఆ తరువాత రెండు స్థానాల్లో నిలిచాయి.
గడిచిన 24 గంటల్లో మొత్తం 82,170 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ కొత్త కేసులలో 79% కేవలం పది రాష్ట్రాలలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. అందులో మహారాష్ట్రలో అత్యధికంగా 18,00 కేసులు నమోదు కాగా, 9,00 కేసులతో కర్నాటక రెండో స్థానంలో ఉంది.
గడిచిన 24 గంటల్లో 1,039 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన మరణాలలో 84% కేవలం పది రాష్ట్రాలనుంచే వచ్చాయి. నిన్నటి మరణాలలో 380 మంది (36%) మహారాష్ట్ర నుంచే కాగా తమిళనాడులో 80 మంది, కర్నాటకలో 79 మంది మరణించారు.
కచ్చితంగా భౌతిక దూరం పాటించటం, చేతుల పరిశుభ్రత పాటించటం, శ్వాస పరంగా నియమాలను అనుసరించటం, బహిరంగ ప్రదేశాలలో ముఖానికి మాస్క్ ధరించటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం మరోమారు విజ్ఞప్తి చేస్తోంది.
***
(Release ID: 1659752)
Visitor Counter : 222
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam