ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేంద్ర ఆరోగ్య&కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అశ్విని కుమార్‌ చౌబే సమక్షంలో, సీఎస్‌ఆర్‌ నిధి నుంచి రూ.రెండున్నర కోట్ల చెక్కును ఐసీఎంఆర్‌కు అందజేసిన 'ఫోర్టిస్ హెల్త్‌కేర్'

Posted On: 26 SEP 2020 4:04PM by PIB Hyderabad

ప్రైవేటు రంగ వైద్య సేవల సంస్థ అయిన 'ఫోర్టిస్ హెల్త్‌కేర్', రూ.రెండున్నర కోట్ల చెక్కును ఐసీఎంఆర్‌కు అందజేసింది. కేంద్ర ఆరోగ్య&కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అశ్విని కుమార్‌ చౌబే కార్యాలయంలో, మంత్రి సమక్షంలో చెక్కును అందించింది.

    ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఎండీ, సీఈవో అశుతోష్‌ రఘువన్షీ, సీనియర్‌ ఉపాధ్యక్షుడు (కార్పొరేట్‌ వ్యవహారాలు, సీఎస్‌ఆర్‌) మను కపిల్‌, ఎస్‌ఆర్‌ఎల్‌-సీఈవో ఆనంద్‌ కుమార్‌ ఈ చెక్కును ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొ.బలరామ్‌ భార్గవ్‌, సీనియర్‌ ఆర్థిక సలహాదారు రాజీవ్‌ రాయ్‌కు అందజేశారు.

    పరిశోధన రంగంలో గొప్ప ప్రామాణికతను ఐసీఎంఆర్‌ సృష్టించిందని అశ్విని కుమార్‌ చౌబే చెప్పారు. మన దేశంలోనే కాక, ప్రపంచ గొప్ప పరిశోధన సంస్థల్లో ఒకటని అన్నారు. కొవిడ్‌ ప్రారంభం నుంచి శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లూ నిర్విరామంగా పని చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఫోర్టిస్‌ ఆసుపత్రి ఉదారత అభినందనీయమని, ఇది ఇంకా ఎందరికో స్ఫూర్తినిస్తుందని అశ్విని కుమార్‌ చౌబే వ్యాఖ్యానించారు.

***


(Release ID: 1659348) Visitor Counter : 191