రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ మరియు మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ల ధరను తగ్గించడానికి చర్యలు తీసుకున్న - ఎన్.పి.పి.ఎ.
పత్రికా ప్రకటన
Posted On:
26 SEP 2020 12:31PM by PIB Hyderabad
1. కోవిడ్-19 యొక్క ప్రస్తుత పరిస్థితి ఫలితంగా దేశంలో మెడికల్ ఆక్సిజన్ (MO) యొక్క డిమాండ్ పెరిగింది. అందువల్ల దాని లభ్యత చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల నుండి సరఫరా అయ్యే మెడికల్ ఆక్సిజన్ సరఫరాపై చాలా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు ఆధారపడి ఉంటాయి.
2. ముఖ్యంగా మహమ్మారి కాలంలో మెడికల్ ఆక్సిజన్ ను నిరంతరాయంగా సరఫరా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆక్సిజన్ ఇన్హాలేషన్ (మెడికల్ గ్యాస్) అనేది షెడ్యూల్ చేయబడిన ఫార్ములేషన్, ఇది జాతీయ అత్యవసర మందుల జాబితా (ఎన్.ఎల్.ఈ.ఎమ్) క్రింద పొందుపరచబడింది. దాని ప్రస్తుత సీలింగ్ ధరను ఘనపు మీటరుకు 17.49 రూపాయలుగా ఎన్.పి.పి.ఎ. నిర్ణయించింది. అయితే, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పై ధరల పరిమితి లేకపోవడం వల్ల, తయారీదారులు ఫిల్లర్లకు ధరలను పెంచారు. కోవిడ్ సమయంలో, సిలిండర్ల ద్వారా వైద్య ఆక్సిజన్ సరఫరా పెరిగింది. దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ లభ్యత కోసం ఇప్పుడు ధర నియంత్రణ తప్పనిసరి అయ్యింది.
3. ఆక్సిజన్ ధరతో సహా లభ్యతకు సంబంధించిన సమస్య భారత ప్రభుత్వ సాధికార బృందం-2, యొక్క నిరంతర పరిశీలనలో ఉంది. లిక్విడ్ ఆక్సిజన్ ను సరసమైన ఫ్యాక్టరీ దగ్గర ధరలకు ఫిల్లర్లకు సరఫరా చేసేలా చూడాలని కూడా, సాధికార బృందం-2 ఎన్.పి.పి.ఎ. కు సిఫార్సు చేసింది.
4. భారత ప్రభుత్వ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.హెచ్. & ఎఫ్.డబ్ల్యూ), 23.09.2020 నాటి తన లేఖ ద్వారా, పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి వీలుగా, సిలిండర్లలో ఎల్.ఎమ్.ఓ. మరియు మెడికల్ ఆక్సిజన్ లభ్యత మరియు ధరలను వెంటనే నియంత్రించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం కోసం, విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్ 10 (2) (l) కింద అధికారాలను ఎన్.పి.పి.ఎ. కు ఇచ్చింది.
5. 25.09.2020 తేదీన జరిగిన అసాధారణ సమావేశంలో సాధికార సంస్థ ఈ విషయంపై చర్చించింది. మహమ్మారి కారణంగా తలెత్తే పరిస్థితిని ఎదుర్కోవటానికి డి.పి.సి.ఓ.-13 యొక్క పేరా 19, 13 మరియు విపత్తు నిర్వహణ చట్టం-2005 లోని సెక్షన్ 10 (20) (1) కింద ప్రజా ప్రయోజనాల కోసం విశిష్టాధికారాలను ఉపయోగించాలని నిర్ణయించారు.
తదనుగుణంగా, ఇది నిర్ణయించబడింది:
తయారీదారుల వద్ద లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్.ఎం.ఓ) ఫ్యాక్టరీ దగ్గర ధరను (జిఎస్‌టి మినహాయించి) ఘనపు మీటరుకు 15.22 రూపాయలుగా; మరియు
ఫిల్లర్ వద్ద మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ యొక్క ఫ్యాక్టరీ దగ్గర ధరను (జిఎస్‌టి మినహాయించి) ఘనపు మీటరుకు 25.71 రూపాయలుగా నిర్ణయించగా, ప్రస్తుతం ఉన్న సీలింగ్ ధర ఘనపు మీటరుకు 17.49 రూపాయలుగా ఉంది. ఈ ధర, రాష్ట్ర స్థాయిలో రవాణా వ్యయ స్థిరీకరణకు లోబడి, ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది.
6. ఆక్సిజన్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత రేటు ఒప్పందాలు వినియోగదారుల ప్రయోజనం కోసం కొనసాగుతాయి.
ఎల్.ఎమ్.ఓ. మరియు ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ల ఫ్యాక్టరీ వెలుపల ధరల పరిమితి, దేశీయ ఉత్పత్తికి వర్తిస్తుంది.
ఇంతవరకు పేర్కొన్న ఈ చర్యలు ఆసుపత్రి స్థాయిలో మరియు ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా, ముఖ్యంగా సుదూర మరియు అంతర్గత జిల్లాలకు వినియోగదారుల వద్ద మెడికల్ ఆక్సిజన్ లభ్యతను నిర్ధారిస్తాయి.
*****
(Release ID: 1659424)
Visitor Counter : 243