ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశ రైతులను ప్రశంసించిన ప్రధానమంత్రి
Posted On:
27 SEP 2020 1:37PM by PIB Hyderabad
కోవిడ్ సందర్బంలో రైతులు అద్భుతమైన శక్తిని ప్రదర్శించారని , మన్‌కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు.
వ్యవసాయరంగం బలంగా ఉంటే ఆత్మనిర్భర్ భారత్‌కూడా బలంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో వ్యవసాయరంగాన్ని పలు ఆంక్షలనుంచి విముక్తి చేసినట్టు ప్రధానమంత్రి చెప్పారు.చాలా అపోహలను పటాపంచలు చేయడానికి ప్రయత్నించినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, హర్యానాకుచెందిన రైతు శ్రీ కన్వర్ చౌహాన్ అనుభవాన్ని ఉదహరించారు. మండీ వెలుపల పండ్లు కాయగూరలు అమ్ముకునేందుకు ఇతను ఎన్నో అవస్థలు పడేవాడని, అయితే 2014లో ఎపిఎంసి చట్టం కింద పండ్లు, కూరగాయలను మినహాయించడంతో అతను ఎంతో ప్రయోజనం పొందాడని చెప్పారు. అతను రైతు ఉత్పత్తిదారు సంస్థను ఏర్పాటు చేశాడు. అతని గ్రామానికి చెందిన వారు స్వీట్ కార్న్‌ను,బేబీకార్న్‌ను పండించి, దానిని నేరుగా ఢిల్లీలోని అజాద్‌పూర్ మండీకి చేరుస్తున్నారు. అక్కడి నుంచి పెద్ద రిటైల్‌సంస్థలు, ఫైవ్ స్టార్ హోటల్ళకు చేరుస్తున్నారు. ఇది వారి ఆదాయాన్ని గణనీయంగా పెంచింది. ఈ రైతులు తమ పండ్లు, కూరగాయలను ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకునే శక్తి కలిగి ఉన్నారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇది వారి ప్రగతికి పునాది అని ఆయన అన్నారు.ఇప్పుడు ఇదే పద్ధతిని దేశవ్యాప్తంగా ,అన్నిఉత్పత్తులకు వర్తింప చేయడం జరుగుతున్నదని ఆయన అన్నారు.
పండ్లు, కూరగాయలను ఎపిఎంసి పరిధినుంచి మినహాయించడం వల్ల రైతులకు జరుగుతున్న మేలును ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, మహారాష్ట్రకు చెందిన రైతు ఉత్పత్తిదారుల సంస్థ, శ్రీ స్వామి సమర్థ ఫామ్ ప్రోడ్యసర్ కంపెనీ లిమిటెడ్ అనుభవాలను వివరించారు. ముంబాయి, పూణేలోని రైతులు వారం వారం మార్కెట్లను వారే నిర్వహించి, మధ్యవర్తులు లేకుండా తమ ఉత్పత్తులను తామే నేరుగా అమ్ముకుంటున్నారన్నారు. అలాగే తమిళనాడు బనానా ఫార్మర్ ప్రోడ్యూసర్ కంపెనీ గురించి చెప్పారు. ఇది రైతుల సంఘటిత సంస్థ.ఇది వందలాది మెట్రిక్ టన్నుల కూరగాయలు, పండ్లు, అరటిని సమీప గ్రామాలనుంచి లాక్‌డౌన్ సమయంలో కొనుగోలు చేసి , కూరగాయలను కాంబో కిట్‌గా చెన్నైకి సరఫరా చేసిందన్నారు. లక్నో కు చెందిన ఇరాడా ఫార్మర్ ప్రోడ్యూసర్ గ్రూపు లాక్‌డౌన్ సమయంలో పండ్లు, కూరగాయలను నేరుగా రైతుల వద్దనుంచి పొలాలవద్దే సేకరించి వాటిని నేరుగా లక్నో మార్కెట్‌లకు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా విక్రయించిందన్నారు.
వినూత్న ఆవిష్కరణలు, నూతన సాంకేతిక పరిజ్క్షాన వినియోగం ద్వారా వ్యవసాయరంగం మరింత పురోగమిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఇందుకు సంబంధించి ఆయన గుజరాత్‌కుచెందిన రైతు ఇస్మాయిల్ భాయి అనుభవాలను తెలిపారు. కుటుంబ సభ్యులు నిరుత్సాహపరిచినా అతను వ్యవసాయాన్ని ఎంచుకున్నాడని, బిందు సేద్య పద్ధతి ఉపయోగించి బంగాళాదుంప పండించాడని,అత్యంత నాణ్యతగల బంగాళాదుంప అతనికి పేరుతెచ్చిందని, ఇప్పుడు అతను వాటిని ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా పెద్ద కంపెనీలకు విక్రయిస్తూ మంచి లాభాలు గడిస్తున్నాడని అన్నారు. అలాగే ప్రధానమంత్రి మణిపూర్ కు చెందిన బిజయ్ శాంతి కథనాన్ని కూడా వివరించారు. ఆమె తామరతూడులనుంచి దారాన్ని తీసే స్టార్టప్‌ను అభివృద్ధి చేశారు. ఆమె కృషి ,ఆవిష్కరణలతో అటు తామర సాగులోనూ టెక్స్‌టైల్ రంగంలోనూ నూతన అవకాశాలకు తలుపులు తెరిచాయి.
***
(Release ID: 1659558)
Visitor Counter : 253
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam