PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
25 AUG 2020 7:11PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- ఒకేరోజులో 66,550 మంది కోలుకోగా మరో కొత్త రికార్డు; ఇప్పటిదాకా 24 లక్షల మందికిపైగా రోగులకు వ్యాధి నయం
- కోలుకునే కేసులలో గత 25 రోజుల్లోనే 100 శాతం పెరుగుదల.
- నమోదైన కేసులలో మరణాల సగటు 1.84 శాతానికి పతనం.
- దేశవ్యాప్తంగా ఇప్పటికి 3.7 కోట్లకుపైగా పరీక్షలు; ప్రయోగశాలలు 1524కు పెరుగుదల.
- ప్రతి పది లక్షల జనాభాకు పరీక్షల సగటు 26,685కు చేరిక.
- పాట్నా నగరంలో 500 పడకల డీఆర్‌డీవో కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రి ప్రారంభం.


ఒకేరోజులో 66,550 మంది కోలుకోగా మరో కొత్త రికార్డు; ఇప్పటిదాకా 24 లక్షల మందికిపైగా రోగులకు వ్యాధి నయం; కోలుకునే కేసులలో గత 25 రోజుల్లోనే 100 శాతం పెరుగుదల
కోవిడ్-19 నుంచి బయటపడేవారి సంఖ్యరీత్యా గత 24 గంటల్లో ఒకేరోజు అత్యధికంగా 66,550 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య ఇవాళ 24,04,585కు చేరింది. దీంతో దేశంలో కోలుకునేవారి సగటు దాదాపు 76 శాతం (75.92) చేరింది. తదనుగుణంగా చికిత్స పొందుతున్న(7,04,348)-కోలుకున్న కేసుల మధ్య అంతరం 17 లక్షలు దాటింది. ఆ మేరకు చురుకైన కేసులతో పోలిస్తే ఇవాళ్టిదాకా కోలుకున్నవారు 3.41 రెట్లు అధికం. ఇక గడచిన 25 రోజుల వ్యవధిలో కోలుకునేవారి సంఖ్య 100 శాతం పెరిగింది. ఇలా అత్యధికంగా వ్యాధిగ్రస్థులు కోలుకుంటున్నందున దేశం మొత్తంమీద నమోదైన కేసులలో ప్రస్తుత కేసులు గణనీయంగా తగ్గి కేవలం 22.24 శాతానికి పరిమితమయ్యాయి. అలాగే మరణాలు స్థిరంగా తగ్గుతూ అత్యల్పంగా 1.84 శాతానికి పతనమైంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648486
‘పరీక్ష-అన్వేషణ-చికిత్స’ త్రిముఖ వ్యూహంతో ఇప్పటిదాకా 3.7 కోట్లమేర పరీక్షలు; ప్రతి పది లక్షల జనాభాకూ సగటు 26,885కు చేరిక
‘పరీక్ష-అన్వేషణ-చికిత్స’ త్రిముఖ వ్యూహం పటిష్ఠ అమలుతో భారత్ ఇప్పటిదాకా దాదాపు 3.7 కోట్లకుపైగా నమూనాలను పరీక్షించింది. రోజువారీ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచే సంకల్పంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో గత 24 గంటల్లో 9,25,383 పరీక్షలు నిర్వహించగా, మొత్తం నమూనాల సంఖ్య 3,68,27,520గా నమోదైంది. దేశం మొత్తానికి పుణెలో ఒకేఒక ప్రయోగశాల దశనుంచి నేడు భారత పరీక్ష సదుపాయాల నెట్‌వర్క్ వేగంగా విస్తరించి ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 986, ప్రైవేట్ రంగంలో 538 వంతున మొత్తం 1524 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648457
పాట్నా నగరంలో 500 పడకల డీఆర్‌డీవో కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రి ప్రారంభం
రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (DRDO) బీహార్ రాజధాని పాట్నాలో 125 ఐసీయూ సదుపాయంగలవిసహా మొత్తం 500 పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిని దేశీయాంగ శాఖ సహాయమంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ నిన్న ప్రారంభించారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని 1000 పడకల సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆస్పత్రి తరహాలో డీఆర్‌డీవో ఈ కోవిడ్ ఆస్పత్రిని బిహతా వద్ద కొత్తగా నిర్మించిన ఈఎస్‌ఐసీ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మించింది. ప్రధాన మంత్రి పౌర సహాయ-అత్యవసర పరిస్థితుల ఉపశమన ట్రస్ట్ (పీఎం కేర్స్) నుంచి దీనికి నిధులు మంజూరయ్యాయి. కాగా, ఇలాంటి మరో ఆస్పత్రిని ముజఫర్‌పూర్‌లూ కూడా ఏర్పాటు చేయనున్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648373
చార్టర్డ్ విమానాలు, భారత రేవులద్వారా లక్షకుపైగా సిబ్బంది మార్పిడి కార్యకలాపాలు నిర్వహించిన భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ
భారత నౌకాయాన మంత్రిత్వశాఖ చార్టెడ్ విమానాలద్వారా భారత రేవులలో లక్షకుపైగా సిబ్బంది మార్పిడి కార్యకలాపాలు నిర్వహించింది. ప్రపంచంలోనే తొలిసారి ఇంత పెద్ద సంఖ్యలో ఈ విధానంలో సిబ్బంది మార్పిడి చేసిన ఘనత భారత్‌ది మాత్రమే. ఈ మేరకు నావికా కార్యనిర్వహణలో భాగంగా ఒక ఓడలోని సిబ్బందిని మరొక ఓడకు మార్చడం విధుల నుంచి ఇళ్లకు పంపడం చేసింది. కరోనా మహమ్మారివల్ల తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో నావికా రంగం కూడా ఉంది. అయినప్పటికీ నౌకాయాన శాఖ ఈ సంక్షోభ సమయంలో కూడా భారత, విదేశీ ప్రయాణ నౌకల నావికులు చిక్కుకున్నచోట, ఇతర అత్యవసర వస్తు సరఫరా రంగాల్లో సేవలు కొనసాగిస్తూ మూల స్తంభంగా నిలిచింది. ముఖ్యంగా దిగ్బంధం నడుమ చిక్కుకున్న నావికుల విషయంలో సమర్థ సేవలందించినందుకు డైరెక్టర్ జనరల్‌ను నౌకాయాన శాఖ (స్వతంత్ర బాధ్యత) మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ ప్రశంసించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648528
నిర్మాణ సంస్కరణలకు ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యం: ఆర్థిక మంత్రి
దేశంలో నిర్మాణ సంస్కరణలు చేపట్టడమే ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యమని కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నొక్కిచెప్పార. ఈ మేరకు ఆమె భారత పారిశ్రామిక దిగ్గజాలనుద్దేశించి ప్రసంగించారు. కోవిడ్ సంక్షోభం మొదలైన నాటినుంచీ చేపట్టిన చర్యలు ప్రభుత్వ ప్రాథమ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి విధానంలోనూ నిర్మాణాత్మక అంశం ఉందని వివరించారు. ఆర్థిక వ్యవస్థ కోలుకునే ప్రక్రియలో సంస్కరణల గణనీయ ప్రభావం ప్రస్ఫుటంగా తేలుతున్నదని వివరించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648487
కోవిడ్ -19వల్ల ఫినాల్‌కు పెరిగిన డిమాండ్; ఒక్క రోజులో 51,960 సీసాల ఉత్పత్తితో రికార్డు సృష్టించిన బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్ సంస్థ
ప్రభుత్వరంగ సంస్థ బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కొత్త రికార్డు సృష్టించింది. ఈ మేరకు దేశంలో కోవిడ్-19 మహమ్మారి ప్రబలడంతో ఫినాల్‌కు పెరిగిన డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తిని ఇబ్బడిముబ్బడిగా పెంచింది. తదనుగుణంగా పశ్చిమ బెంగాల్‌లోఇన ఉత్తర 24- పరగణాల జిల్లాలోని పాణిహతి యూనిట్ ఒక్కరోజులో 51,960 సీసాల ఫినాల్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. దీనిపై కేంద్ర రసాయనాలు-ఎరువుల మంత్రిత్వ శాఖ సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648533
దిగ్బంధం అనంతరం ప్రారంభమవుతున్న హోటల్ అశోకలో సన్నద్ధతను సమీక్షించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
ఢిల్లీ విపత్తు నిర్వహణాధికార సంస్థ (డిడిఎంఏ) ఆదేశాల మేరకు ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భారత పర్యాటకాఅభివృద్ధి సంస్థ (ఐటిడిసి) నిర్వహించే హోటల్ అశోక పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడి సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర పర్యాటక-సాంస్కృతిక శాఖ సహాయమంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఆగస్టు 24న సందర్శించారు. పర్యాటక రంగంలో పెద్ద భాగస్వాములైన హోటళ్లు-రెస్టారెంట్లను తిరిగి ప్రారంభించడం శుభ పరిణామమని, ఈ నిర్ణయంవల్ల పర్యాటక రంగానికి, దేశీయ ప్రయాణాలకు ఊపిరిలూదుతుందని మంత్రి అన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648476
జాతీయ ఓపెన్ స్కూల్ సంస్థ (ఎన్‌ఐఒఎస్) సంబంధిత కార్యకలాపాలపై ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి సమీక్ష
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ నిన్న ఢిల్లీలో జాతీయ ఓపెన్ స్కూల్ (NIOS) సంబంధిత కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్‌ఐఓఎస్ ద్వారా విద్యార్థులకు అందుబాటులోగల వివిధ కోర్సులను ఆయన సమీక్షించారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభగ్రాహ్యమయ్యే విధంగా జాతీయ విద్య-పరిశోధన-శిక్షణ మండలి (NCERT) తరహాలో ఓపెన్ స్కూల్ పాఠ్యప్రణాళికను రూపొందించాలని మంత్రి సూచించారు. కోవిడ్-19 సమయంలో ఎన్‌ఐఓఎస్ పనితీరును కూడా ఆయన సమీక్షించారు. కాగా, విద్యార్థుల కోసం నాలుగు చానెళ్లను నిర్వహిస్తున్నామని, నిత్యం విద్యార్థులకు 6 గంటలపాటు ఆన్‌లైన్ బోధన చేస్తున్నామని ఎన్‌ఐఓఎస్ అధికారులు ఈ సందర్బంగా మంత్రికి వివరించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648371
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతంలో ఆరోగ్య మంత్రిత్వశాఖ తుది నిర్ణయం మేరకు సీరాలజీ పరీక్షల ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో ఇందుకోసం సంచార బృందాలను అందుబాటులో ఉంచేదిశగా ఆ శాఖతో సంప్రదించాలని పాలన యంత్రాంగాధిపతి ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్‌ను ఆదేశించారు.
- పంజాబ్: లక్షణరహిత/తేలికపాటి లక్షణాలున్న, 60 ఏళ్లుదాటిన రోగులు లేదా సహ-అనారోగ్యాలతో బాధపడేవారు, గర్భిణుల ఏకాంత గృహవాస చికిత్స అర్హతపై పంజాబ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. అటువంటివారు తమ ఇళ్లలో ఏకాంత చికిత్సకు సంబంధించిన సదుపాయాలపై నమూనాల సేకరణ సమయంలోనే ప్రకటన ఇచ్చేవిధంగా చూడాలని ఆదేశించింది.
- హర్యానా: రాష్ట్రంలో కోవిడ్-19 నిర్ధారణ కోసం సిర్సా, రేవారిలలో రెండు ఆర్టీ-పీసీఆర్ (RT-PCR) పరీక్ష ప్రయోగశాలలను హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని ప్రయోగశాలల సంఖ్య 23కు పెరిగింది. ఇవేకాకుండా జింద్, భివానీ, పానిపట్, యమునానగర్‌ల వద్ద తలా ఒకటి వంతున మరో నాలుగు ఆర్టీ-పీసీఆర్ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.
- కేరళ: రాష్ట్రంలో పోలీసులు సేకరించిన కోవిడ్-19 రోగుల ఫోన్‌కాల్స్ వివరాల రికార్డులను మరే ఇతర అవసరాల కోసం వినియోగించరాదని కేరళ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్ మహమ్మారిపై పోరు ముమ్మరం చేయడంలో భాగంగా ఆరోగ్యశాఖ వినూత్నంగా ఏర్పాటు చేసిన ‘కోవిడ్ బ్రిగేడ్’ తొలి బృందం కాసరగోడ్ జిల్లానుంచి ఇవాళ తమ కార్యకలాపాలను ప్రారంభించింది. రాష్ట్రంలో ఈ మధ్యాహ్నందాకా మరో మూడు మరణాలు నమోదవగా మృతుల సంఖ్య 237కు చేరింది. కాగా, రోజువారీ కోవిడ్ కేసులు నిన్న స్వల్పంగా తగ్గి 1242 స్థాయికి దిగివచ్చాయి. వివిధ జిల్లాల్లో 20,323 మంది ప్రస్తుతం చికిత్స పొందుతుండగా 1,83,448 మంది పరిశీలనలో ఉన్నారు.
- తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఈ ఉదయం 10 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో అత్యధికంగా ఒకేరోజు 571 మందికి కోవిడ్ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,981కి చేరింది. అలాగే మరో ఐదుగురి మరణంతో మృతుల సంఖ్య 164కు చేరింది. కాగా, తమిళనాడులో ఇ-పాస్ విధానం తొలగించడానికి నిరాకరిస్తున్న ప్రభుత్వం దీనిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రకటించింది. రాష్ట్రంలో నిన్న మరో 5,967 కేసులు, 97 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులలో చెన్నైలో 1,278 మంది ఉండగా, మరో నాలుగు జిల్లాల్లో 300 మందికిపైగా కోవిడ్ నిర్ధారణ అయింది.
- కర్ణాటక: రాష్ట్రానికి వచ్చే అంతర్రాష్ట్ర ప్రయాణికులు ఇకపై 14 రోజుల గృహనిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే రాష్ట్ర సరిహద్దులు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో వైద్య పరీక్షలు కూడా ఉండవని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సవరించిన సర్క్యులర్ జారీచేసింది. కాగా, మహమ్మారి నేపథ్యంలో మార్చి 24 నుంచి మూసివేసిన బెంగళూరు నగరంలోని కె.ఆర్.మార్కెట్ సెప్టెంబర్ 1 నుంచి తెరవబడుతుంది. కాగా, బార్‌లు, థియేటర్లు, బహిరంగ సభలు-సమావేశాలపై నిషేధం కొనసాగుతుంది.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ప్లాస్మా సేకరణ కార్యక్రమంలోని అన్ని జిల్లాలనూ అధిగమించింది. ఈ మేరకు కర్నూలు అధికారులు 60 ప్లాస్మా నమూనాలను సేకరించగా, మిగిలిన 12 జిల్లాల్లో ఈ సంఖ్య 20 నమూనాలకు మించకపోవడం గమనార్హం. కాగా, విశాఖపట్నంలో కోలుకున్నవారి సంఖ్య 25వేల స్థాయిని దాటింది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న 8601 కొత్త కేసులు, 86 మరణాలు నమోదవగా 8741 మంది కోలుకున్నారు. నిన్నటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసులు: 3,61,712; క్రియాశీల కేసులు: 89,516; డిశ్చార్జి: 2,68,828; మరణాలు: 3368గా ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2579 కొత్త కేసులు, 9 మరణాలు నమోదవగా 1752 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 295 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,08,670; క్రియాశీల కేసులు: 23,737; మరణాలు: 770; డిశ్చార్జి: 84,163గా ఉన్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో మొత్తం 10,21,054 నమూనాలను పరీక్షించారు. ఇక ప్రభుత్వ-ప్రైవేట్ ఆస్పత్రులలో కోవిడ్-19 రోగులకోసం 18,016 పడకలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ బులెటిన్ తెలిపింది.
- అసోం: రాష్ట్రంలో 20 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా ప్రకటించారు.
- మణిపూర్: రాష్ట్రంలో 116 కొత్త కేసులు నమోదు కాగా, 97 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మణిపూర్లో క్రియాశీల కేసులు 1627 కాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సగటు 69 శాతంగా ఉంది.
- మేఘాలయ: రాష్ట్రంలో ప్రస్తుత క్రియాశీల కేసులు 1179 కాగా, వీరిలో 459 మంది బీఎస్‌ఎఫ్, సాయుధ దళాల సిబ్బంది కావడం గమనార్హం. రాష్ట్రంలో ఇప్పటిదాకా 789మంది కోలుకున్నారు.
- మిజోరాం: రాష్ట్రంలో ఇవాళ ముగ్గురు డిశ్చార్జి కాగా, ప్రస్తుతం మొత్తం కేసులు 953కుగాను 489 క్రియాశీల కేసులున్నాయి.
- నాగాలాండ్: రాష్ట్రంలో కోలుకునేవారి సగటు 64.51 శాతానికి పెరిగింది. నాగాలాండ్‌లో ఆగస్టు 23న భద్రత సిబ్బందికి కోవిడ్ నిర్ధారణ కావడంతో మోకోక్‌చుంగ్‌లోని నాథన్ హాస్టల్ దిగ్బంధ కేంద్రాన్ని నియంత్రణ మండలిగా ప్రకటించారు.
- మహారాష్ట్ర: నీట్/జెఈఈ పరీక్షల వాయిదాపై డిమాండ్లుఉ ఊపందుకుంటున్నాయి. ఈ మేరకు వచ్చే నెలలో ఈ పరీక్షల నిర్వహణపై కేంద్రం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రధానికి లేఖరాశారు. అనేక దేశాలలో అనుసరిస్తున్నట్లుగా జనవరి నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని కూడా ఆయన సూచించారు.
- గుజరాత్: రాష్ట్రంలోని అహ్మదాబాద్ స్టేషన్‌లో ప్రయాణికుల సామగ్రి తనిఖీ, ప్యాకింగ్ యంత్రాన్ని అహ్మదాబాద్ రైల్వే డివిజన్ ప్రారంభించింది. భారత రైల్వేశాఖ పరిధిలోనే ఇది మొట్టమొదటిది కావడం విశేషం. దిగ్బంధం విముక్తి-1 తర్వాత రవాణా, ప్రయాణ సేవల వేగానికి అనుగుణంగా కోవిడ్ మహమ్మారి మధ్య సురక్షిత ప్రయాణం దిశగా ఈ యంత్రాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం కోలుకునేవారి సగటు 80 శాతంగా ఉంది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో వరుసగా 5వ రోజు అత్యధికంగా సోమవారం 1,292 కొత్త కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 54,000 కేసులలో 40 శాతం ఆగస్టు నెలలోనే నమోదవడం విశేషం. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 10,068 కాగా, మృతుల సంఖ్య 1,246గా ఉంది. ఇక ప్రతి పది లక్షల జనాభాకు పరీక్షల సగటు 14,000గా ఉన్నప్పటికీ జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగా ఉంది.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు కొత్త సీటింగ్ ఏర్పాట్లతో ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఇందులో భాగంగా సభ్యుల సీట్ల మధ్యన గ్లాస్ పార్టిషన్లను ఏర్పాటు చేశారు.
FACT CHECK




******
(Release ID: 1648619)
Visitor Counter : 246
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Malayalam