రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పాట్నాలో డి.ఆర్.డి.ఓ. ఏర్పాటుచేసిన 500 పడకల కోవిడ్ ఆసుపత్రి ప్రారంభం.

Posted On: 24 AUG 2020 6:58PM by PIB Hyderabad

పాట్నాలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డి.ఆర్.‌డి.ఓ) ఏర్పాటు చేసిన 125 ఐసియు పడకలతో సహా 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని గౌరవనీయులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ ఈ రోజు ప్రారంభించారు.  బిహతా వద్ద కొత్తగా నిర్మించిన ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రిలో ఉన్న ఈ ఆసుపత్రిని, ఢిల్లీ కంటోన్మెంట్ వద్ద ఉన్న వెయ్యి పడకల సర్దార్ వల్లభ్ భాయి పటేల్ ఆసుపత్రి తరహాలో డి.ఆర్.డి.ఓ. నిర్మించింది.  

ప్రధాన మంత్రి పౌర సహాయం మరియు అత్యవసర పరిస్థితుల్లో ఉపశమనం (పి.ఎమ్-సి.ఏ.ఆర్.ఈ.ఎస్) ట్రస్ట్ ఈ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించింది.  అలాంటి మరో ఆసుపత్రిని ముజఫర్‌పూర్ ‌లో కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటికే ఉన్న ఏడు అంతస్తుల ఈ.ఎస్.ఐ.సి. ఆసుపత్రికి ఉన్న విద్యుత్ సరఫరా, ఎయిర్ కండిషనింగ్, నీటి సరఫరా, అగ్ని మాపక పరికరాలు, డీజిల్ జనరేటర్, ప్రతి మంచానికి ఆక్సిజన్ పైపింగ్, లిఫ్టులు మరియు మోర్గు మొదలైన సదుపాయాలు ఈ  ఆసుపత్రికి మౌలిక సదుపాయాలలో ఉన్నాయి. 

వైద్యుల గది,  ట్రీయేజ్ ఏరియా, సందర్శకుల ప్రాంతం, స్వాగత కక్ష్య ; వెంటిలేటర్లతో ఐ.సి.యు. 125 మానిటర్లు: 375 సాధారణ పడకలు; 10 కిలో లీటర్ల సామర్ధ్యంతో క్రయోజెనిక్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ వెసెల్;  ప్రతి మంచానికి ఆక్సిజన్ సరఫరా; పి.పి.ఈ. కిట్లు; శానిటైజర్లు;  సి.సి.టి.వి. నిఘా వ్యవస్థ; వినియోగించే వస్తువులతో సహా హౌస్ కీపింగ్ సేవలు;  ఫార్మసీ, మెడికల్ పాథాలజీ ల్యాబ్, క్యాటరింగ్ సేవలు; లాండ్రీ సేవలు;  అంబులెన్సు సేవలు; కంప్యూటరీకరించిన ఆసుపత్రి నిర్వహణ వ్యవస్థ; విద్యుత్ఎ సరఫరా వ్యవస్థ వంటి ప్రత్యేక సేవలకు నైపుణ్యంతో కూడిన సిబ్బంది, నిర్వహణ సిబ్బంది;  ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ, డి.జి. సెట్లు మొదలైన వాటితో సహా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వంటి ఆసుపత్రి కి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను డి.ఆర్.డి.ఓ. కల్పించింది.

ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన వైద్యులు, నర్సులు, ఇతర సహాయక వైద్య సిబ్బందిని సాయుధ దళాల వైద్య సేవల డైరెక్టరేట్ జనరల్ ద్వారా సమకూర్చారు. 

రోజుకు 2 లక్షల లీటర్ల నీరు, 6 ఎం.వి.ఎ. విద్యుత్ సరఫరాతో పాటు ఆసుపత్రికి భద్రతా ఏర్పాట్లు వంటి సౌకర్యాలను బీహార్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 

*****(Release ID: 1648373) Visitor Counter : 12