నౌకారవాణా మంత్రిత్వ శాఖ

లక్షకు పైగా భారతీయ పోర్టులు మరియు చార్టెడ్ విమానాల సిబ్బందిని మార్చిన నౌకా మంత్రిత్వ శాఖ;

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది నౌకా సిబ్బంది మార్పును చేపట్టిన భారత్

కొవిడ్ విశ్వమహమ్మారి సమయంలో చిక్కుకున్న సముద్ర యాత్రికులను రక్షించడంలో నావికా సిబ్బంది కృషిని కొనియాడిన శ్రీ మన్సుఖ్ మాండవీయ

Posted On: 25 AUG 2020 3:26PM by PIB Hyderabad

చార్టెడ్ విమానాల ద్వారా లక్షకు పైగా భారతీయ పోర్టుల్లో నావికా సిబ్బందిని మార్చిన  భారత నౌకా మంత్రిత్వ శాఖ. కాగా ఈ విధంగా  భారీగా నావికా సిబ్బందిని మార్చడం ప్రపంచంలోనే మొదటిసారి. ఈ మార్పుల్లో ఒక ఓడలోని సిబ్బందిని మరొక ఓడకు మార్చడం నావికా కార్యనిర్వహణలో భాగమే.

కొరొనా మూలంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో నావికా రంగం ఒకటి.  అయినా కూడా ఈ క్లిష్ట పరిస్థితుల్లో  భారతీయ మరియు విదేశీ సముద్ర యాత్రికులు చిక్కుకున్నచోట మరియు ఇతర అత్యవసర వస్తువుల సరఫరా  రంగాల్లో తమ సేవలను కొనసాగించి మూల స్థంభంగా నిలచింది నౌకాయాన శాఖ. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల వారు విధించిన లాక్డౌన్ కారణంగా సముద్రయాత్రికులు ఏంతో కష్టపడవలసి వచ్చింది.

ఈ క్లిష్ట సమయంలో, ముఖ్యంగా లాక్డౌన్లో చిక్కుకుపోయిన సముద్రయాత్రికుల విషయంలో  సమర్థవంతంగా తమ సేవలను అందించిన డిజిని కేంద్ర నౌకాయాన శాఖ స్వతంత్ర మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. సముద్ర యాత్రికుల సాధకబాధకాలను తీర్చడానికి మరింత దృఢమైన విధానాన్ని రూపొందించాలని డిజిని మంత్రి కోరారు. ప్రతీ నావికాయాత్రికుడు ఈ క్లిష్ట సమయంలో మంత్రిత్వశాఖ వారిని సంప్రదించే అవకాశం కలిగించాలని అలాగే ఏ ఒక్క యాత్రికుడూ సమాచార లోపం వలన బాధపడరాదని ఆయన అన్నారు.

 

WhatsApp Image 2020-08-24 at 9.36.18 PM.jpeg

WhatsApp Image 2020-08-24 at 8.37.28 PM.jpeg

ఈ విశ్వమహమ్మారి క్లిష్ట సమయంలో ఓడప్రయాణానికి సంబంధించి అవసరమైన పత్రాల పొడిగింపు, ఆన్లైన్లో ఇ-పాస్   వంటి కార్యక్రమాలను డిజి షిప్పింగ్ చేపట్టారు. ఇందుకు సంబంధించి  చార్టెడ్ విమానాల కొరకు చిక్కుకు పోయిన నావికుల పత్రాల పరిశీలన, వారి వివరాల అప్లోడింగ్ మరియు చార్టర్ లైసెన్సింగ్, నౌకల కొరకు ఆన్లైన్  నమోదు వంటివి చేపట్టారని డిజి షిప్పింగ్ శ్రీ అమితాబ్ కుమార్ మంత్రిగారికి తెలిపారు.

 

                                     WhatsApp Image 2020-08-24 at 9.02.21 PM.jpeg

ఇ-మెయిల్, ట్వీట్లు మరియు ఉత్తరాల ద్వారా సుమారు 2000లకు పైగా నావికా సంబంధిత భాగస్వాముల నుండి డిజి షిప్పింగ్ సమాచారాన్ని అందుకున్నారు. వారి అవసరాలకు అనుగుణంగా తగిన చర్యలను తీసుకున్నారు. డిజి షిప్పింగ్ విద్యార్థుల కోసం ఆన్లైన్ విధానంలో ఇ-లర్నింగ్ ప్రారంభించగా ఇందులో సుమారు 35 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. చిక్కుకున్న నావికుల కోసం ఒక అన్లైన్ ఎగ్జిట్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ కోర్సు పూర్తయిన అనంతరం  కోవిడ్ కారణంగా వారు తమకు అనుకూలమైన ప్రాంతాల నుండి లేదా వారి ఇళ్ళ నుండి ఆన్లైన్లో పరీక్షకు హాజరు కావచ్చును. 

***


(Release ID: 1648528)