ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గత 24 గంటల్లో అత్యధికంగా ఒకే రోజు 66,550 మంది కోలుకున్నారు.

భారతదేశంలో మరో రికార్డు : మొత్తం రికవరీలు 24 లక్షలు దాటాయి

గత 25 రోజుల్లో కోలుకున్న కేసుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది.

Posted On: 25 AUG 2020 12:29PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు అమలుచేసిన సహకార మరియు వ్యూహాత్మక చర్యలు మంచి ఫలితాలను చూపుతున్నాయి.

భారతదేశం ఒకే రోజులో అత్యధిక రికవరీలను నమోదు చేసింది.  గత 24 గంటల్లో,  66,550 కోవిడ్ -19 రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం; సమగ్రంగా గుర్తించడం, మరియు సమర్ధవంతంగా వ్యవహరించడం అనే ప్రభుత్వ విధానానికి సాక్ష్యంగా, మొత్తం రికవరీల సంఖ్య 24 లక్షలు దాటి 24,04,585 గా నమోదయ్యింది. 

దీనితో, భారతదేశంలోని  కోవిడ్-19 రోగులలో రికవరీ రేటు 76 శాతం (75.92 శాతం) కు చేరుకుంది.  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య (7,04,348) కంటే కోలుకున్న రోగుల సంఖ్య 17 లక్షలకు పైగా అధిగమించింది.  ఈ రోజున, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య కంటే కోలుకున్న రోగుల సంఖ్య 3.41 రెట్లు అధికంగా ఉంది

 

గత 25 రోజుల్లో కోలుకున్న కేసుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. 
 

రికార్డు స్థాయిలో పెరుగుతున్న అధిక రికవరీలు దేశం యొక్క వాస్తవ కేసుల భారాన్ని నిర్ధారిస్తాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్స పొందుతున్న కేసులు 22.24 శాతంగా  మాత్రమే ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల సమిష్టి కృషి ఫలితంగా, పరీక్షలు, నిఘా మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా నియంత్రణ, ఇళ్ళల్లో, సంస్థలలో ఐసోలేషన్ ఏర్పాట్లు, అభివృద్ధి చేసిన వైద్య మౌలిక సదుపాయాలలో సమర్థవంతమైన చికిత్సతో పాటు పరీక్షలు, ప్రభావవంతమైన చర్యలతో పాటు మూడు రకాల కోవిడ్  సౌకర్యాలు కల్పించడం జరిగింది.  వీటిలో అంకితమైన కోవిడ్ సంరక్షణ కేంద్రాలు, అంకితమైన కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు మరియు అంకితమైన కోవిడ్ ఆసుపత్రులు ఉన్నాయి.  ఈ నిరంతర చర్యలు సమిష్టిగా ఫలితాలను కలిగిస్తున్నాయి.  క్రమంగా తగ్గుతూ వస్తున్నా కేసు మరణాల రేటు ఈ రోజు 1.84 శాతంగా నమోదయ్యింది. 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలుసలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం  వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి :  https://www.mohfw.gov.in/   మరియు  @MoHFW_INDIA.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :   ncov2019[at]gov[dot]in   మరియు   @CovidIndiaSeva .

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనాఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన  ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  

లేదా  1075  టోల్ ఫ్రీ నెంబరును సంప్రదించవచ్చు.  వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి : https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

 

*****



(Release ID: 1648486) Visitor Counter : 230