ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
'పరీక్షించు, ఛేదించు, చికిత్స అందించు' అనే వ్యూహం తో భారత్ లో దాదాపు 3.7 కోట్ల పరీక్షలు
మిలియన్ మందిలో పరీక్షలు జరిగిన వారి సంఖ్య పెరుగుదల, 26,685కి చేరిక
Posted On:
25 AUG 2020 1:22PM by PIB Hyderabad
టెస్ట్, ట్రాక్, ట్రీట్ ... పరీక్షించు, ఛేదించు, చికిత్స అందించు అనే వ్యూహంపై దృష్టి కేంద్రీకరిస్తూ చేస్తున్న కృషి వల్ల మొత్తం భారత్ ఇప్పటి వరకు సుమారు 3.7 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. గట్టి సంకల్ప బలంతో చేపట్టిన ఈ యజ్ఞంలో తాజా లెక్కల ప్రకారం 3,68,27,520 పరీక్షలు జరిపారు.
గడచిన 24 గంటల్లో 9,25,383 పరీక్షలు జరిగాయి. దీనితో ప్రతి మిలియన్ మందిలో పరీక్షలు జరిగిన వారి సంఖ్యా 26,685 కి పెరిగింది.
సకాలంలో గుర్తింపు, కచ్చితమైన ఐసోలేషన్, సమర్థవంతమైన చికిత్స వైపుగా మొదటి దశలో చేపట్టిన చర్యలు, అధిక పరీక్షలు, సంక్రమణ వ్యాప్తిని పరిమితం చేస్తోంది.
పూణేలోని ఒకే ల్యాబ్ నుండి ప్రారంభించి, భారతదేశం టెస్టింగ్ ల్యాబ్ నెట్‌వర్క్ ఈ రోజు మొత్తం 1524 ల్యాబ్‌లతో గణనీయంగా విస్తరించింది. ప్రభుత్వ రంగంలోని 986 ప్రయోగశాలలు, 538 ప్రైవేట్ ప్రయోగశాలలు ఈ విధంగా పని చేస్తున్నాయి :
• రియల్ టైమ్ ఆర్టి పీసీఆర్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు: 787 (ప్రభుత్వం: 459 + ప్రైవేట్: 328)
• ట్రూనాట్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 619 (ప్రభుత్వం: 493 + ప్రైవేట్: 126)
• సీబీనాట్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 118 (ప్రభుత్వం: 34 + ప్రైవేట్: 84)
కోవిడ్-19 సంబంధిత సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు & సలహాలపై అన్ని ప్రామాణికమైన, అప్ డేట్ అయిన సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా సందర్శించండి: https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA.
కోవిడ్-19 కి సంబంధించిన సాంకేతిక ప్రశ్నలకు covid19[at]gov[dot]in మరియు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ద్వారా సందేహాలు నివృతి చేసుకోవచ్చు. కోవిడ్-19 పై ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నెం.: + 91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కి డైల్ చేయవచ్చు. కోవిడ్-19 లోని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ నంబర్ల జాబితా https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf వద్ద కూడా అందుబాటులో ఉంది.
****
(Release ID: 1648457)
Visitor Counter : 259
Read this release in:
Manipuri
,
Urdu
,
Marathi
,
Assamese
,
English
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam