పర్యటక మంత్రిత్వ శాఖ

లాక్డౌన్ తరువాత మొదటిసారిగా తెరచిన హోటల్ అశోక్ సన్నద్ధతను సమీక్షించడానికి హోటల్ను సందర్శించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
కోవిడ్-19కు సంబంధించి ఆరోగ్యం మరియు భద్రతకు పాటించాల్సిన అంశాలపై భారత పర్యాటక అభివృద్ధి సంస్థ(ఐటిడిసి) సింబ్బందికి తగిన శిక్షణ: శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్

Posted On: 25 AUG 2020 12:42PM by PIB Hyderabad

ఢిల్లీ విపత్తు నిర్వహణాధికార సంస్థ(డిడిఎంఏ) వారి ఆదేశాల అనుసారం ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని భారత పర్యాటక  అభివృద్ధి సంస్థ(ఐటిడిసి) వారు నిర్వహిస్తున్న హోటల్ అశోక్ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నదా లేదా అని తనిఖీ చేయడం కోసం 24 ఆగస్టున కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ సందర్శించారు. రాష్ట్ర రాజధానిలోని తమ హోటళ్ళను  24 ఆగస్టు 2020 నుండి పున:ప్రారంభించనున్నట్లు ఐటిడిసి ప్రకటించింది.

పర్యాటక రంగంలో  రెండు పెద్ద భాగస్వాములైన హోటళ్ళు మరియు రెస్టారెంట్లను తిరిగి ప్రారంభించడం శుభ పరిణామమని ఈ నిర్ణయం వలన పర్యాటక రంగానికి మరియు దేశీయ రవాణాకు ఊపిరిలూదుతుందని మంత్రి అన్నారు. డిడిఎంఏ తీసుకున్న ఈ నిర్ణయం వలన రాజధానిలోని పర్యాటక రంగం పునరుజ్జీవింపబడుతుందని ఆయన అన్నారు.

ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో మాట్లాడుతూ పర్యాటక శాఖామాత్యులు కోవిడ్-19కు సంబంధించి  ఆరోగ్య మరియు భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా ఐటిడిసిలోని అన్ని విభాగాల సిబ్బంది తగిన శిక్షణ  పొందారు.  కోవిడ్ -19 పరిస్థితులను సమీక్షించడానికి మరియు అవసరమైన సందర్భాల్లో తగిన చర్యలను తీసుకునేందుకు ఏయిమ్స్ తో ఒప్పందా(ఎంఓయు)న్ని చేసుకున్నట్లు తెలిపారు.

8 జూన్ 2020 నుండి హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు ఆదరణ సేవలకు సంబంధించినవి దశలవారీగా పున:ప్రారంభించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతినిచ్చింది. హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు ఇతర వసతి సదుపాయాల యూనిట్లను తెరవడానికి  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు నియమ నిబంధనలు(ఎస్ఓపిలు/ప్రొటోకాల్స్)ను విధించింది. కాగా  కేంద్ర పర్యాటక శాఖ దేశవ్యాప్తంగా హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు ఇతర వసతి సదుపాయాల సేవల నిర్వహణకు తగిన మార్గదర్శకాలను రూపొందించి  పంపించింది.

***(Release ID: 1648476) Visitor Counter : 11