సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, అనుబంధ మీడియా సంస్థల్లో వేగంగా కొనసాగుతున్న ప్రత్యేక ప్రచారం 5.0
ప్రత్యేక ప్రచారం 5.0 ద్వారా భారీ విజయాలను సాధించిన మంత్రిత్వశాఖ:
1.43 లక్షల కిలోల చెత్త తొలగింపు, 973 ప్రాంతాల్లో శుభ్రత, 14 వేల ఫైళ్ల సమీక్ష
స్వచ్ఛత, సామర్థ్యం, పెండింగ్ అంశాల పరిష్కారంపై మంత్రిత్వశాఖ నిబద్ధతకు
‘ప్రత్యేక ప్రచారం 5.0’ ఓ నిదర్శనం.
Posted On:
22 OCT 2025 1:56PM by PIB Hyderabad
సమాచార, ప్రసార మంత్రిత్వశాఖలో ప్రత్యేక ప్రచారం 5.0 జోరుగా సాగుతోంది. స్వచ్ఛతను కొనసాగించడం, పెండింగ్ పనులను తగ్గించడం, కార్యనిర్వహణలో సమర్థతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
దేశవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు, క్షేత్రస్థాయి కార్యాలయాలతో కలిసి మంత్రిత్వశాఖ ప్రత్యేక ప్రచారం 5.0ను ఉత్సాహంగా అమలు చేస్తోంది. కార్యాలయాలను మరింత శుభ్రంగా ఉంచడం, పెండింగ్ వ్యవహారాలను పరిష్కరించడం, పనితీరును మెరుగుపరచడం ఈ ప్రచారంలోని ప్రధాన అంశాలు. 5.0 స్వచ్ఛతా కార్యక్రమాన్ని 2025 అక్టోబర్ 2న ప్రారంభించారు. ప్రచార సన్నాహక దశలో ఖరారు చేసిన లక్ష్యాలను సాధించేందుకు అంకితభావంతో ప్రయత్నాలు చేపట్టారు.
2025 అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగిన ఈ ప్రచారంలో మంత్రిత్వ శాఖ సాధించిన ముఖ్య విజయాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
-
మంత్రిత్వ శాఖ 493 బహిరంగ ప్రచారాలను నిర్వహించింది. 973 ప్రదేశాలను శుభ్రం చేసింది. 104 వాహనాలను ఖండించింది.
-
సుమారు 1.43 లక్షల కిలోల తుక్కును తొలగించారు. దీని ద్వారా 34.27 లక్షల ఆదాయం లభించడమే కాకుండా 8007 చదరపు అడుగుల స్థలం ఖాళీ అయ్యింది.
-
సుమారు 13, 900 ఫైళ్లను సమీక్షించారు. వాటిలో 3957 తొలగించారు. మొత్తం 585 ఈ-ఫైళ్లను సమీక్షించగా.. వాటిలో 165 పూర్తిగా తొలగించారు.
-
ఇవే కాకుండా 301 ప్రజా సమస్యలు, 57 పీజీ అభ్యర్థనలు, 16 ఎంపీ సూచనలు, 2 రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, 1 పీఎంఓ సూచనను కూడా పరిష్కరించారు.
-
ప్రత్యేక ప్రచారం 5.0 కింద ప్రత్యక్షంగా కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షించేందుకు మంత్రిత్వశాఖ నుంచి అధికారులను వివిధ క్షేత్ర కార్యాలయాలకు పంపించారు.
మంత్రిత్వశాఖ ప్రత్యేక ప్రచారం 5.0 లక్ష్యాలపై అంకితభావంతో కొనసాగుతోంది. ఈ ప్రచారం ద్వారా కార్యాలయాల శుభ్రతను మెరుగుపరచడం, పని సామర్థ్యాన్ని పెంచడం, స్వచ్ఛతను స్థిరంగా కొనసాగించడం, పెండింగ్ వ్యవహారాలను సకాలంలో పరిష్కరించడం, బాధ్యతాయుతమైన ఈ-వ్యర్థాల నిర్వహణకు ప్రోత్సాహం, దేశ పరిశుభ్రత, స్థిరత్వానికి దోహదపడటం వంటి కీలక అంశాలపై మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది.
ప్రచారానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు:
1. పీఐబీ ఇంఫాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం 5.0 ద్వారా ఓ పాఠశాలలో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాల పరిసరాల శుభ్రతపై అవగాహన, సామూహిక బాధ్యత భావనను ప్రోత్సహించారు.
2. శాస్త్రి భవన్‌లోని రికార్డు గది, మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలలో శుభ్రత, డిజిటలైజేషన్, ఫైళ్ల తొలగింపు పనులను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి, సీనియర్ ఆర్థిక సలహాదారు ఆర్. కే. జెనా పరిశీలించారు.
***
(Release ID: 2181627)
Visitor Counter : 10
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam