PIB Headquarters

కోవిడ్ -19 మీద పిఐబి రోజువారీ బులిటెన్

Posted On: 30 DEC 2020 6:06PM by PIB Hyderabad

 

Coat of arms of India PNG images free download

(కోవిడ్ కి సంబంధించి గత 24 గంటలలో జారీచేసిన పత్రికాప్రకటనలు, పిఐబి క్షేత్రస్థాయి అధికారులు సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఇందులో ఉంటాయి)

  • యుకె లో బైటపడ్డ కొత్త తరహా కోవిడ్ వైరస్  20 మందిలో గుర్తింపు
  • వరుసగా 33 రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారే ఎక్కువ
  • గత 24 గంటలలో 20,549 మంది పాజిటివ్ గా నిర్థారణ, కోలుకున్నవారు 26,572 మంది
  • ప్రతి పది లక్షల్లో కేసులు, మరణాలు ప్రపంచంలో అతి తక్కువ నమోదైన దేశాల్లో భారత్ ఒకటి 
  • ఇంతకు ముందు జారీచేసిన నిఘా మార్గదర్శకాలు జనవరి 31, 2021 దాకా కొనసాగిస్తూ  హోం మంత్రిత్వశాఖ ఆదేశాలు
  • నాలుగు రాష్ట్రాల్లో కోవిడ్-19 నమూనా టీకాల కార్యక్రమం విజయవంతం

#Unite2FightCorona

#IndiaFightsCorona

Image

యుకె లో బైటపడ్డ కొత్త తరహా కోవిడ్ వైరస్ 20 మందిలో గుర్తింపు; 33 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ; చికిత్సలో ఉన్నవారి సంఖ్య మరింత తగ్గుదల; ప్రతి పది లక్షల్లో కేసులు, మరణాలు ప్రపంచంలో అతి తక్కువ నమోదైన దేశాల్లో భారత్ ఒకటి 

 

యుకె లో బైటపడ్డ కొత్త తరహా కోవిడ్ వైరస్ ను భారత్ లో మొత్తం 20 మందిలో గుర్తించారు. వీరిలో ఇంతకుముందే గుర్తించిన ఆరుగురు ( బెంగళూరు నిమ్హాన్స్ లో ముగ్గురు, హైదరాబాద్ సిసిఎంబి లో ఇద్దరు, పూణె ఎన్ ఐ వి లో ఒకరు) ఉన్నారు. 10 లాబ్ లో మొత్తం 107 శాంపిల్స్ పరీక్షించారు.  ఇప్పుడు కనబడుతున్న రెండో రకం కోవిడ్ విషయంలో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం భారత ప్రభుత్వం పది లాబ్ లతో కూడిన ఒక కన్సార్షియం ను ఏర్పాటు చేసింది.  అందులో ఎన్ ఐ బి ఎం జి ( కోల్ కతా), ఐ ఎల్ ఎస్ ( భువనేశ్వర్), ఎన్ ఐ వి ( పూణె)సిసిఎస్ ( పూణె), సిసిఎంబి ( హైదరాబాద్), CCS Pune, సిడి ఎఫ్ డి (హైదరాబాద్), ఇన్ స్టెమ్ ( బెంగళురు), నిమ్హాన్స్ ( బెంగళూరు), ఐజిఐబి ( ఢిల్లీ), ఎన్ సి డిసి( ఢిల్లీ) ఉన్నాయి.  పరిస్థితిని చాలా నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు తగిన సలహా ఇస్తున్నారు. అదే సమయంలొ నిఘా పెంచటం, నియంత్రణ చర్యలు చేపట్టటం, పరీక్షలు జరపటం, శాంపిల్స్ ను ఈ కన్సార్షియంలోని  లాబ్స్ కు పంపటం జరుగుతోంది. గత 33 రోజులుగా రోజువారీ వస్తున్న కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గడిచిన 24 గంటలలో  20,549 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ జరిగింది. అదే సమయంలో 26,572 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య  98,34,141 కి చేరింది. ఇది ప్రపంచంలో అత్యధికం.  కోలుకున్నవారి శాతం కూడా 96 కు చేరువలో 95.99% గా నమోదైంది. కోలుకున్న వారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా  పెరుగుతూ ప్రస్తుతం 95,71,869 అయింది.  భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 2,62,272 మంది కాగా వీరు మొత్తం పాజిటివ్ కేసులలో  2.56% మాత్రమే.  కొత్తగా కోలుకున్నవారి కారణంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య  6,309 మేరకు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు  ప్రతి పది లక్షల జనాభాలో భారత్ లో కేసుల సంఖ్య  అతి తక్కువ స్థాయిలో 7,423గా నమోదైంది.  రష్యా, ఇటలీ, యుకె, బ్రెజిల్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేసాలలో ప్రతి పది లక్షల జనాభాకు నమోదైన కేసులు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా గడిచిన 24 గంటలలో కోలుకున్నవారిలో 78.44% మంది 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు.  మహారాష్ట్రలో ఒక్కరోజులోనే అత్యధికంగా 5,572 మంది కోలుకోగాకేరళలో 5,029 మంది, చత్తీస్ గఢ్ లో  1,607మంది కోలుకున్నారు. కొత్తగా కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 79.24%  మంది 10 రాష్ట్రాలకు చెందినవారు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా  3,018 కొత్త కేసులు, పశ్చిమ బెంగాల్ లో  1,244 కేసులు వచ్చాయి.  గడిచిన 24 గంటలలో 286 మంది కోవిడ్ బాధితులు మరణించారు. వీరిలో 79.37% మంది పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా నిన్న  68 మంది మరణించగా పశ్చిమ బెంగాల్ లో 30 మంది, ఢిల్లీలో 28 మంది చనిపోయారు.    రోజుకు మరణాల సంఖ్యను 300 లోపు ఉండేట్టు చేయగలిగింది.    దేశంలో రోజువారీ మరణాలు క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. ప్రపంచంలో అతి తక్కువ స్థాయిలో దేశంలో ప్రతి పది లక్షల జనాభాలో మృతులు 107 గా నమోదయ్యాయి.

 

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1684585

 

బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చే  వచ్చే అంతర్జాతీయ విమానాల తాత్కాలిక రద్దును జనవరి 7 దాకా పొడిగించాలని సిఫార్సు చేసిన హోం మంత్రిత్వశాఖ

 

బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చే అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును జనవరి 7 దాకా పొడిగించాలని పౌర విమానయానశాఖను హోం మంత్రిత్వశాఖ కోరింది. ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన ఏర్పాటైన జాయింట్ మానిటరింగ్ కమిటీ, ఐసిఎంఆర్ డిజి అధ్యక్షతన ఏర్పాటైన టాస్క్ ఫోర్స్, నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు ఉమ్మడిగా  ఇచ్చిన సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 7 తరువాత విమాన పునరుద్ధరణ అంశాన్ని పరిశీలిస్తారు. వ్యాధి వ్యాప్తికి దారితీసే ఎలాంటి  ఘట్టాలనూ అనుమతించవద్దంటూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అన్ని రాష్ట్రాలకూ లేఖ రాశారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా గుమికూడటం మీద కఠినంగా వ్యవహరించాలని ఆ లేఖలో కోరారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1684551

 

 గ్లోబల్ అలయెన్స్ ఫర్ వాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ బోర్డ్ కు నామినేట్ అయిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ గ్లోబల్ అలయెన్స్ ఫర్ వాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ బోర్డ్ కు నామినేట్ అయ్యారు. ఆయన ఆగ్నేయాసియా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తారు.  ప్రస్తుతం మయన్మార్  ఆ స్థానంలో ఉంది. డాక్టర్ హర్ష వర్ధన్ ఈ పదవిలో 2021 జనవరి 1 నుంచి రెండేళ్ళపాటు ఉంటారు.  ఏడాదికి రెండు సార్లు జూన్ లోను, నవంబర్ లోను ఈ బోర్డు సమావేశమవుతుంది. టీకాల అమలు కార్యక్రమం మీద ఈ బోర్డు చర్చిస్తుంది. వివిధ భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1684543

 

నాలుగు రాష్ట్రాల్లో కోవిడ్-19 నమూనా టీకాల కార్యక్రమం విజయవంతం

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నాలుగు రాష్ట్రాలలో రెండు రోజులపాటు కోవిడ్ టీకాల నమూనా కార్యక్రమం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో ఈ నెల 28, 29 తేదీలలో ఈ కార్యక్రమం చేపట్టింది. గతంలో అమలు చేసిన పొంగు, మెదడు వాపు తదితర టీకాల కార్యక్రమమే దీనికి పునాదిగా నిలిచింది. ముందుగా టీకాలివ్వాల్సిన వైద్య సిబ్బందినే ఇందుకు ఎంచుకున్నారు. 50 ఏళ్ళు పైబడ్ద, ఇతర దీర్ఘకాల వ్యాధులున్నవారికి ఈ టీకాలు ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వాలని నిర్ణయించుకోవటం తెలిసిందే. వాక్సిన్ ప్రణాళిక ,. అమలు , సమాచారాన్ని కంప్యూటర్ లోకి ఎక్కించటం తదితర అంశాలమీద ఈ నమూనా టీకాల కార్యక్రమం దృష్టి సారించింది.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1684524

 

ఆత్మ నిర్భర్ భారత్ కార్యాచరణ ప్రణాళిక నివేదికను విడుదల చేసిన డాక్టర్ హర్ష వర్ధన్ 

 

సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి దాక్టర్ హర్ష వర్ధన్  ఆత్మ నిర్భర్ భారత్ కార్యాచరణ ప్రణాళిక నివేదికను నిన్న  విడుదల చేశారు.  దీన్ని న్యూ ఢిల్లీకి చెందిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్ కాస్టింగ్ అండ్ అసెస్ మెంట్ కౌన్సిల్ తయారు చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, టిఫాక్ ఇడి ప్రొఫెసర్ ప్రదీప్ శ్రీవాస్తవ ఇతర సీనియర్ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  కోవిడ్ అనంతరం మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ నివేదిక రూపొందించారు. ఆరోగ్యం, యంత్ర సామగ్రి, ఐసిటి, వ్యవసాయం, తయారీ, ఎలక్ట్రానిక్స్ రంగాలమీద ఈ నివేదిక దృష్టి సారించింది. ఈ సందర్భంగా డాక్తర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, ప్రధాని దూరదృష్టి వల్లనే కోవిడ్ సంక్షోభ సమయంలో దృఢంగా నిలబడగలిగామని, ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపామని అన్నారు.

 వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1684459

 

 

జీనోమ్ సీక్వెన్సింగ్ తొలిఫలితాలు విడుదల చేసిన జీనోమ్ కన్సార్షియం  ప్రయోగశాలలు

 

యుకె నుంచి వస్తున్న కొత్త తరహా కోవిడ్ ను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తూ తక్షణ చర్యలు ప్రారంభించింది. నియంత్రణ దిసలో చురుగ్గా చేపట్తాల్సిన చర్యలను వెంటనే అమలులోకి తెచ్చింది.ఈ వ్యూహంలో భాగంగా బ్రిటన్ నుంచి వచ్చే విమానాలన్నిటినీ తాత్కాలికంగా రద్దు చేసింది. ముందుగా డిసెంబర్ 31 వరకు, ఆ తరువాత జనవరి 7 వరకు రద్దు ను పొడిగించింది.  బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణీకులందరికీ కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేసింది. ఎవరైకైనా పాజిటివ్ అని తేలితే వారి శాంపిల్స్ ను ప్రభుత్వం నిర్దేశించిన 10 ప్రయోగశాలల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతోంది. నేషనల్  టాస్క్ ఫోర్స్ సైతం  ఇప్పటిదాకా అనుసరిస్తున్న ఆనవాలు పట్టు, నిఘాపెట్టు, పరీక్షించి చికిత్స అందించు అనే వ్యూహాన్ని కొనసాగించాలని సూచించింది. వైరస్ కొత్తదే అయినా, ఇప్పుడున్న ప్రామాణిక చికిత్సావిధానాన్ని మార్చాల్సిన అవసరం లేదని కూదా నిర్థారించారు. ప్రస్తుత చికిత్సలకు తోడుగా జీనోమ్ సీక్వెన్సింగ్ మాత్రం తప్పనిసరి అని టాస్క్  ఫోర్స్ పేర్కొంది.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1684312

 

సాంకేతికంగా వేసే ముందడుగులు ప్రస్తుతమున్న సాంకేతికకు విధ్వంసకరం కావని ఈ ఏడాది నిరూపించింది: రాష్ట్రపతి కోవింద్ 

 

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో సామాజిక సంబంధాలు, ఆర్థిక కార్యకలాపాలు, ఆరోగ్య పరిరక్షణ, విద్య తదితర అనేక అంశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభిప్రాయపడ్దారు.  అయినప్పటికీ జీవితం స్తంభించిపోలేదని, దీనికి కారణం సమాచార, సాంకేతిక పరిజ్ఞానమేనని అన్నారు. సాంకేతికంగా వేసే ముందడుగులు ప్రస్తుతమున్న సాంకేతికకు విధ్వంసకరమని తరచూ భావిస్తారని, కానీ  ఈ ఏడాది అందుకు భిన్నమైన ఉదాహరణలు చూపిందని వ్యాఖ్యానించారు. నెల 30 న ఆయన డిజిటల్ ఇండియా పురస్కారాల ప్రదానోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న సందర్భంగా ప్రసంగించారు. డిజిటల్ విధానాల సహకారంతో మనం కీలకమైన వ్యవహారాలన్నీ నిరాటంకంగా కొనసాగేలా చేయగలిగామన్నారు. అనేక సేవలు అందించటం కూదా సులభంగా సాధ్యమైందని గుర్తు చేశారు. అరోగ్య సేతు యాప్ నుమ్ ఈ-ఆఫీస్ వీడియో కాన్ఫరెన్సింగ్ ను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1684293

 

31న రాజ్ కోట్ లో ఎయిమ్స్ కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని 

 

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఈ నెల 31న  ఉదయ్తం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎయిమ్స్ కు శంకుస్థాపన చేస్తారు. గుజరాత్ గవర్నర్,  ముఖ్యమంత్రి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి, సహాయమంత్రి ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడి ఎయిమ్స్ ను 201 ఎకరాల విస్తీర్ణంలో

1195 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా  నిర్మించబోతున్నారు . 2022 మధ్య నాటికి ఇది పూర్తవుతుందని భావిస్తున్నారు. ఇందులో 750 పడకలతోబాటు 30 ఆయుష్ పడకల బ్లాక్ కూడా ఉంటుంది. 125 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు ఉంటాయి.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1684379

 

100వ కిసాన్ రైలు ప్రారంభించిన ప్రధాని

 

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు 100వ కిసాన్ రైలును వీడియీఓ కాన్ఫరెన్స్ ద్వారా  ప్రారంభించారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి ఈ రైలు పశ్చిమ బెంగాల్ లోని శాలిమార్ వెళుతుంది.  కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్  తోమార్, శ్రీ పీయూష్ గోయల్  కూదా ఈ కార్యక్రమంలొ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ,  దేస రైతుల ఆదాయం పెంచే దిశలో ఈ కిసాన్ రైల్ సర్వీస్ ను ఒక ప్రధానమైన అంశంగా అభివర్ణించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ గత నాలుగు నెలల కాలంలో 100 కిసాన్ రైళ్ళు ప్రారంభం కావటాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. సాగుబడికి సంబంధించి ఆర్థిక పరంగా ఈ సర్వీస్ ప్రధానమైన మార్పు తీసుకురాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1684158

మెరుగైన భవిష్యత్తు కోసం యువతకు నైపుణ్య శిక్షణ అవసరం

 

కోవిడ్ సంక్షోభం విసిరిన సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు యువతకు పిలుపునిచ్చారు. విజయవాడ సమీపంలోని స్వర్ణ భారత్  ట్రస్ట్ లో శిక్షణ పొందినవారికి  సర్టిఫికెట్లు ఇచ్చిన అనంతరం ఆయన ప్రసంగించారు.  దేశజనాభాలో 65% మంది 35 ఏళ్ళ లోపు వారే ఉండటాన్ని ప్రస్తావిస్తూ, దేశ అభివృద్ధి కోసం ఈ మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 21 వ శతాబ్దపు అవసరాలకు తగినట్టుగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వటంలో కేంద్రం, రాష్ట్రాలు చేస్తున్న కృషిని పునరుద్ఘాటించారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1684237

 

ప్లాస్టిక్ వాడకం మీద పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఉపరాష్ట్రపతి పిలుపు

 

ప్రజలు ప్లాస్టిక్ వస్తువు వాడి పారవేయట<=లొ పాటించాల్సిన పద్ధతులమీద పెద్ద ఎత్తున ప్రచారమ్ చేపట్తాల్సిన బాధ్య ఉందని ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. నిజానికి ప్లాస్టిక్స్ తో సమస్య లేకపోయినా, వాటిని వాడతం లొ మన వైఖరి సరైంది కాదని గుర్తు చేశారు. సోమవారం నాడు విజయవాడలో సెంట్రల్ ఇన్ స్టుట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ( సిపెట్) లో ఆయన విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు.  ప్లాస్టిక్ వస్తువుల వాడక కాలం ఆందోళన కలిగించే విషయమన్నారు.  ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణమీద మెరుగైన విధానాలు అవలంబించాలని సూచించారు. వాడకం తగ్గించటం, మళ్లీ మళ్లీ వాడటం, రీసైకిల్ చేయటం అనే అంశాలమీద దృష్టి సారించాలన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో  వైద్య పరమైన రక్షణ పరికరాల తయారీలో ప్లాస్టిక్స్ పోషించిన పాత్రను మరువలేమన్నారు.  భారత ఆర్థిక వ్యవస్థలో పాలిమర్స్ పాత్ర గణనీయమైనదని చెబుతూ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ విభాగాలు దాదాపు న్30 వేలమందికి ఉపాధి కల్పిస్తుండటాన్ని ప్రస్తావించారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1684237

 

కోవిడ్ సంబంధమైన నిఘా, నియంత్రణకు మార్గదర్శకాల గడువు పెంచిన హోం మంత్రిత్వశాఖ

 

గతంలో జారీ చేసిన మార్గదర్శకాలనే 2021 జనవరి 31 వరకు అమలు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం నాడు ఆదేశాలు జారీచేసింది. కోవిడ్ కేసులు పెద్ద ఎత్తున తగ్గుతూ వస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితి, బ్రిటన్ లొ కొత్త వైరస్ కారణంగా నిఘా మాత్రం కొనసాగించాలని సూచించింది. అందులో భాగంగానే కంటెయిన్మెంట్ జోన్లు, కఠినమైన నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది, జాగ్రత్తలు పాటించటంలోను, ప్రామాణిక విధి విధానాలలోనూ ఎలాంటి మార్పూ ఉందబోదని స్పష్టం చేసింది.    అనుమతించిన కార్యకలాపాల విషయంలో కూడా ఎలాంటి సడలింపూ ఉండబోదని నవంబర్ 25 నాటి మార్గదర్శకాలే జనవరి ఆఖరుదాకా ఉంటాయని పేర్కొంది.  .

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1684227

 

జమ్మూకశ్మీర్ లో ఖాదీ కళాకారులకు రూ.30 కోట్లు పంపిణీ చేసిన కెవిఐసి

 

ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంస్థ జమ్మూకాశ్మీర్ లో ఖాదీ హస్త కళాకారులకు కోవిడ్ సమయంలో ప్రత్యేక సహాయం అందజేసింది. దేసవ్యాప్తంగా సుస్థిరమైన పాధి కల్పించే క్రమంలో కెవిఐసి అవిశ్రాంతంగా కృషి చేసింది. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్ పర్వత ప్రాంతంలో రూ. 29.65 కోట్లు పంపిణీ చేసింది.  2020 మే నెల నుంచి సెప్టెంబర్ వరకు ఈ పంపిణీ జరిగింది. 84 ఖాదీ సంస్థలకు  10,800 మంది ఖాదీ హస్త కళాకారులకు లబ్ధి చేకూరింది.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1684723

 

 

పిఐబి క్షేత్ర స్థాయి అధికారులు అందించిన సమాచారం

  • కేరళ: బ్రిటన్ నుంచి వచ్చిన 20 మందికి కొత్త తరహా కోవిడ్ సంక్రమించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం యూరప్ నుంచి వస్తున్న ప్రయాణీకులకు పరీక్షలు జరుపుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన  వారిలో 18 మందికి కోవిడ్ సోకినట్టు నిర్థారణ కావటంతో రాష్ట్రం అప్రమత్తమైంది.  వాళ్ళ శాంపిల్స్ ను పూణె పంపారు.  జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఫలితాలు రావాల్సి ఉంది. ఒకవేళ కొత్త వైరస్ వచ్చిన ఇదే చికిత్స కొనసాగుతుందని . ఆరోగ్య శాఖామంత్రి కె.కె. శైలజ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం కేసులు పెరుగుతాయని భయపడినా, అలా జరగలేదన్నారు. గత 15 రోజుల పరీక్షలు అదే రుజువు చేశాయన్నారు. . రాష్ట్రంలో మంగళవారం నాడు  5,887 కొత్త కేసులు రాగా  5,029 మంది కోలుకున్నారు.  3014 మంది కోలుకున్నారు. ప్రస్తుతం పాజిటివ్ రేటు 9.5% గా ఉంది.
  • తమిళనాడు: ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 8,16,132 కేసులు నమోదయ్యాయి, 12,092 మంది మరణించగా, 8747 మంది చికిత్సలో ఉన్నారు 7,95,293 మంది కోలుకున్నారు.
  • కర్ణాటక: మొత్తం కేసులు  9,17,571కి చేరాయి, చికిత్సలో ఉన్నవారు: 11,861 మంది కాగా మరణాలు 12074 నమోదయ్యాయి. ఈరోజు వరకు కోలుకున్నవారి సంఖ్య: 8,93,617  
  • ఆంధ్రప్రదేశ్:  కోవిడ్ టీకాలు ఇవ్వటానికి యంత్రాంగం సంసిద్ధతను పరిశీలించటానికి రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ తోబాటు గుజరాత్, పంజాబ్, అస్సాం రాష్ట్రాలలో జరిగిన నమూనా టీకాల కార్యక్రమం విజయవంతమైంది.   ఇందుకోసం కృష్ణా జిల్లాలో  నిర్దిష్టంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు సోమ, మంగళ వారాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాయి. ప్రణాళిక, అమలు తీరు తెన్నులను ఇందులో పరీక్షించి చూశారు. డమ్మీ లబ్ధిదారుల సమాచారం అప్ లోడ్ చేయటం, వాక్సిన్ పంపిణీ, లబ్ధిదారుల సమాచారం లాంటివి అందులో భాగాలు. బ్రిటన్ నుంచి వచ్చిన ఒక మహిళ ఢిల్లీ అధికారుల కళ్ళుగప్పి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందన్న వార్తలమధ్య రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటిదాకా బ్రిటన్ నుంచి వచ్చిన 1406 మందిని పరీక్షించారు. వాళ్లతోబాటు వారితో సంబంధమున్న 6,364 మందిని  కూడాపరీక్షించారు. తిరుపతిలో కోవిడ్ భయంతో పుష్పగుచ్ఛాలు కొనటానికి భయపడుతున్నారు.   దీంతో పూల వ్యాపారులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
  • తెలంగాణ: ఈరోజుకు మొత్తం కేసులు 2,81,730 కు చేరాయి. చికిత్సలో ఉన్నవారు: 6590 మంది, మరణాలు1538 కాగా, కోలుకున్నవారు :2,85,939 మంది. బ్రిటన్ నుంచి వస్తున్న కొత్త కరోనా కారణంగా ఎటువంటి అవాంఛనీయమైన పరిస్థితినైనా ఎదుర్కునేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. వరంగల్ జిల్లాకు చెందిన 49 ఏళ్ల వ్యక్తి పాజిటివ్ అని సిసిఎంబి వెల్లడించింది. ఇలా ఉండగా సిసిఎంబి డైరెక్టర్ ఈ విషయమై మాట్లాడుతూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొత్త వైరస్ ను సైతం కొవాక్సిన్ నివారిస్తుందని భారత్ బయోటెక్ ఎండీ దాక్టర్ కృష్ణ ఎల్లా చెప్పారు.  
  • అస్సాం: అస్సాంలో తాజాగా 66 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. మంగళవారం నాడు  87 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య  216063 కు చేరుకోగా, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 211720 కు చేరింది. చికిత్సలో ఉన్నవారు 3300 కాగా 1040 మంది మరణించారు. నిన్న ఇద్దరు బాధితులు మరణించారు.   
  • సిక్కిం: సిక్కింలో మంగళవారం నాడు మరో 19 మంది పాజిటివ్ గా తేలారు.  మొత్తం కేసులు 5864 కు చేరగా  537 మంది ఇంకా చికిత్సలో ఉన్నారు.

 

నిజనిర్థారణ

 

 

 

 

 

 

 

Image

 

Image

Image

*******

 



(Release ID: 1684901) Visitor Counter : 319