ప్రధాన మంత్రి కార్యాలయం
వందో కిసాన్ రైలు కు జెండా ను చూపిన ప్రధాన మంత్రి
వ్యావసాయక ఉత్పత్తులకు విలువ ను జోడించడానికి సంబంధించిన ప్రోసెసింగ్ పరిశ్రమ కు మేము ప్రాధాన్యాన్ని ఇస్తాము: ప‌్రధాన మంత్రి
వ్యవసాయం లో ప్రైవేటు పెట్టుబడి రైతులకు సహాయకారి కాగలదు: ప్రధాన మంత్రి
Posted On:
28 DEC 2020 5:49PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని సంగోలా నుంచి పశ్చిమ బంగాల్ లోని శాలిమార్ కు నడిచే వందో కిసాన్ రైలు కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న జెండా ను చూపారు. కేంద్ర మంత్రులు శ్రీ నరేంద్ర సింహ్ తోమర్, శ్రీ పీయూష్ గోయల్ లు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కిసాన్ రైలు సర్వీసు దేశ రైతుల ఆదాయాన్ని పెంచే దిశ లో ఒక పెద్ద అడుగు అంటూ అభివర్ణించారు. కరోనా మహమ్మారి కాలం లో సైతం గత నాలుగు నెలల్లో 100 కిసాన్ రైళ్ళ ను ప్రవేశపెట్టడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విధమైన సేవ వ్యవసాయానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ లో ఒక పెద్ద మార్పు ను కొని తెస్తుందని, అంతేకాకుండా దేశం లో శీతలీకరణ సదుపాయం తో కూడిన సరఫరా వ్యవస్థ శక్తి ని కూడా పెంచుతుందని ఆయన చెప్పారు. కిసాన్ రైలు ద్వారా సరకుల చేరవేత కు ఎలాంటి కనీస రాశి ని ఖరారు చేయలేదని, అత్యంత చిన్న పరిమాణం లో ఉండే ఉత్పత్తి కూడా తక్కువ ధర కే సరైన విధం గా పెద్ద బజారు కు చేరగలుగుతుందని కూడా ఆయన తెలిపారు.
కిసాన్ రైలు పథకం రైతులకు సేవ చేయాలన్న ప్రభుత్వ వచనబద్ధత ను చాటడం ఒక్కటే కాకుండా మన రైతులు కొత్త బాధ్యతలను అందుకోవడానికి ఎంత వేగం గా సన్నద్ధులు అవుతారో అనే దానికి కూడా ఒక నిదర్శనం గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. రైతులు వారి పంటలను ప్రస్తుతం ఇతర రాష్ట్రాల లో కూడా అమ్ముకోగలుగుతారని, ఈ ప్రక్రియ లో రైతుల రైలు (కిసాన్ రైల్) తో పాటు వ్యావసాయక విమానాలు (కృషి ఉడాన్)లది ప్రధాన పాత్ర అని ఆయన అన్నారు. కిసాన్ రైలు అంటే, అది త్వరగా పాడయిపోయే ఫలాలు, కాయగూరలు, పాలు, చేపల వంటి సరకులను పూర్తి భద్రత తో చేరవేసే ఒక చలనశీల శీతలీకరణ నిలవ సదుపాయమే అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం లో ఎల్లప్పుడూ ఒక పెద్ద రైల్వే నెట్ వర్క్ అంటూ ఉంది; స్వాతంత్య్రం రావడానికంటే ముందు కూడా అది ఉంది. శీతలీకరణ నిలవ సంబంధిత సాంకేతిక విజ్ఞానం కూడాను అందుబాటు లో ఉండింది. ఇప్పుడు మాత్రమే ఈ బలాన్ని కిసాన్ రైల్ మాధ్యమం ద్వారా సరైన విధం గా వినియోగించుకోవడం జరుగుతున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
కిసాన్ రైలు వంటి సదుపాయం పశ్చిమ బంగాల్ కు చెందిన లక్షల కొద్దీ చిన్న రైతులకు ఒక భారీ సౌకర్యం అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సౌకర్యం అటు రైతులకు, ఇటు స్థానికంగా చిన్న వ్యాపారస్తులకు కూడా అందుబాటు లో ఉందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగ నిపుణులతో పాటు, ఇతర దేశాలకు చెందిన అనుభవాలను, కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశ వ్యవసాయ రంగం లోకి తీసుకురావడం జరుగుతోందని ఆయన అన్నారు.
రైల్వే స్టేశన్ ల పరిసర ప్రాంతాల లో పెరిశబుల్ రైల్ కార్గో సెంటర్ లను నిర్మించడం జరుగుతోంది. వాటిలో రైతులు వారి ఉత్పత్తి ని నిలవ చేసుకోవచ్చును. వీలైనన్ని ఎక్కువ పండ్లను, కాయగూరలను కుటుంబానికి అందించాలన్నదే ఈ ప్రయాస గా ఉంది. రసం, పచ్చడి, సాస్, చిప్స్ వగైరా అదనపు ఉత్పత్తి ఆయా ఉత్పత్తులలో నిమగ్నం అయిన నవ పారిశ్రామికుల చెంతకు చేరాలి అని ప్రధాన మంత్రి అన్నారు.
నిలవ సౌకర్యం తో కూడిన మౌలిక సదుపాయాల పైన, వ్యవసాయ ఉత్పత్తుల లో విలువ జోడింపునకు సంబంధించిన ప్రోసెసింగ్ పరిశ్రమలపైన శ్రద్ధ తీసుకోవడం ప్రభుత్వ ప్రాథమ్యం గా ఉందంటూ ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఆ తరహా లో సుమారు 6500 పథకాలకు పిఎమ్ కృషి సంపద యోజన లో భాగం గా మెగా ఫూడ్ పార్క్స్, కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎగ్రో ప్రోసెసింగ్ క్లస్టర్ లలో భాగం గా ఆమోదించడం జరిగింది అని ఆయన అన్నారు. 10,000 కోట్ల రూపాయలను ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీ లో భాగం గా మైక్రో ఫూడ్ ప్రోసెసింగ్ ఇండస్ట్రీస్ కోసం మంజూరు చేయడమైందని ఆయన అన్నారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు, యువతీయువకుల భాగస్వామ్యం, సమర్ధనలే ప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కావడానికి కారణం అవుతాయి అని శ్రీ మోదీ అన్నారు. వ్యవసాయ ప్రధాన వ్యాపారాలలోనూ, వ్యవసాయ ప్రధాన మౌలిక సదుపాయాల కల్పన లోనూ మహిళా స్వయంసహాయ సమూహాల వంటి సహకార సమూహాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఒ స్) వంటివి ప్రాధాన్యాన్ని పొందుతాయని ఆయన చెప్పారు. ఇటీవలి సంస్కరణలు వ్యవసాయ సంబంధ వ్యాపారం విస్తరించడానికి దారి తీస్తాయని, వాటి తాలూకు అతి పెద్ద లబ్ధిదారులు గా ఈ సమూహాలు ఉంటాయని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగం లో ప్రైవేటు పెట్టుబడి ఈ సమూహాలకు సహాయం అందించాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి మద్ధతు గా ఉండగలదని ఆయన అన్నారు. “మేము భారతదేశ వ్యవసాయ రంగాన్ని, కిసాను ను బలపరచే మార్గం లో ముందుకు సాగిపోతూనే ఉంటాము” అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 1684158)
Visitor Counter : 266
Read this release in:
Assamese
,
Marathi
,
Odia
,
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Malayalam