సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
కొవిడ్ -19 కష్టకాలంలో జమ్మూకాశ్మీర్ ఖాదీ చేతివృత్తులవారికి అండగా కేవీఐసి జీవనోపాధి కోసం 30 కోట్ల పంపిణీ
Posted On:
30 DEC 2020 2:13PM by PIB Hyderabad
కొవిడ్-19 కష్టకాలంలో జమ్మూకాశ్మీరులో ఖాదిచేతివృత్తులవారిని ఆదుకోడానికి ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్( కేవీఐసి) ప్రత్యేక చర్యలను అమలు చేసింది. దేశవ్యాపితంగా చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారికి ఉపాధి కల్పించడానికి కృషి చేస్తున్న కేవీఐసి జమ్మూకాశ్మీరుపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నది. దీనిలో భాగంగా కొండ ప్రాంతమైన జమ్మూకాశ్మీరులో ఉన్న ఖాదీ సంస్థలకు 29.65 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది.
2020 మేనుంచి సెప్టెంబర్ ల మధ్య 84 ఖాదీ సంస్థలకు ఈ మొత్తాన్ని అందజేయడం జరిగింది. దీని వల్ల 10,800 మంది చేతివృత్తులవారు ప్రయోజనం పొందారు. ఉత్పత్తితో ముడిపెట్టిన ఉత్పత్తి కార్యక్రమాల మార్కెటింగ్ సదుపాయం కింద కేవీఐసి ఈ సహాయాన్ని అందచేజేసింది. లబ్ధిదారుల బ్యాంకి ఖాతాలలోకి ఈ మొత్తం నేరుగా జమ అయ్యింది.
కొవిడ్ లాక్ డౌన్ సమయంలో వివిధ సాంకేతిక కారణాలతో వివాదంలో పడిన 2016-17 నుంచి 2018-19 కాలానికి సంబందించిన 951 వివాదాలను పరిష్కరించడానికి కూడా కేవీఐసి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం కింద 84 సంస్థలకు 29.65 కోట్ల రూపాయలను చెల్లించామని దీనివల్ల 10,800 చేతివృత్తుల కుటుంబాలకు ప్రయోజనం కలిగిందని కేవీఐసి చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు. వెనుకబడిన వర్గాలకు చెందినవారు భయం లేకుండా ' ఆత్మ నిర్భర్'తో జీవించాలన్న ప్రధానమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నామని ఆయన అన్నారు.
మార్కెటింగ్ పథకం ద్వారా ఖాదీ సంస్థలు మరియు చేతివృత్తులవారికి ఆర్థిక భరోసా ఇవ్వడమే కాకుండా, జమ్మూ, ఉధాంపూర్, పుల్వామా, కుప్వారా మరియు అనంతనాగ్ జిల్లాలలో ఖాదీ ఫేస్ మాస్క్ లను కుట్టడం ద్వారా స్వయం సహాయక బృందాలలో పనిచేస్తున్న వేలాది మంది మహిళా చేతివృత్తులవారికి కూడా కెవిఐసి అండగా నిలిచింది. దాదాపు 7 లక్షల ఖాదీ ఫేస్ మాస్క్ లను ఈ మహిళా చేతివృత్తులవారు కుట్టి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి సరఫరా చేశారని ఆయన వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో103 ఖాదీ సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిలో 12 ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పష్మినా శాలువాలను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో 60% పైగా శాలువాలు దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోని అనంతనాగ్ , బాండిపోరా, పుల్వామా మరియు కుల్గామ్ ఉత్పత్తి చేయబడుతున్నాయి. జమ్మూకాశ్మీర్ లో తయారైన ఉత్పత్తులను ఢిల్లీ , రాజస్థాన్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఆదరిస్తున్నారు. ఈ ఉత్పత్తులను వివిధ ఖాదీ ఇండియా విక్రయ కేంద్రాలు,మరియు కెవిఐసి ఇ-పోర్టల్ ద్వారా విక్రయిస్తున్నారు.
***
(Release ID: 1684723)
Visitor Counter : 220