ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

న్యూమోనియాకు తొలి భారతీయ వ్యాక్సీన్! ఆవిష్కరించిన కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్.

“స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సీన్,
ఆత్మనిర్భర్ భారత్, సాధనలో ముందడుగు”

Posted On: 28 DEC 2020 7:03PM by PIB Hyderabad

   న్యుమోనియా వ్యాధికారక సూక్ష్మజీవులను నిరోధించే శక్తితో భారతదేశపు మొదటి న్యూమోకాక్కల్ సంయోజక వ్యాక్సీన్ (పి.వి.సి.)ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్ర డాక్టర్ హర్షవర్ధన్ 2020 డిసెంబరు 28న ఆవిష్కరించారు. “న్యుమోసిల్” పేరిట ఈ వ్యాక్సీన్.ను,.. సీరమ్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ (ఎస్.ఐ.ఐ.పి.ఎల్.) రూపొందించింది. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ వంటి భాగస్వామ్య సంస్థల సహకారంతో వ్యాక్సీన్ రూపకల్పన జరిగింది.

https://ci6.googleusercontent.com/proxy/I1P6b8wsWN50LddDaQ6_XhzkkOszMKHcZHGVLX5efl4ZjgclRfz42Z68vS9RhnFfqLUxjqMHt6cPH79bJdnUB6K0gmc4HAAzAQrQOBz9r3rAoTvmZE5DJzgO=s0-d-e1-ft#http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001IP07.jpg

   పెద్ద సంఖ్యలో వ్యాక్సీన్ డోసుల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా సీరమ్ ఇన్.స్టిట్యూ ఆఫ్ ఇండియా గుర్తింపు సాధించిందని, భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ సంస్థకు కీలకపాత్ర ఉందని కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా చెప్పారు.  సీరమ్ ఇస్టిట్యూట్ వ్యాక్సీన్లను ప్రపంచంలోని 170 దేశాల్లో వినియోగిస్తున్నారని, ప్రపంచంలోని ప్రతి మూడవ చిన్నారికీ సీరమ్ సంస్థ తయారు చేసిన వ్యాక్సీన్ తోనే వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతోందని మంత్రి చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో తొలి న్యుమోకాక్కల్ సంయోజక వ్యాక్సీన్ తయారీకోసం, సీరమ్ ఇన్.స్టిట్యూట్ కు భారత ప్రభుత్వంనుంచి లైసెన్స్ లభించిందని, కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనిక పథకంలో భాగంగానే ఈ లైసెన్స్ లభించిందని ఆయన చెప్పారు. భారతదేశం స్వావలంబన శక్తితో వ్యాక్సీన్ తయారు చేయాలన్న లక్ష్యసాధనలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా అసాధారణంగా కృషి చేసిందన్నారు.

  దేశం అవసరాలను తీరే విధంగా ఒక వ్యాక్సీన్.ను తీర్చిదిద్దడంలో సీరమ్ ఇన్.స్టిట్యూట్ సాధించిన విజయాలను డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. “సీరమ్ ఇన్.స్టిట్యూట్ స్వదేశీ పరిజ్ఞానంతో  రూపొందించిన తొలి వ్యాక్సీన్  “న్యుమోసిల్” పేరిట మార్కెట్లో సరసమైన ధరకు సింగిల్ డోస్, మల్టీ డోస్.లలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. న్యుమోసిల్ వ్యాక్సీన్ సామర్థ్యాన్ని ఐదు ర్యాండమ్ సైజుల్లో ప్రయోగాత్మక పరీక్షల ద్వారా మధింపు చేశారని అన్నారు. భారతదేశం, ఆఫ్రికా ప్రాంతాల్లోని విభిన్నమైన జనాభా వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని పెంచడానికి దీని వాడకం సురక్షితమేనని తేల్చినట్టు డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.  “న్యుమోసిల్ వ్యాక్సీన్ సురక్షితమైదని, సమర్థంగా పనిచేస్తుందని ప్రయోగాత్మక పరీక్షల్లో రుజువైనట్టు, ఈ ప్రయోగాత్మక పరీక్షల ఫలితాల ప్రాతిపదికగానే, భారతీయ ఔషధ నియంత్రణ వ్యవహారాల కంట్రోలర్ జనరల్ దీనికి లైసెన్స్ మంజూరు చేసినట్టు మంత్రి చెప్పారు. సబ్జెట్ నిపుణుల కమిటీ (ఎస్.ఇ.సి.) ఆమోదం తర్వాతనే న్యుమోసిల్ వ్యాక్సీన్ కు అనుమతి మంజూరు చేసినట్టు పేర్కొన్నారు.

https://ci4.googleusercontent.com/proxy/xwBLKXfarJ6xcvfmJ_BStIss4WY1J4-s8OEIuH5GyciH7iLXe7_svawWP8prRClH_sIO2e06Y4EuUGVW9erWlxniglCY-QdF0NJP4iybGcKM8pwPUhIKyIF9=s0-d-e1-ft#http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002I0P2.jpg

 ఆత్మనిర్భర భారత్ నినాదానికి ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నారని, హర్షవర్ధన్ పేర్కొన్నారు. ‘ప్రపంచంకోసం భారత్ లో తయారీ’ అన్న దార్శనికతకు అనుగుణంగా, ప్రభుత్వం కృషి చేసినట్టు తెలిపారు. అధునాతనమైన వ్యాక్సీన్ల రూపకల్పన, పరిశోధన, తయారీలో భారత్ కు తగిన సామర్థ్యం ఉందని చెప్పడానికి న్యుమోసిల్ వ్యాక్సీన్ ఒక తార్కాణంగా నిలుస్తుందన్నారు. కోవిడ్-19 సంక్షోభ కాలంలో వ్యాక్సీన్ రూపకల్పన జరగడం మనదేశానికి నిజంగా ఎంతో గర్వకారణమన్నారు. ఇలాంటి వ్యాక్సీన్ తయారీలో ఇప్పటివరకూ మనం విదేశీ తయారీదార్లపైనే ఆధారపడవలసి వచ్చేదని, అవి మరీ భారీ ధరల్లో మాత్రమే లభించేవని హర్షవర్ధన్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడానికి న్యుమోనియా ఇన్.ఫెక్షన్ ప్రధాన కారణమని, ఈ ఇన్.ఫెక్షన్.తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిలక్షల మరణాలు నమోదవుతున్నాయని కేంద్రమంత్రి చెప్పారు.

  స్వదేశీ పరిజ్ఞానంతో ఈ వ్యాక్సీన్ ను రూపొందించినందుకు విజ్ఞాన లోకానికి, వైద్య సోదరులకు కేంద్రమంత్రి అభినందనలు తెలిపారు. “భవిష్యత్తులో మరిన్ని ప్రాణ రక్షణ వ్యాక్సీన్లను రూపకల్పనకోసం సీరమ్ ఇండియా ఇన్.స్టిట్యూట్ తో పాటుగా, ఇతర వైజ్ఞానిక నిపుణులు తమ కృషిని కొనసాగించగలరని నేను కచ్చితంగా విశ్వసిస్తున్నాను.”అని కేంద్రమంత్రి అన్నారు.

https://ci3.googleusercontent.com/proxy/5joDNaCV-619ynTF1zac5k1rRPClQ3tMZ_FdnpQSXBwJcdBDD1bsYUkltfLmb6i4s9mbG1UkCf1hQ4V8sgqQwVBqJnkmtSHF7PW-925vxcIUovnW2Dj42ipT=s0-d-e1-ft#http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003U6ZI.jpg

  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ అగ్నాని, ఇతర సీనియర్ అధికారులు వ్యాక్సీన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్.ఐ.ఐ.పి.ఎల్. వ్యవస్థాపకుడు, పూనావాలా పరిశ్రమల గ్రూపు చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా, సీరమ్ ఇన్.స్టిట్యూట్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి అదర్ పూనావాలా కూడా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

 

*****



(Release ID: 1684293) Visitor Counter : 239