ప్రధాన మంత్రి కార్యాలయం

రాజ్‌కోట్ లో ఎఐఐఎమ్ఎస్ కు ఈ నెల 31 న శంకుస్థాప‌న చేయ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 29 DEC 2020 3:32PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని రాజ్‌కోట్ లో ఎఐఐఎమ్ఎస్ కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా  ఈ నెల 31 న ఉద‌యం 11 గంట‌ల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.  ఈ సంద‌ర్భం లో గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్‌, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, కేంద్ర ఆరోగ్య మంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ స‌హాయ మంత్రి కూడా పాల్గొంటారు.

ఈ ప్రాజెక్టు కోసం 201 ఎక‌రాల భూమిని కేటాయించ‌డ‌మైంది.  దీనిని 1195 కోట్ల రూపాయ‌ల అంచనా ఖ‌ర్చుతో నిర్మించ‌నున్నారు.  ఈ ప్రాజెక్టు 2022వ సంవ‌త్స‌రం మ‌ధ్య క‌ల్లా పూర్తి కాగ‌ల‌ద‌ని ఆశిస్తున్నారు.  అత్యాధునిక‌మైన 750 ప‌డ‌క‌లతో ఏర్పాట‌య్యే ఆసుపత్రిలో 30 ప‌డ‌క‌లతో కూడిన ఆయుష్ బ్లాకు కూడా ఉంటుంది.  ఈ ఎఐఐఎమ్ఎస్ లో 125 ఎమ్‌బిబిఎస్‌ సీట్లతోపాటు, 60 న‌ర్సింగ్ సీట్లు ఉంటాయి.



 

***


(Release ID: 1684379) Visitor Counter : 228