హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్ నిబంధనల అమలు గడువు పొడిగించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
- కోవిడ్‌కు సంబంధించి తగు ప్రవర్తన విషయమైన సూచించిన నియంత్రణ చర్యలు, వివిధ కార్యకలాపాలకు సంబంధించి జారీ చేసిన ఎస్ఓపీలను కఠినంగా అమలు చేయాలని, తగు జాగ్రత్తలతో పాటు అమలుపై నిఘా ఉంచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచన
प्रविष्टि तिथि:
28 DEC 2020 6:37PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారి నియంత్రణ విషయమై గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను వచ్చే ఏడాది జనవరి ముగింపు నాటి వరకు (31.01.2021) అమలులో ఉండేలా చూడాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలను జారీ చేసింది. క్రియాశీలక మరియు కొత్త కోవిడ్-19 కేసులలో నిరంతర క్షీణత
నమోదవుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కేసుల పెరుగుదల, యునైటెడ్ కింగ్‌డమ్‌లో రూపాంతర వైరస్ ఆవిర్భావాన్ని దృష్టిలో ఉంచుకుని, నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్త చర్యలను ఇకపై కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని హోం శాఖ తన ఆదేశాలలో అభిప్రాయపడింది.
తాజా ఆదేశాల ప్రకారం కంటైన్‌మెంట్ జోన్‌లను జాగ్రత్తగా గుర్తించడం ఇకపైనా కొనసాగుతుంది; ఈ మండలాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించబడతాయి; కోవిడ్-19కు సంబంధించి తగిన ప్రవర్తన ప్రోత్సహించబడింది. ఇది కచ్చితంగా అమలు చేయబడుతుంది; మరియు అనుమతించబడిన వివిధ కార్యకలాపాలకు సంబంధించి గతంలో సూచించిన ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్ఓపీలు) చాలా జాగ్రత్తగా అనుసరించబడాలని కోరింది. ఇందుకు గాను
25.11.2020 న జారీ చేసిన మార్గదర్శకాలు, హోం శాఖ మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు / ఎస్ఓపీల అమలు కఠినంగా పాటించేలా దృష్టి సారిస్తూ నిఘా, నియంత్రణను రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు కచ్చితంగా అమలు చేయాలని కోరింది.
*****
(रिलीज़ आईडी: 1684227)
आगंतुक पटल : 339