ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

"ది వ్యాక్సిన్ అలయన్స్" - జి.ఏ.వి.ఐ. బోర్డుకు నియమితులైన - కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్

Posted On: 29 DEC 2020 5:16PM by PIB Hyderabad

గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ (జి.ఏ.వి.ఐ), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ను, జి.ఏ.వి.ఐ. బోర్డు సభ్యునిగా, ఎంపిక చేసింది.

జి.ఏ.వి.ఐ. బోర్డులోని ఆగ్నేయ ప్రాంత ప్రాంతీయ కార్యాలయం (ఎస్.ఈ.ఏ.ఆర్.ఓ) / పశ్చిమ పసిఫిక్ ప్రాతీయ కార్యాలయం (డబ్ల్యూ.పి.ఆర్.ఓ) నియోజకవర్గానికి, డాక్టర్ హర్ష వర్ధన్, ప్రాతినిధ్యం వహిస్తారు.  ఈ స్థానానికి ప్రస్తుతం మయన్మార్ ‌కు చెందిన మిస్టర్ మైంట్ హెట్వే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  డాక్టర్ హర్ష వర్ధన్ 2021 జనవరి, 1వ తేదీ నుండి 2023 డిసెంబర్, 31వ తేదీ వరకు భారతదేశం తరఫున, ప్రాతినిధ్యం వహిస్తారు.

ఈ బోర్డు సాధారణంగా జూన్ మరియు నవంబర్ / డిసెంబర్‌లలో సంవత్సరానికి రెండు సార్లు సమావేశమౌతుంది. వార్షికోత్సవం  సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరుగుతుంది.  ఈ సమావేశాలన్నీ సాధారణంగా వ్యక్తిగత హాజరుతో జరుగుతాయి. 

జి.ఏ.వి.ఐ. బోర్డు వ్యూహాత్మక ఆదేశాలు మరియు విధాన రూపకల్పనకు బాధ్యత వహిస్తుంది,  వ్యాక్సిన్ అలయన్స్ యొక్క కార్యకలాపాలతో పాటు, కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తుంది.  భాగస్వామ్య సంస్థలు, ప్రైవేటు రంగానికి చెందిన నిపుణుల నుండి సభ్యత్వంతో, సమతుల వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, ఆవిష్కరణ మరియు భాగస్వామి సహకారం కోసం ఈ బోర్డు ఒక వేదికను రూపొందిస్తుంది.

వ్యాక్సిన్ అలయన్స్ - జి.ఏ.వి.ఐ., ప్రాణాలను కాపాడే ప్రధాన లక్ష్యంలో భాగంగా,   పేదరికాన్ని తగ్గించి, అంటువ్యాధుల ముప్పు నుండి ప్రపంచాన్ని రక్షిస్తుంది.  భవిష్యత్తులో సంభవించే 14 మిలియన్లకు పైగా మరణాలను నివారించడం కోసం, ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో 822 మిలియన్లకు పైగా పిల్లలకు టీకాలు వేయడానికి సహాయపడింది. 

డాక్టర్ గోజి ఒకోన్జీయో-లవీలా, ప్రస్తుతం జి.ఏ.వి.ఐ. అలయన్స్ బోర్డు చైర్‌గా పనిచేస్తున్నారు.

*****



(Release ID: 1684543) Visitor Counter : 255