PIB Headquarters

పిఐబి కోవిడ్ -19 డెయిలీ బులిట‌న్

Posted On: 27 NOV 2020 5:47PM by PIB Hyderabad

 

Coat of arms of India PNG images free download

* ఈరోజు కోవిడ్ యాక్టివ్ కేస్ లోడ్ 4,55,555 గా ఉంది‌

* మొత్తం యాక్టివ్ కేసుల‌లో 70 శాతం 8 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు చెందిన‌వి.

*గ‌త 23 గంట‌ల‌లో దేశంలో 43,082 కొత్త కోవిడ్‌కేసులు నిర్ధార‌ణ అయ్యాయి.

* జాతీయ స్థాయిలో రిక‌వ‌రీ రేటు ఈరోజు 93.65 శాతంగా ఉంది.

* న్యాయం మ‌రింత‌గా అందుబాటులోకి తెచ్చేందుకు కోవిడ్ -19 వ‌ల్ల ఏర్ప‌డిన త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు మ‌రింత సృజ‌నాత్మ‌క విధానాలు అనుస‌రించేందుకు స‌హాయ‌కారి కాగ‌ల‌వ‌ని తెలిపిన రాష్ట్ర‌ప‌తి

* సిపిఎస్ ఇల సిఎపిఇఎక్స్ 5 వ స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

Image

ఇండియా లోని 70 శాతం కోవిడ్ యాక్టివ్ కేస్‌లోడ్ మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, ఢిల్లీ, రాజ‌స్థాన్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాల‌కు చెందిన‌ది.

ఇండియా కోవిడ్ యాక్టివ్ కేస్‌లోడ్ ఈరోజు 4,55,555 గా ఉంది. ఇండియా మొత్తం పాజిటివ్ కేసుల‌లో ప్ర‌స్తుత యాక్టివ్ కేస్‌లోడ్ 4.89 శాతం. మొత్తం కేసుల‌లో 70 శాతం (69.59 శాతం) ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌,ఢిల్లీ, రాజ‌స్థాన్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాల‌నుంచి వ‌చ్చిన‌వి. మొత్తం యాక్టివ్ కోవిడ్ కేసుల‌లో మ‌హారాష్ట్ర కేసులు ఈ రోజు వ‌ర‌కు 87,014గా ఉన్నాయి. కేర‌ళ 64,615 యాక్టివ్ కేసులు న‌మోదు చేయ‌గా, ఢిల్లీ మొత్తం 38,734 కేసులు న‌మోదు చేసింది. మ‌హారాష్ట్ర రికార్డు స్థాయిలో 1526 కేసుల మేర‌ పాజిటివ్ మార్పు క‌నిపించ‌గా, ఛ‌త్తీస్‌ఘ‌డ్ లో కేసుల సంఖ్య 719 త‌గ్గి గ‌రిష్ఠ నెగ‌టివ్ మార్పు ను సూచించింది. వీటిలో 76.93 శాతం కేసులు ప‌ది రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు న‌మోదు చేశాయి. మ‌హారాష్ట్ర 6,406 కోవిడ్ కొత్త కేసులు న‌మోదు చేయ‌గా, ఢిల్లీ 5,475 కొత్త కేసులు న‌మోదు చేసింది. కేర‌ళ మ‌రో 5,378 కొత్త కేసులు గ‌త 24 గంట‌ల‌లో న‌మోదు చేసింది. ఇండియాలో మొత్తం కోలుకున్న కేసులు 87 ల‌క్ష‌లు దాటాయి (87,18,517). జాతీయ స్థాయి రిక‌వ‌రీ రేటు ఈరోజు 93.65 శాతంగా ఉ ంది. గ‌త 24 గంట‌ల‌లో 39,379 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్త గా కోలుకున్న కేసుల‌లో 78.15 శాతం ప‌ది రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో ఉన్నాయి. కేర‌ళ గ‌రిష్ఠ‌స్థాయిలో ఒక రోజు న‌మోదు చేసిన రిక‌వ‌రీలు 5,970. ఢిల్లీలో 4,937 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఆ త‌ర్వాత 4,815 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్ మ‌ర‌ణాల‌లో 83.80 శాతం మ‌ర‌ణాలు మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఢిల్లీ, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,పంజాబ్‌,గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి ఉన్నాయి.

మ‌హారాష్ట్ర 34.49 శాతం మ‌ర‌ణాల‌తో గ‌రిష్ఠ‌స్థాయిలో ఇప్ప‌టివ‌ర‌కు 46,813 మ‌ర‌ణాల‌ను న‌మోదు చేసింది. గ‌త 24 గంట‌ల‌లో న‌మోదైన 492 మ‌ర‌ణాల‌లో 75.20 శాతం ప‌ది రాష్ట్రాలు కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో న‌మోద‌య్యాయి. ఢిల్లీ లో 91 మ‌ర‌ణాలు గ‌రిష్ఠంగా న‌మోదుకాగా, మ‌హారాష్ట్ర లో 65 మ‌ర‌ణాలు, ప‌శ్చిమ బెంగాల్‌లో 52 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

మ‌రిన్ని వివ‌రాల‌కు https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676407

 

కోవిడ్ తెచ్చిన త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు , న్యాయం మ‌రింత‌గా అందుబాటులోకి తెచ్చేందుకు సృజ‌నాత్మ‌క మార్గాలు అన్వేషించ‌డానికి ,దానిని సాకారం చేసేందుకు ఉప‌క‌రిస్తాయి

---

రాష్ట్ర‌ప‌తి రాంనాథ్ కోవింద్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. 71వ రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 26,2020న ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర‌ప‌తి, కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో కూడా సుప్రీంకోర్టు వీడియో కాన్ఫ‌రెన్సింగ్‌, ఈ ఫైలింగ్ వంటి వాటిని ఉప‌యోగించి కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తూ, న్యాయాన్ని అందిస్తున్న‌ద‌ని పంతోఫం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న్యాయ‌మూర్తుల‌ను, న్యాయ‌వాదుల‌ను,అధికారుల‌ను అభినందించారు. ప్ర‌జ‌ల‌కు న్యాయం అందించ‌డంలో క‌రోనా వైర‌స్ ఏమాత్రం అడ్డంకి కాకుండా చూసినందుకు వారిని అభినందించారు. కోవిడ్ వ‌ల్ల ఏర్ప‌డిన త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు , వినూత్న పంథాలో న్యాయాన్ని మ‌రింత చేరువ చేసేందుకు , న్యాయం అందుబాటును మ‌రింత వేగ‌వంతం చేసేందుకు సృజ‌నాత్మ‌క ఆలోచ‌న‌లకు ఇది వీలు క‌ల్పించింద‌ని అన్నారు. అత్యున్న‌త ప్ర‌మాణాలు, స‌మున్న‌త విలువ‌లు పాటించే సంస్థ‌గా సుప్రీంకోర్టు పేరు ప్ర‌తిష్ఠ‌లు సంపాదించింద‌ని రాష్ట్ర‌ప‌తి కొనియాడారు. సుప్రీంకోర్టు వెలువ‌రించిన కీల‌క తీర్పులు న్యాయ‌వ్య‌వ‌స్థ‌, దేశ రాజ్యాంగ చ‌ట్రాన్ని మ‌రింత బ‌లోపేతం చేశాయ‌ని , న్యాయ‌మూర్తుల‌, న్యాయ‌వాదుల అపార మేధ‌స్సుకు పెట్టింది పేర‌ని ఆయ‌న అన్నారు.

మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676408   

రేపు మూడు వాక్సిన్ త‌యారీ న‌గ‌రాల‌ను సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ

----------

వాక్సిన్ త‌యారీ, అభివృద్ధిని వ్య‌క్తిగ‌తంగా స‌మీక్షించేందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ రేపు మూడు న‌గ‌రాల‌ను సంద‌ర్శించ‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి అహ్మ‌దాబాద్ లోని జైడుస్ బ‌యొటెక్ పార్క్‌, భార‌త్ బ‌యోటెక్‌,హైద‌రాబాద్‌, పూణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సంద‌ర్శించ‌నున్నారు. కోవిడ్ -19పై పోరాటంలో ఇండియా నిర్ణ‌యాత్మ‌క ద‌శ‌కు చేర‌కుంది. ప్ర‌ధాన‌మంత్రి ఈ వాక్సిన్ త‌యారీ కేంద్రాల‌ను సంద‌ర్శించి శాస్త్ర‌వేత్త‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతారు. వాక్సిన్ అభివృద్ధి, స‌వాళ్ల‌కు సంబంధించి వారితో నేరుగా మాట్లాడి విష‌యాలు తెలుసుకుంటారు. అలాగే దేశ పౌరుల‌కు వాక్సిన్ వేసే కృషికి సంబంధించిన రోడ్ మాప్‌పై వారితో చ‌ర్చిస్తారు.

మ‌రిన్ని వివ‌రాల‌కు::// https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676529

రీ -ఇన్వెస్ట్ 2020ని ప్రారంభించిన ప్రధాన‌మంత్రి

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ మూడ‌వ‌ అంత‌ర్జాతీయ పున‌రుత్పాద‌క ఇంధ‌న పెట్టుబ‌డి స‌మావేశం, ఎక్స్‌పో (రీ- ఇన్వెస్ట్ 2020) ని వీడియో కాన్ఫ‌రెన్సుద్వారా ప్రారంభించారు. ఈ స‌మావేశాన్ని నూత‌న‌, పున‌రుత్పాద‌క ఇంధ‌న మంత్రిత్వ‌శాఖ ఏర్పాటు చేసింది. రీ -ఇన్వెస్ట్ 2020 ప్ర‌ధాన అంశం, సుస్థిర ఇంధ‌న మార్పు దిశ‌గా ఆవిష్క‌ర‌ణ‌లు. స్వ‌ల్ప వ్య‌వ‌ధ‌ఙ‌లో మెగావాట్ల సామ‌ర్ద్యం నుంచి గిగావాట్ల ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యం వ‌ర‌కు పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో సామ‌ర్ధ్యం పెరిగినందుకు ప్ర‌ధాన‌మంత్రి సంతోషం వ్య‌క్తం చేశారు. ఒకే సూర్యుడు, ఒకే ప్ర‌పంచం, ఒకే గ్రిడ్ అన్న‌ది వాస్త‌వ‌రూపం ధ‌రించ‌బొతున్న‌ద‌ని ఆయ‌న అన్నారు.గ‌త ఆరు సంవ‌త్స‌రాల‌లో ఇండియా మున్నెన్న‌డూ లేనంత‌టి ప్ర‌గ‌తి తో ముందుకు సాగుతున్న‌ద‌ని ఆయ‌న అన్నారు.

మ‌రిన్ని వివ‌రాల‌కు //https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676276 3వ రీ

 

ఇన్వెస్ట్ 2020 ప్ర‌ధానమంత్రిప్ర‌సంగ పాఠం
: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676478

 

దేశంలో డిజిట‌ల్ లిటిర‌సీని ప్రోత్సహించేందుకు ప్ర‌జా ఉద్య‌మానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి పిలుపు
దేశంలో డిజిట‌ల్ లిటిర‌సీని ప్రోత్స‌హించేందుకు ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం.వెంక‌య్య‌నాయుడు ప్రజా ఉద్య‌మానికి పిలుపునిచ్చారు. ఈ కృషిలో సాంకేతిక‌, విద్యా సంస్థ‌లు కీల‌క పాత్ర పోషించాల్సిందిగా ఆయ‌న పిలుపునిచ్చారు. కాల‌డిలో ఆదిశంక‌ర అకాడ‌మీని వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభిస్తూ ఆయ‌న ఈ పిలుపునిచ్చారు. కాల‌డి ఆదిశంక‌రుడి జ‌న్మ‌స్థ‌లం. ప్ర‌స్తుత విజ్ఞాన‌స‌మాజంలో స‌మాచారం ప్ర‌ధాన‌ ముడిస‌రుకు అని ఆయ‌న అన్నారు. స‌త్వ‌ర స‌మాచారం అందుబాటులో ఉ న్న‌వారు ముందుగా ప్ర‌యోజ‌నం పొంద‌గ‌లుగుతార‌ని ఆయ‌న అన్నారు. స‌మాచారం అందుకోవ‌డానికి డిజిట‌లైజేష‌న్ ఒక సాధ‌న‌మ‌ని అన్నాఉ. కోవిడ్ మ‌హ‌మ్మారికార‌ణంగా విద్యార్ధులు త‌ర‌గ‌తుల‌కు దూరం కావ‌ల‌సిన ప‌రిస్థితుల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆన్‌లైన్ విద్య‌ద్వారా స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌తికూల ప‌రిస్థితుల‌లో సైతం సామాజిక ఆర్ధిక ప్ర‌క్రియ‌ను ముందుకు తీసుకుపోవ‌డం ఎలా అన్న‌ది కోవిడ్ -19 నేర్చుకునేలా చేసింద‌ని అన్నారు.
ఈ అనుభ‌వం , ఎంద‌రు డిజిట‌ల్ మార్గంలో సిద్ధంగా ఉన్నార‌న్న ప్ర‌శ్న ముందుకు తెచ్చంద‌న్నారు.మౌలిక స‌దుపాయాల అందుబాటు, కంప్యూట‌ర్లు, స్మార్టు ఫోన్ల వంటి ఉప‌క‌ర‌ణాల అందుబాటు, ఇంట‌ర్‌నెట్ వేగం, వంటి స‌మ‌స్య‌లు ముందుకు వ‌చ్చాయ‌ని వీటికి ప‌రిష్కారం చూడ‌వ‌ల‌సి ఉంద‌న్నారు.
మ‌రిన్ని వివ‌రాల‌కు :https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676509

 

ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లో మూల‌ధ‌న వ్య‌యాన్ని పెంచేందుకు సిపిఎస్ఇల‌కు సంబంధించిన 5 వ కాపెక్స్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించిన కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ‌మ‌తి నిర్మలా సీతారామ‌న్‌
కేంద్ర ఆర్ధిక, కార్పోరేట్ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా విద్యుత్‌,గ‌నులు, అణుశ‌క్తి శాఖ‌ల కార్య‌ద‌ర్శులు, ఈ మంత్రిత్వ‌శాఖ‌ల‌కు చెందిన 10 సిపిఎస్ఇల సిఎండిల‌తో స‌మావేశ‌మై ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో మూల‌ధ‌న వ్య‌యానికి సంబంధించి (కాపెక్స్‌)స‌మీక్ష నిర్వ‌హించారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌గ‌తిబాట బ‌ట్టించేందుకు వివిధ స్టేక్‌హోల్డ‌ర్ల‌తో నిర్వ‌హిస్తున్న వ‌రుస స‌మావేశాల‌లో భాగంగా ఆర్థిక మంత్రి ఈ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.2020-21 ఆర్ధిక సంవ‌త్స‌రానికి కాపెక్స్ ల‌క్ష్్యం 61,488 కోట్ల రూపాయ‌లు కాగా 23 నవంబ‌ర్ 2020 నాటికి సాధించిన మొత్తం రూ 24,227 కోట్లు అంటే 39.4 శాతం . సిపిఎస్ఇ ల ప‌నితీరును స‌మీక్షిస్తూ శ్రీ‌మ‌తి సీతారామ‌న్‌, ఆర్ధిక వ్య‌వ‌స్థ పురోగ‌తికి సిపిఎస్ ఇ ల కాపెక్స్ ఎంతో కీల‌క చోద‌క శ‌క్తి అన్నారు. దీనిని 2020-21,2021-22లో మ‌రింత ముందుకు తీసుకుపోవాల‌న్నారు. కాపెక్స్ ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు ఆయా మంత్రిత్వ‌శాఖ‌లు, సిపిఎస్ఇలు చేప‌ట్టిన స్ప‌ష్ట‌మైన చ‌ర్య‌ల‌ను మంత్రి అభినందించారు.మూడో త్రైమాసికం నాటికి 75 శాతం కాపెక్స్ ల‌క్ష్యం సాధించ‌డానికి, 2021 ఆర్ధిక సంవ‌త్స‌రం నాలుగ‌వ త్రైమాసికంలో 100 శాతం ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి మ‌రింత కృషిఅవ‌స‌ర‌మ‌ని శ్రీ‌మ‌తి నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. ల‌క్ష్యాలు చేరుకోవ‌డానికి సిపిఎస్ఇలు మెరుగైన ఫ‌లితాలు సాధించాల‌ని, త‌మ‌కు కేటాయించిన మూల‌ధ‌న పెట్టుబ‌డి ని త‌గిన స‌మ‌యంలోగా స‌రైన విధంగా ఖ‌ర్చుచేసే విధంగా ఉండాల‌ని అన్నారు.
మ‌రిన్ని వివ‌రాల‌కు :: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676615

కామ‌త్‌క‌మిటీ, ఆరోగ్య రంగం గుర్తించిన 26 రంగాల‌కు ఎమ‌ర్జెన్సీ క్రెడిట్‌లైన్ గ్యారంటీ ప‌థ‌కం ఇసిఎల్‌జిఎస్ 2.0 కింద కొన‌సాగింపు.

ఇసిఎల్‌జిఎస్‌2.0 కింద ప్ర‌భుత్వం ఎమ‌ర్జెన్సీ క్రెడిట్‌లైన్ గ్యారంటీ ప‌థ‌కం (ఇసిఎల్‌జిఎస్‌)ను కామ‌త్ క‌మిటీ, ఆరోగ్య‌రంగం గుర్తించిన 26 రంగాల‌కు ప్ర‌భుత్వం పొడిగించింది. ఇసిఎల్‌జిఎస్ 2.0 కింద‌, 29-02-2020 నాటికి 50కోట్ల‌కుపైన 500 కోట్ల‌కు మించ‌కుండా , ఏదిత‌క్కువ లేదా 29-02-2020 నాటికి గ‌త 30 రోజుల బ‌కాయిల‌కు స‌మాన‌మైన మొత్తం గ‌ల‌వి అర్హ‌త క‌లిగి ఉంటాయి. ఈ సంస్థ‌లు వాటి మొత్తం రుణంలో 20 శాతం వ‌ర‌కు అద‌న‌పు మొత్తం పొందేందుకు అర్హ‌త క‌లిగి ఉంటాయి.దీనిని కొలేట‌ర‌ల్‌ఫ్రీ గారంటీడ్ ఎమ‌ర్జెన్సీ క్రెడిట్ లైన్ (జిఇసిఎల్‌) కింద ఇస్తారు. దీనికి నేష‌న‌ల్ క్రెడిట్ గ్యారంటీ ట్ర‌స్టీ కంపెనీ లిమిటెడ్ ( ఎన్‌సిజిటిసి)పూర్తి గ్యారంటీఇస్తుంది.

మ‌రిన్ని వివ‌రాల‌కు :: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1676184

కెవాడియాలో రాజ్యాంగ దినోత్స‌వ ప్ర‌త్యేక మ‌ల్టీ మీడియా ఎగ్జిబిష‌న్ :
భార‌త‌దేశం 71 వ రాజ్యాంగ దినోత్స‌వం జ‌రుపుకుంటున్న వేళ దేశ‌వ్యాప్తంగా రాజ్యాంగ ప్ర‌వేశిక‌ను చ‌దివే కార్య‌క్ర‌మానికి రాష్ట్ర‌ప‌తి రాంనాథ్ కోవింద్ నాయ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్బంగా గుజ‌రాత్‌లోని కెవాడియాలో రాజ్యాంగ దినోత్స‌వ ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. పార్ల‌మెంటేరియ‌న్లు, శాస‌న‌స‌భ్యుల నుంచి ఈ కార్య‌క్ర‌మానికి అభినంద‌న‌లు ల‌భించాయి.
ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ వారి బ్యూరో ఆఫ్ ఔట్‌రీచ్ క‌మ్యూనికేష‌న్‌, బ్రాఢ్ కాస్టింగ్‌, పార్ల‌మెంట‌రీ మ్యూజియం , అర్కైవ్స్ స‌హ‌కారంతో గుజ‌రాత్‌లోని స్ట్యాట్యూ ఆఫ్ యూనిటీ వ‌ద్ద 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల స‌ద‌స్సు సంద‌ర్భంగా ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిష‌న్‌ను బుధ‌వారంనాడు లోక్‌స‌భ స్పీక‌ర్ శ్రీ ఓమ్ బిర్లా ప్రారంభించారు. ఈ ఎగ్జిబిష‌న్ దేశ ప్ర‌జాస్వామిక సంప్ర‌దాయాల‌ను వేద‌కాలం నుంచి వివిధ ద‌శ‌ల‌ను దాటుకుంటూ ఆధునిక భార‌త‌దేశ రూప‌క‌ల్ప‌న వ‌ర‌కు ప్ర‌తిబింబించే లా ఏర్పాటు చేశారు.
1600 చ‌ద‌ర‌పు అడుగుల‌లో ఏర్పాటు చేసిన ఈ మ‌ల్టీ మీడియా ఎగ్జిబిష‌న్‌లో 50 ప్యానెళ్ల స్టిల్ చిత్రాలు, ప్లాస్మా డిస్‌ప్లే, ఇంటరాక్టివ్ డిజిట‌ల్ ఫ్లిప్ బుక్‌, ఆర్ ఎఫ్ ఐడి కార్డ్ రీడ‌ర్‌, ఇంట‌రాక్టివ్ స్క్రీన్‌, డిజిట‌ల్ ట‌చ్ వాల్ త‌దిత‌రాలు ఉన్నాయి.
. పార్లమెంట‌రీ వ్య‌వ‌హారాలు, బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ జోషి, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ‌మంత్రి శ్రీ అర్జుర్ రామ్ మేఘ్‌వాల్‌, వివిధ రాష్ట్రాల శాస‌న‌స‌భ‌ల స్పీక‌ర్లు ఈ ఎగ్జిబిష‌న్‌ను సంద‌ర్శించిన ప్ర‌ముఖుల‌లో ఉన్నారు.
ఈ ప్ర‌ద‌ర్శ‌న సంద‌ర్భంగా కోవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. పారిశుధ్యం, ప్ర‌త్యేకించి ట‌చ్ స్క్రీన్ డిస్‌ప్లేల వి ష‌యంలో నిర్దేశిత జాగ్ర‌త్త‌ల‌ను పాటించారు.
మ‌రిన్ని వివ‌రాల‌కు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676505

కోవిడ్ అనంత‌ర శ‌కంలో ఆర్ధిక వ్య‌వ‌స్థ పున‌ర్నిర్మాణంలో ప్ర‌ముఖ‌పాత్ర పోషించ‌నున్న ఇండియా: డాక్ట‌ర్ జితేంద్ర‌సింగ్‌
----
కోవిడ్ అనంత‌ర శ‌కంలో భార‌త‌దేశం ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంద‌ని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ప్రాంత స‌ ‌హాయ‌మంత్రి (ఇండిపెండెంట్ చార్జి), ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌య స‌హాయ మంత్రి , సిబ్బంది, ప్ర‌జా ఫిర్యాదులు , పెన్ష‌న్లు, అణుశ‌క్తి , అంత‌రిక్ష శాఖ మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ అన్నారు. అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌న అభివృద్ధి శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం 2020 ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ ఆయ‌న ఈమాట‌ల‌న్నారు.ఫిక్కీ, డిపార్ట‌మెంట్ ఆఫ్ సైన్స్‌, టెక్నాల‌జీ ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోని శాస్త్ర‌వేత్త‌లు , ఈ స‌వాలును ఎదుర్కొన్న తీరే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న అన్నారు.
ఆవిష్క‌ర‌ణ‌లు, నైపుణ్యాభివృద్ధిపై ప్ర‌భుత్వం చూపెడుతున్న నిరంత‌ర శ్ర‌ద్ధ దీర్ఘ‌కాలికంగా మంచి ఫలితాల‌నుఇవ్వ‌నున్న‌ద‌ని అన్నారు. కోవిడ్ అనంత‌ర కాలంలో ఈశాన్య రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృధ్ధి సాధించ‌నున్నాయ‌ని, ఆర్ధికంగా, ప‌ర్యాట‌క ప‌రంగా అద్భుత ప్ర‌గ‌తి సాధించ‌నున్నాయ‌న్నారు. ప్ర‌పంచంలోని ప్ర‌ధాన ప‌ర్యాట‌క ప్రాంతాలు ఇంకా కోవిడ్ గుప్పిట్లో ఉండ‌గా, ఈశాన్య ప్రాంతం క‌రోనా ర‌హిత ప్ర‌దేశంగా ప‌ర్యాట‌కుల‌కు మంచి గ‌మ్య‌స్థానంగా మార‌గ‌ల‌ద‌ని అన్నారు. ఈశాన్య‌రాష్ట్రాల‌లోని వెదురు వ‌న‌న‌రులు , వాటి బ‌హువిధ ఉప‌యోగాలు ఈ ప్రాంత ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను పునః రూప‌క‌ల్ప‌న చేయ‌గ‌ల‌వ‌ని ఆయ‌న అన్నారు.
మ‌రిన్ని వివ‌రాల‌కు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676134

స‌మ‌గ్ర ఆరోగ్య‌వ్య‌వ‌స్థ ప్రాధాన్య‌త‌ను తెలియ‌జెప్పిన కోవిడ్‌: డాక్ట‌ర్ జితేంద్ర సింగ్
స‌మీకృత‌ ఆరోగ్యప‌రిర‌క్ష‌ణ వ్య‌‌వ‌స్థ ప్రాధాన్య‌త‌ను కోవిడ్ మ‌హ‌మ్మారి తెలియ‌జెప్పింద‌ని ప్ర‌ముఖ డ‌యాబెటాల‌జిస్ట్ కేంద్ర మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ అన్నారు. రిసెర్చి సొసైటి ఫ‌ర్ ద స్ట‌డీ ఆఫ్ డ‌యాబిటీస్ ఇన్ ఇండియా (ఆర్ ఎస్ ఎస్ డి ఐ) సంస్థ 48 వ వార్షిక స‌ద‌స్సు సంద‌ర్భంగా కీల‌కోప‌న్యాసం చేస్తూ ఆయ‌న ఈ మాట‌లు అన్నారు. ప్ర‌తికూల ప‌రిస్థితుల‌లో కొత్త ప‌ద్ధ‌తుల‌ను క‌నిపెట్ట‌వ‌ల‌సిన ప‌రిస్థితుల‌ను కోవిడ్ క‌ల్పించింద‌ని అన్నారు. అలాగే భార‌తీయ సంప్ర‌దాయ వైద్య‌విధాన ప్రాధాన్య‌త‌ను ఇది తెలియ‌జెప్పింద‌న్నారు.
కోవిడ్ ముందు కాలంలో కూడా సాంక్ర‌మికేత‌ర వ్యాధుల చికిత్స‌లో ఇది రుజువైంద‌ని ఆయ‌న అన్నారు, కోన్ని ర‌కాల యోగాస‌నాలు, జీవ‌న‌విధానంలో మార్పులు వంటివి కీల‌క‌మైన‌వ‌ని అన్నారు. వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంలో ఆయుర్వేదం పై , యోగా పైఆలోప‌తి వైద్యులు కూడా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌డం ‌మొద‌లుపెట్టార‌ని అన్నారు.
.మ‌రిన్ని వివ‌రాల‌కు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676258

 

పిఐబి క్షేత్ర‌స్థాయి కార్యాల‌యాలు అందించిన స‌మాచారం

* అస్సాం: అస్సాంలో గ‌త 24 గంట‌ల‌లో 20,778 ప‌రీక్ష‌లు చేసి, 150 కోవిడ్ కేసులు గుర్తించారు. కోవిడ్ పాజిటివ్ కేసుల రేటు 0.72 గా ఉంది.

* మ‌హారాష్ట్ర : మ‌హారాష్ట్ర‌లో , న‌వీ ముంబాయి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ,న‌గ‌రంలో కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే సంస్థ‌ల‌నుంచి నివేదిక‌లు కోరింది. కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోని వారి పేర్లు కూడా చేరుస్తున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌పై మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ ఈ ఆదేశాలు జారీచేస‌శారు. న‌వీముంబాయిలో కోవిడ్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి న స‌మాచారాన్ని రూపొందించ‌డంలో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు వెలుగులోకి వ‌చ్చింది. కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోని వారికి నెగ‌టివ్‌గా మార్క్ చేసి ఉండ‌డాన్ని గుర్తించారు.

ఈ పేర్లు కోవిడ్ పాజిటివ్ కాంటాక్ట్ ల గుర్తింపు కేట‌గిరీలో చేర్చి ఉండ‌డం గ‌మ‌నించారు.

*గుజ‌రాత్‌: గుజ‌రాత్ లో గ‌త 24 గంట‌ల‌లో 1560 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క రోజులో అత్య‌ధిక కేసులు న‌మోదు అయిన రెండో రోజు ఇది. రిక‌వ‌రీ రేటు 90.93 గా ఉంది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలో 14,529 గా ఉన్నాయి. ఇందులో 92 మంది పేషెంట్లు వెంటిలేట‌ర్‌పై ఉన్నారు. 16 మంది పేషెంట్లు నిన్న మ‌ర‌ణించారు. దీనితో కోవిడ్ కార‌ణంగా రాష్ట్రంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 3922 కు పెరిగింది. కాగా కొత్త కోవిడ్ కేసులు బ‌య‌ట‌ప‌డ‌డంతో అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌ల కింద 32 కొత్త ప్రాంతాల‌ను గుర్తించింది.

* రాజ‌స్థాన్ : రాజస్థాన్‌లో నిన్న కొత్త‌గా 3,180 కేసులు న‌మోద‌య్యాయి. జైపూర్‌లో గ‌రిష్ఠంగా 630 కేసులు న‌మోదు కాగా, జోధ్‌పూర్‌లో 517 కేసులు న‌మోద‌య్యాయి. జైపూర్‌, జోధ్‌పూర్ లు కోవిడ్ ప్ర‌భావానికి లోన‌య్యాయి.

జైపూర్‌లో యాక్టివ్ కోవిడ్ కేసుల పేషెంట్లు సుమారు 9 వేల‌కు చేరువ అయ్యారు . ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లోత్ ఈరోజు రాష్ట్రంలో కోవిడ్ ప‌రిస్థితుల‌పై వీడియో కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెల‌లో ఇంటింటికీ వెళ్ళి కోవిడ్ అనుమానిత కేసుల న‌మూనాలు సేక‌రించి కోవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. వివాహ ఉత్స‌వాల‌కు ఎలాంటి అనుమ‌తులు తీసుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని కేవ‌లం ముంద‌స్తు స‌మాచారం ఇస్తే చాల‌ని ఆయ‌న అన్నారు.

* మ‌ధ్య‌ప్ర‌దేశ్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మూడోద‌శ కోవాక్సిన్ క్లినిక‌ల్ ప్ర‌యోగాలు ఈరోజు ప్రారంభ‌మ‌య్యాయి. మూడ‌వ ద‌శ ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చి, భార‌త్ బ‌యోటెక్ ఇంట‌ర్నేష‌న‌ల్ క‌రోనా వాక్సిన్ ప‌రీక్ష‌ల‌ను ని భోపాల్‌లోని వివిధ ఆస్ప‌త్రుల‌లో నిర్

నిర్వ‌హిస్తారు. ముందుగా న‌మోదు చేసుకున్న వాలంటీర్లకు ఈ వాక్సిన్ ఇచ్చి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. వాక్సిన్ బూస్ట‌ర్ డోస్ 28రోజుల త‌ర్వాత ఇస్తారు. ప్ర‌తి వాలంటీర్ ఆరోగ్య ప‌రిస్థితిని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తారు. భోపాల్‌లో చాలామందికి వాక్సిన్‌ను ఇవ్వ‌నున్నారు. ఐసిఎంఆర్ వెయ్యి డోసుల వాక్సిన్‌ను పంపిన‌ట్టు స‌మాచారం. వీటిని రాగ‌ల ప‌ది రోజుల‌లో వ‌లంటీర్ల‌కు వేస్తారు.

*ఛ‌త్తీస్‌ఘ‌డ్ : ఛ‌త్తీస్‌ఘ‌డ్ ఆరోగ్య శాఖ మంత్రి టి.ఎస్‌. సింగ్‌దేవ్ , రాష్ట్రంలో కొవిడ్ -19 ప‌రిస్థితి అదుపులో ఉన్న‌ట్టు చెప్పారు. అక్టోబ‌ర్ నుంచి కొత్త కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. కోవిడ్ కేసులు రాష్ట్రంలో 50 శాతం త‌గ్గాయి. రాష్ట్రంలో రోజూ 23,000 కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ 23,00,000 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. కొత్త‌గా నాలుగు కొత్త వైరాల‌జీ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.-

*గోవా : గోవాలో క‌రోనా వైరస కేస్‌లోడ్ 47,341 కి పెరిగింది. గురువారం నాడు 148 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. మ‌రో ఇద్ద‌రు పేషెంట్లు ఈరోజు చ‌నిపోయారు. దీనితో గోవాలో మ‌ర‌ణాల సంఖ్య 685 కు పెరిగింది. కోవిడ్ నుంచి కోలుకున్న 111 మందిని వివిధ ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి చేశారు. కోవిడ్ రిక‌వ‌రీల సంఖ్య 45,340 కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1316 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. 1892 శాంపిళ్లు ఈ రోజు ప‌రీక్షించారు.

* కేర‌ళ‌: కేర‌ళ‌లో కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి వివ‌రాలు న‌మోదు చేసిన‌ట్టు కేర‌ళ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇందుకు సంబంధించి కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక నివేదిక‌ను సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించింది. కోవిడ్ అనుమానిత మ‌ర‌ణాల‌ను వివ‌రంగా ప‌రిశీలించ‌వ‌ల‌సి ఉంద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు 87 శౄతంగా ఉంది. టెస్టుల పాజిటివిటీ రేటు 9.6 శాతంగా ఉంది. డిసెంబ‌ర్ 1నుంచి కోవిడ్ ప్రొటోకాల్ పాటించిన వారిని గురువాయూరు శ్రీ కృష్ణ మందిరం న‌లంబ‌లంలో ప్ర‌వేశించ‌డానికి అనుమ‌తించ‌నున్నారు. ఆల‌య అధికారులు రోజుకు 100 వివాహాలు చేసుకోవ‌డానికి అనుమ‌తించారు. గ‌రిష్ఠంగా రోజుకు 4,000 మంది భ‌క్తులు వ‌ర్చువ‌ల్ క్యూ సదుపాయం ద్వారా ద‌ర్శించుకోవ‌డానికి వీలు క‌ల్పించారు.

* త‌మిళ‌నాడు: కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి చెన్నైలో రియ‌ల్ ఎస్టేట్ ప్రాధాన్య‌త‌ల‌ను మార్చింది. కొనుగోలుదారులు ప్ర‌స్తుతం ప్లాట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. స్థ‌లాలపై పెట్టుబ‌డి పెట్ట‌డం సంప్ర‌దాయం అయిన‌ప్ప‌టికీ గ‌త ద‌శాబ్ద‌కాలంగా అపార్టమెంట్ల కొనుగోళ్ల‌వైపు మొగ్గు చూపారు. మ‌ళ్లీ కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో మ‌రోసారి భూమికి దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డిగా డిమాండ్ పెరిగింది. యాక్టివ్‌క ఏసులు త‌మిళ‌నాడులో 12,000 దిగువ‌కు త‌గ్గాయి. త‌మిళ‌నాడు కోవిడ్ 19 కు సంబంధించి 1464 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీనితో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 7,76,174 కుచేరింది. వీటిలో చెన్నై 396 పాజిటివ్‌కేసులు న‌మోదుచేసింది. దీనితో చెన్నై మొత్తం కేసుల సంఖ్య 2,13,801 కు చేరింది.
* క‌ర్ణాట‌క‌: క‌ర్ణాట‌క రాష్ట్ర‌ప్ర‌భుత్వం 2020 మే 18న ప్ర‌భుత్వ ఉద్యోగులు, అటాన‌మ‌స్ సంస్థ‌ల ఉద్యోగుల‌ను విధుల‌కు హాజ‌రుకావ‌ల‌సిందిగా కోరుతూ జారీచేసిన ఆదేశాల‌ను పునఃప‌రిశీలించాల్సిందిగా రాష్ట్ర‌ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఉద్యోగుల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యాన్నిపునఃప‌రిశీలించాల్సిందిగా ఆదేశించింది. క‌ర్ణాట‌క‌లో కోవిడ్ మ‌ర‌ణాల రేటు దేశంలో త‌క్కువ‌గా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉంది.అయితే రాష్ట్రంలోని 11 జిల్లాలలో ప‌రిస్థితి ఆందోళ‌న కరంగా ఉంది. గ‌త 5 సంవ‌త్స‌రాల‌లో ధార్వాడ్‌జిల్లా లో రాష్ట్రంలో అత్య‌ధికంగా కోవిడ్ -19 మ‌ర‌ణాల‌రేటు (సిఎఫ్ఆర్ - కోవిడ్ పేషెంట్ల మ‌ర‌ణాల రేటు)- 8 శాతం గా ఉంది. దాని త‌ర్వాత ధ‌క్షిణ క‌న్న‌డ జిల్లా 4.8 శాతం వ‌ద్ద ఉంది. కాగా సిఎఫ్ఆర్ జాతీయ స‌గ‌టు గురువారం 1.46 శాతంగా ఉండ‌గా క‌ర్ణాట‌క 0.79 శాతం న‌మోదు చేసింది.
* ఆంధ్రప్ర‌దేశ్ : విజ‌య‌వాడ జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.ఎండి ఇంతియాజ్ , ఇంద్ర‌కీలాద్రిపై భ‌వానీ దీక్ష‌లు విర‌మించే భ‌క్తులు ఖ‌చ్చితంగా కోవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చూడాల్సిందిగా అధికారుల‌ను ఆదేశించారు. రోజుకు ద‌ర్శ‌నానికి కేవ‌లం 10 వేల‌మందిని మాత్ర‌మే అనుమ‌తించాల‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోవిడ్ -19 కేసుల సంఖ్య 1,031 పెరిగి 8,65,705 కు చేరింది. 1081 మంది పేషెంట్లు కోలుకోవ‌డంతో మొత్తం కోవిడ్ రిక‌వ‌రీలు 8,46,120 కు చేరాయి.

* తెలంగాణా : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ న‌వంబ‌ర్ 28న హైద‌రాబాద్ వ‌చ్చి కోవాక్సిన్ పురోగ‌తిని స‌మీక్షించ‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి సాయంత్రం 4 గంట‌ల‌కు హ‌కీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్‌కుచేరుకుని షామీర్ పేట్‌లోని భార‌త్ బ‌యోటెక్ కేంద్రానికి చేర‌కుంటారు. రాజ‌కీయ ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌మ‌ధ్య ఎన్నిక‌ల మేనిఫెస్టోలు కోవిడ్‌-19కుసంబంధించిన కార్యాచ‌ర‌ణ‌పై మౌనం వ‌హించాయి. రాజ‌కీయ పార్టీలుప‌లువాగ్దానాలు కురిపిస్తున్నాయి. అయితే వైర‌స్ అదుపున‌కు త‌మ వ‌ద్ద ఉన్న‌ప్ర‌ణాళిక‌లేమిటో రాజ‌కీయ పార్టీలు వెల్ల‌డించ‌డంలేదని ఆరోగ్య రంగ నిపుణులు అంటున్నారు

FACT CHECK

 

 

 

 

Image

 

Image

*******

 



(Release ID: 1676635) Visitor Counter : 157