ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసుల్లో 70% మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, చత్తీస్ గఢ్ నుంచే

Posted On: 27 NOV 2020 11:21AM by PIB Hyderabad

దేశంలో ఇప్పుడు కోవిడ్ తో బాధపడుతూ చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య 4,55,555 కు చేరింది. అంటే, పాజిటివ్ గా నమోదైన వారి మొత్తం సంఖ్యతో పోల్చుకున్నప్పుడు చికిత్సలో ఉన్నది 4.89% మాత్రమే.  చికిత్సలో ఉన్నవారిలో గరిష్ఠంగా దాదాపు 70% ( కచ్చితంగా చెప్పాలంటే 69.59%) మంది ఎనిమిది రాష్ట్రాలకు చెందినవారే. ఆ జాబితాలో మహారాష్ట్ర, కేరల, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్ ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 87,014 కోవిడ్ బాధితులు ఉండగా, రెండో స్థానంలో ఉన్న కేరళలో 64,615 మంది, ఢిల్లీలొ 38,734 మంది చికిత్సలో ఉన్నారు.

WhatsApp Image 2020-11-27 at 10.26.59 AM.jpeg

గడిచిన 24 గంటలలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులలో వచ్చిన మార్పు దిగువ చిత్రంలో ఉంది. మహారాష్ట్రలో అదనంగా 1526 కేసులు రాగా చత్తీస్ గఢ్ లో చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య 719 తగ్గింది

 

WhatsApp Image 2020-11-27 at 10.35.45 AM (1).jpeg

గడిచిన 24 గంటలలో 43,082 మందికి కొత్తగా కరోనా సోకింది. వీళ్లలో  76.93% మంది పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు.  మహారాష్ట్రలో ఈ ఒక్క రోజులో అత్యధికంగా 6,406  కేసులు రాగా ఢిల్లీలో  5,475 మందికి, కేరళలో 5,378 మందికి కొత్తగా కరోనా సోకింది.

WhatsApp Image 2020-11-27 at 10.16.48 AM.jpeg

దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్న మొత్తం కేసుల సంఖ్య 87 లక్షలు దాటి 87,18,517 కు చేరింది. జాతీయ స్థాయిలో కోలుకున్న శాతం  ఈ రోజుకు 93.65% కు చేరింది. గత 24 గంటలలో  39,379 మంది కోలుకోగా  తాజాగా కోలుకున్నవారిలో  78.15% పది రాష్ట్రాలనుంచే నమోదైంది. కేరళలో అత్యధికంగా ఒకరోజులో  5,970 మంది కోలుకోగా ఢిల్లీలో  4,937 మంది, మహారాష్ట్రలో 4,815 మంది కోలుకున్నారు.

WhatsApp Image 2020-11-27 at 10.16.49 AM (1).jpeg

తాజాగా గత 24 గంటలలో నమోదైన మరణాలలో 83.80%  పది రాష్ట్రాలకు చెందినవి కాగా, అవి  మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు. మహారాష్ట్రలో అత్యధికంగా 34.49% మరణాలు నమోదు కాగా ఆ రాష్టంలో మొత్తం మరణాలు  46,813 కు చేరాయి.

 

WhatsApp Image 2020-11-27 at 10.19.10 AM.jpeg

గడిచిన 24 గంటల్లో 492 మంది కోవిడ్ బాధితులు మరణించారు. వాళ్ళలో 75.20% మంది పది రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యారు.  91 మరణాలతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర (65), పశ్చిమ బెంగాల్ (52) ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

 

WhatsApp Image 2020-11-27 at 10.16.49 AM.jpeg

***



(Release ID: 1676407) Visitor Counter : 192