సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యే మల్టీ మీడియా ప్రదర్శన
Posted On:
27 NOV 2020 2:17PM by PIB Hyderabad
భారతదేశం 71 వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న వేళ దేశవ్యాప్తంగా రాజ్యాంగ ప్రవేశికను చదివే కార్యక్రమానికి రాష్ట్రపతి
రాంనాథ్ కోవింద్ నాయకత్వం వహించారు. ఈ సందర్బంగా గుజరాత్‌లోని కెవాడియాలో రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటేరియన్లు, శాసనసభ్యుల నుంచి ఈ కార్యక్రమానికి అభినందనలు లభించాయి.

ఈ ప్రదర్శనను సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వారి బ్యూరో ఆఫ్ ఔట్‌రీచ్ కమ్యూనికేషన్, బ్రాఢ్ కాస్టింగ్, పార్లమెంటరీ మ్యూజియం , అర్కైవ్స్ సహకారంతో గుజరాత్‌లోని స్ట్యాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సు సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌ను బుధవారంనాడు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ దేశ ప్రజాస్వామిక సంప్రదాయాలను వేదకాలం నుంచి వివిధ దశలను దాటుకుంటూ ఆధునిక భారతదేశ రూపకల్పన వరకు ప్రతిబింబించే లా ఏర్పాటు చేశారు.
1600 చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఈ మల్టీ మీడియా ఎగ్జిబిషన్‌లో 50 ప్యానెళ్ల స్టిల్ చిత్రాలు, ప్లాస్మా డిస్‌ప్లే, ఇంటరాక్టివ్ డిజిటల్ ఫ్లిప్ బుక్, ఆర్ ఎఫ్ ఐడి కార్డ్ రీడర్, ఇంటరాక్టివ్ స్క్రీన్, డిజిటల్ టచ్ వాల్ తదితరాలు ఉన్నాయి. ఈ ప్రదర్శనలో మల్టీ మీడియాను ఉపయోగించడం పట్ల స్పీకర్ అభినందనలు తెలిపారు. ఇంటరాక్టివ్ ఎగ్జిబిషన్లు సమాచారాన్ని అందించడాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయని ఆయన అన్నారు.ఈ ఎగ్జిబిషన్ రాజ్యాంగ రూపకల్పన కు సంబంధించిన ముఖ్యమైన తేదీలకు సంబంధించిన వరుసక్రమాన్ని అద్భతంగా ప్రదర్శించిందని ఆయన అన్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్లు దేశంలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసి ప్రజలలో మన ప్రజాస్వామిక సంస్కృతిపై అవగాహన కల్పించాలని అన్నారు.
రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించిన సవివరమైన ప్రదర్శనను అర్కైవల్ మెటీరియల్ ను ఉపయోగించుకుని రూపొందించారు. రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించి అరుదైన ఫుటేజ్‌లు, రాజ్యాంగ సభకు సంబంధించి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, డాక్టర్ రాజేంద్రప్రసాద్, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్,శ్యామప్రసాద్ ముఖర్జీ ముఖ్యమైన నాయకులు చేసిన ప్రసంగాలు ఫిల్మ్స్‌డివిజన్ ఆఫ్ ఇండియా ముంబాయి ఆర్కైవ్స్ నుంచి సేకరించారు.
ప్లాస్మా డిస్లేలో సందర్శకులు, రాజ్యాంగ ప్రవేశికను వివిధ భారతీయ భాషలలో చదవవచ్చు. డిజిటల్ ఫ్లిప్ బుక్ లో రాజ్యాంగంలోని చిత్రాలను చూడవచ్చు. డిజిటల్ టచ్ మన వివిధ జాతీయ గుర్తులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. మరో డిజిటల్ తెర ద్వారా రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది. మరో డిస్‌ప్లే ద్వారా భారతరాజ్యాంగ రూపకల్పనపై ప్రపంచంలోని ఇతర రాజ్యాంగాల ప్రభావాన్ని తెలియజేస్తుంది.


ఆర్ ఎఫ్ ఐడి కార్డ్ రీడర్- ఇది ఒక ఇంటరాక్టివ్ డిస్‌ప్లే. రాజ్యాంగసభ కు చెందిన సభ్యుడి పేరు కలిగిన కార్డును , కార్డ్ రీడర్ ముందు ఉంచితే అందులో ఆ సభ్యుడి వివరాలు, రాజ్యాంగ రూపకల్పనలో వారి పాత్ర వంటివి చూపిస్తుంది. ఇదొక ప్రత్యేక ఆకర్షణ. ఇందులో డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించి మూడు కేటగిరీల కార్డులు ఉన్నాయి. అవి రాజ్యాంగసభకు సంబంధించిన మహిళా సభ్యలు, గుజరాత్‌కు చెందిన రాజ్యాంగ సభ సభ్యుల కు సంబంధించిన కార్డులు ఉన్నాయి. వీరిలో హన్సామెహతా, కన్హయ్యలాల్ మున్షీ వంటి వారు ప్రముఖులు.
గుజరాత్ గవర్నర్ ఆహర్య దేవృత్ విజిటర్ల పుస్తకం లో రాస్తూ, ఈ ప్రదర్శన, వందలాది మంది దార్శనిక నాయకుల విశేష కృషికి దర్పణం పడుతున్నది. అద్భుతమైన ఫొటోలు, చూపించారు. గతానికి సంబంధించిన ఎన్నింటినో జాగ్రత్తగా సమీకరించారు. వాటిని ప్రదర్శించేందుకు ప్రతి డిజిటల్ అవకాశాన్నీ ఉపయోగించారు అని అహర్య దేవృత్ పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ అర్జుర్ రామ్ మేఘ్‌వాల్, వివిధ రాష్ట్రాల శాసనసభల స్పీకర్లు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రముఖులలో ఉన్నారు.
రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుల ప్రభుత్వ, పార్లమెంటు,కీలక వ్యక్తుల సంతకాలు , వారి చిత్రాలు, గత స్పీకర్లు, ప్రస్తుత స్పీకర్ల చిత్రాలను ప్రదర్శించే ఇతర ప్రముఖ ప్యానెళ్లు చెప్పుకోదగినవి. మరో కీలకమైనది, రాష్ట్ర అసెంబ్లీల సెక్షన్. ఇందులో సందర్శకులు వివిధ రాష్ట్రాల శాసనసభల నిర్మాణ గొప్పదనం, వైవిధ్యతను , శోభను చూసి అభినందించగలరు. ఈ ప్రదర్శన సందర్భంగా కోవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పారిశుధ్యం, ప్రత్యేకించి టచ్ స్క్రీన్ డిస్‌ప్లేల వి షయంలో నిర్దేశిత జాగ్రత్తలను పాటించారు.
కెవాడియాలో జరిగిన రెండు రోజుల అఖిలభారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు , ప్రజాస్వామిక సంస్థను బలోపేతం చేయాలని, భారత రాజ్యాంగంపై , భారతదేశ ప్రజాస్వామక సంస్కృతిపై ప్రజలలో చైతన్యం పెంపొందింపచేయాలని తీర్మానించింది.
***
(Release ID: 1676505)
Visitor Counter : 246