ప్రధాన మంత్రి కార్యాలయం

మూడు నగరాలలో టీకామందు కేంద్రాలను రేపటి రోజు న సందర్శించనున్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 27 NOV 2020 4:36PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టీకామందు అభివృద్ధి, తయారీ ప్రక్రియల ను స్వయంగా సమీక్షించడానికి మూడు నగరాల పర్యటన కు రేపటి రోజు న బయలుదేరుతున్నారు.  ఆయన అహమదాబాద్ లో జైడస్ బయోటెక్ పార్కు ను, హైదరాబాద్ లో భారత్ బయోటెక్ ను, పుణే లోని సీరమ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియా ను సందర్శిస్తారు.

కోవిడ్-19 తో పోరు లో భారతదేశం ఒక నిర్ణయాత్మక దశ లో ప్రవేశిస్తుండడంతో, ప్రధాన మంత్రి ఈ కేంద్రాలను సందర్శించడంతో పాటు అక్కడి శాస్త్రవేత్తలతో చర్చలు జరపడం వల్ల వ్యాక్సీన్ రూపకల్పన కు జరుగుతున్న సన్నాహాలను గురించి, అందులో ఎదురయ్యే సవాళ్లను గురించి తెలుసుకోవడం అనే అంశాలు భారతదేశం పౌరులకు టీకామందు ను ఇప్పించే ప్రయత్నం తాలూకు రోడ్ మ్యాప్ తయారీ లో ఆయన కు సహాయకారి కానున్నాయి.  

***


(रिलीज़ आईडी: 1676529) आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam