ఆర్థిక మంత్రిత్వ శాఖ
వ్యవస్థలో వ్యయాన్ని పెంచేందుకు వీలుగా సీపీఎస్ఈల మూలధన వ్యయాన్ని పేంచేందుకు సమీక్షా సమావేశం నిర్వహించనున్న ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
27 NOV 2020 3:26PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు విద్యుత్, గనులు, అణు ఇంధన శాఖ కార్యదర్శులతో పాటుగా.. ఆయా
మంత్రిత్వ శాఖలకు చెందిన 10 సీపీఎస్ఈల సీఎండీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాన్ని (క్యాపెక్స్) సమీక్షించేందుకు ఈ సమావేశం జరిగింది. కోవిడ్- 19 మహమ్మారి నేపథ్యంలో మన ఆర్థికవృద్ధిని వేగవంతం చేసేందుకు వీలుగా కేంద్ర ఆర్థిక మంత్రి వివిధ భాగస్వామ్య పక్షాల వారితో జరుపుతున్న సమావేశాలలో ఇది ఐదవ సమావేశం. రూ.61483 కోట్ల క్యాపెక్స్ లక్ష్యానికి గాను ఈ నెల 23వ తేదీ నాటికి.. రూ.24227 కోట్ల లక్ష్యం మాత్రమే నెరవేరింది. ఇది మొత్తం లక్ష్యంలో దాదాపు 39.4 శాతం. ఈ సమావేశంలో భాగంగా సీపీఎస్ఈల పనితీరును సమీక్షించిన ఆర్థిక మంత్రి.. సీపీఎస్ఈల మూలధన వ్యయం మన ఆర్థిక వృద్ధికి కీలకమైనదని వివరించారు. 2020-21 & 2021-22 ఆర్థిక సంవత్సరాలకు దీనిని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని సీతారామన్ తెలిపారు. క్యాపెక్స్ లక్ష్యాలను చేరుకోవడానికి మంత్రిత్వ శాఖలు మరియు సీపీఎస్ఈలు చేస్తున్న ప్రయత్నాలను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ మూడో త్రైమాసికం నాటికి 75 శాతం మేర కాపెక్స్ లక్ష్యాల్ని చేరుకొనేందుకు గాను మరిన్ని ప్రయత్నాలు అవసరమని అన్నారు. 2021 ఆర్ధిక సంవత్సరానికి గాను 100% లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని సాధించేందుకు మరింతగా ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉందని సీతారామన్ అన్నారు. లక్ష్యాలను సాధించడానికి సీపీఎస్ఈలు మెరుగ్గా పని చేయాలని సూచించారు. 2020-21 సంవత్సరానికి వారికి అందించిన మూలధన వ్యయం సరిగ్గా మరియు సమయానికి ఖర్చు చేసేలా చూడాలని ఆర్థిక మంత్రి సీతారామన్ అధికారుల్ని సూచించారు. నిర్ధారిత లక్ష్యాన్ని సాధించడానికి మరియు దాని కోసం ప్రణాళికను రూపొందించడానికి సీపీఎస్ఈల పనితీరును మరింత నిశితంగా పరిశీలించాలని సీతారామన్ ఆయా శాఖల కార్యదర్శులను కోరారు. సీపీఎస్ఈ సంస్థల పరిష్కారం కాని వివిధ సమస్యలను ముందుగా పరిష్కరించాలని ఆమె కార్యదర్శులకు సూచించారు.
****
(Release ID: 1676615)
Visitor Counter : 245