ప్రధాన మంత్రి కార్యాలయం

మూడో రీ-ఇన్వెస్ట్ 2020 కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 26 NOV 2020 7:20PM by PIB Hyderabad

శ్రేష్ఠులైన ఇజ్రాయల్ ప్రధాని , శ్రేష్ఠులైన నెదర్లాండ్స్ ప్రధాని, ప్రపంచం నలు మూలల నుంచి విచ్చేసిన గౌరవనీయ మంత్రులు, మంత్రిమండలిలో నా సహచరులు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్ లు, విశిష్ట అతిథులారా, 

శ్రేష్ఠులైన నెదర్లాండ్స్ ప్రధాని తన సందేశాన్ని ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

రీఇన్వెస్ట్ మూడో సంచిక లో భాగం పంచుకొన్న మీ అందరిని చూడటం అపురూపంగా ఉంది.  ఇదివరకు జరిగిన కార్యక్రమాలలో మనం నవీకరణ యోగ్య శక్తి రంగం లో మెగావాట్స్ నుంచి గీగావాట్స్ కు యాత్ర చేయడానికి సంబంధించి మన ప్రణాళికలను గురించి మాట్లాడుకొన్నాము.  మనం ‘‘ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్’’ను గురించి కూడా మాట్లాడుకొన్నాము. ఈ ప్రణాళికలలో చాలా వరకు కొద్ది కాలం లోనే వాస్తవ రూపాన్ని దాల్చాయి.

మిత్రులారా, 

గడచిన 6 సంవత్సరాలలో, భారతదేశం ఒక సాటిలేనటువంటి పయనాన్ని సాగిస్తూ వచ్చింది.  భారతదేశం లో ప్రతి ఒక్కరు వారి పూర్తి స్థాయి శక్తి యుక్తులను వెలికితెచ్చేటట్టుగా- వారికి విద్యుత్తు లభ్యత కు పూచీ పడటానికిగాను- మేము మా ఉత్పత్తి సామర్థ్యాన్ని, నెట్ వర్కు ను విస్తరించుకొంటున్నాము.  అదే సమయంలో, మేము నవీకరణయోగ్య వనరుల ద్వారా శక్తి ఉత్పాదకత ను శరవేగంగా విస్తరించుకొంటున్నాము.  మీకు కొన్ని యదార్థాల ను నేను వెల్లడి చేయదలచుకొన్నాను.

ప్రస్తుతం, భారతదేశ నవీకరణయోగ్య శక్తి సామర్థ్యం ప్రపంచం లో నాలుగో అతి పెద్ద సామర్థ్యం గా ఉంది.  అది ప్రధాన దేశాలన్నిటిలోకీ అత్యంత వేగం గా వృద్ధి చెందుతోంది.  భారతదేశం నవీకరణ యోగ్య శక్తి సామర్థ్యం ప్రస్తుతం 136 గీగావాట్స్ గా ఉంది.  2022వ సంవత్సరానికల్లా, నవీకరణయోగ్య సామర్థ్యం వాటా 220 గీగావాట్స్ కు పైగా పెరగనుంది.

మా వార్షిక నవీకరణయోగ్య శక్తి సామర్థ్యం జోడింపు 2017 తరువాత నుంచి బొగ్గు ఆధారిత తాపీయ విద్యుత్తు సామర్థ్యాన్ని మించిపోయిందని తెలుసుకొంటే మీరు సంతోషిస్తారు.  గత 6 సంవత్సరాలలో, మేము మా స్థాపిత నవీకరణయోగ్య శక్తి సామర్థ్యాన్ని రెండున్నర రెట్ల మేర పెంచుకొన్నాము.  గత 6 సంవత్సరాలలో, స్థాపిత సౌర శక్తి సామర్థ్యం పదమూడింతలు అయింది.

మిత్రులారా,

నవీకరణయోగ్య శక్తి రంగం లో భారతదేశం సాధించిన పురోగతి జల వాయు పరివర్తన తో పోరాడటం లో మా నిబద్ధత, దృఢ విశ్వాసం ల ఫలితమే.  నవీకరణయోగ్య శక్తి రంగం లో పెట్టుబడి పెట్టడం చౌకైంది కాని కాలంలో కూడాను మేము ఆ పని ని చేశాము.  మా పెట్టుబడి, దాని శ్రేణి ప్రస్తుతం ఆ రంగం లో ఖర్చులను తగ్గిస్తోంది.  మంచి పర్యావరణానుకూల విధానాలు చక్కని ఆర్థిక వ్యవస్థ ను కూడా ఆవిష్కరిస్తాయి అని మేము ప్రపంచానికి నిరూపించాము.  ప్రస్తుతం, భారతదేశం 2 డిగ్రీ కంప్లాయాన్స్ లక్ష్యాన్ని సాధించే దిశ లో పయనిస్తున్న అతి కొద్ది దేశాల లో ఒకటి గా ఉంది.  

మిత్రులారా,

శక్తి కి సంబంధించిన స్వచ్ఛ వనరుల వైపునకు మా ప్రయాణం లో లభ్యత, ప్రావీణ్యం, పరిణామం అనే దృష్టికోణం చోదకం గా నిలచింది. 
విద్యుత్తు ను అందుబాటులోకి తీసుకురావడాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉంటే, మీరు దాని శ్రేణి ని సంఖ్యల లో అంచనా వేయవచ్చు.  గత కొన్నేళ్లలో 2.5 కోట్ల కు పైగా లేదా 25 మిలియన్ కుటుంబాలకు విద్యుత్తు కనెక్శన్ లను అందించడమైంది.  నేను విద్యుత్తు సంబంధ ప్రావీణ్యాన్ని గురించి చెప్తూ ఉంటే, మేము ఈ మిశన్ ను ఒక మంత్రిత్వ శాఖ కో, విభాగానికో పరిమితం చేయలేదు.  ఈ మిశన్ యావత్తు ప్రభుత్వానికి ఒక లక్ష్యం గా మారేటట్టు శ్రద్ధ వహించాము అన్న మాట.  మా విధానాలన్నీ శక్తి ప్రావీణ్యాన్ని సాధించడాన్ని లెక్క లోకి తీసుకొంటున్నాయి.  దీనిలో.. ఎల్ఇడి బల్బులు, ఎల్ఇడి వీధి దీపాలు, స్మార్ట్ మీటర్ లు, విద్యుత్ వాహనాల కు ప్రోత్సాహం, ప్రసార పరమైన నష్టాలను తగ్గించడం.. ఇవన్నీ భాగమయ్యాయి.  నేను శక్తి పరిణామాన్ని గురించి మాట్లాడినప్పుడు, వ్యవసాయ క్షేత్రాలలో సేద్యపు నీటి ని ప్రవహింపచేయడానికిగాను సౌర శక్తి ఆధారిత విద్యుత్ ను అందజేస్తూ పిఎమ్-కెయుఎస్ యుఎమ్ ద్వారా మా వ్యవసాయ రంగానికి శక్తి ని జత చేయదలుస్తున్నాము అని ఆ మాటల భావం.

మిత్రులారా,

భారతదేశం నానాటికీ నవీకరణ శక్తి రంగం లో పెట్టుబడులకు ఒక ప్రముఖ కేంద్రం గా మారుతోంది.  గత ఆరేళ్ల లో, సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు లేదా 64 బిలియన్ డాలర్ లకు పైగా పెట్టుబడి భారతదేశ నవీకరణ యోగ్య శక్తి రంగంలోకి వచ్చింది.  మేము భారతదేశాన్ని నవీకరణ యోగ్య శక్తి రంగం లో ఓ ‘ప్రపంచ తయారీ కేంద్రం’ గా తీర్చిదిద్దాలనుకొంటున్నాము.

మీరు భారతదేశం లో నవీకరణ యోగ్య శక్తి రంగం లో ఎందుకు పెట్టుబడి పెట్టాలో మీకు నేను అనేక కారణాలను చెప్తాను.  భారతదేశం నవీకరణయోగ్య రంగానికి సంబంధించి చాలా ఉదారమైనటువంటి విదేశీ పెట్టుబడి విధానాన్ని రూపొందించింది.  నవీకరణ యోగ్య శక్తి ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి  విదేశీ ఇన్వెస్టర్ లు వారంతట వారు గాని, లేదా ఏ భారతీయ భాగస్వామితో అయినా కలసి గాని పెట్టుబడి ని పెట్టేందుకు వీలు ఉంది.  నవీకరణ యోగ్య శక్తి వనరుల నుంచి వారం లో ప్రతి రోజూ 24 గంటలూ విద్యుత్తు ను సరఫరా చేయడానికి నూతన పంథా లో బిడ్ లపై ఒక క్రమ పద్ధతి లో దృష్టి ని సారించడం జరుగుతోంది.  సౌర శక్తి , పవన శక్తి ఆధారిత హైబ్రిడ్ ప్రాజెక్టులను ఈసరికే విజయవంతం గా అమలుపరచడమైంది.

దేశీయం గా తయారు చేసిన సోలర్ సెల్స్, సోలర్ మాడ్యూల్స్ కు గిరాకీ రాబోయే మూడు సంవత్సరాల కాలంలో సుమారు 36 గీగా వాట్స్ గా ఉండేందుకు అవకాశాలున్నాయి.  మా విధానాలు సాంకేతిక విప్లవాలకు అనుగుణంగా రూపొందుతున్నాయి.  ఒక సంపూర్ణ ‘‘నేశనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిశన్’’ ను ప్రారంభించాలి అనే ఆలోచన తో మేము ఉన్నాము.  ఇలెక్ట్రానిక్స్ తయారీ లో పిఎల్ఐ ని విజయవంతం గా ప్రవేశపెట్టి, దానికి తరువాయి గా అదే రకం ప్రోత్సాహకాలను అధిక సామర్థ్యం కలిగిన సోలర్ మాడ్యూల్స్ కు కూడా ఇవ్వాలని నిర్ణయించాము.  ‘‘వ్యాపారం చేయడం లో సౌలభ్యాని’’కి పూచీ పడాలనేది మా అగ్ర ప్రాధాన్యం గా ఉంది.  మేము ఇన్వెస్టర్ లకు మార్గం సుగమం చేయడానికి అన్ని మంత్రిత్వ శాఖల లోనూ ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ విభాగాలను, ఎఫ్ డిఐ సెల్స్ ను ప్రత్యేకం గా ఏర్పాటు చేశాము.

ప్రస్తుతం, భారతదేశం లో ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క కుటుంబం విద్యుత్తు సరఫరా సదుపాయానికి నోచుకొంది.  భవిష్యత్తు లో, వారి శక్తి గిరాకీ పెరుగుతుంది.  ఆ రకంగా, భారతదేశం లో శక్తి తాలూకు గిరాకీ అనేది పెరుగుతూనే ఉంటుంది.  రాబోయే దశాబ్దానికి గాను భారీ నవీకరణయోగ్య శక్తి నియుక్తి ప్రణాళిక లు ఉన్నాయి.  అవి ఒక్కో సంవత్సరానికి సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయలు లేదా 20 బిలియన్ డాలర్ ల మేర వ్యాపార అవకాశాలను కల్పించనున్నాయి.  ఇది భారతదేశం లో పెట్టుబడి పెట్టడానికి ఒక పెద్ద అవకాశం.  రతదేశ నవీకరణయోగ్య శక్తి ప్రయాణం లో పాలు పంచుకోవలసిందిగా ఇన్వెస్టర్ లకు, డెవలపర్ లకు, వ్యాపార సంస్థలకు నేను ఆహ్వానం పలుకుతున్నాను. 

మిత్రులారా,

ఈ కార్యక్రమం భారతదేశం లోని నవీకరణ యోగ్య శక్తి రంగానికి చెందిన భాగస్వామ్య పక్షాలను ప్రపంచం లోని పరిశ్రమ రంగ నిపుణులు, అత్యుత్తమ విధాన రూపకర్తలు, అత్యుత్తమ విద్యావేత్తలతో సంధానిస్తోంది.  ఈ సమావేశం ఫలప్రద చర్చలకు తావిచ్చి, భారతదేశాన్ని ఒక నూతన శక్తి సంబంధి భవిష్యత్తు లోకి నడిపించుకుపోతుందని నేను నమ్ముతున్నాను.

ధన్యవాదాలు.    


***(Release ID: 1676478) Visitor Counter : 309