PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
06 NOV 2020 6:22PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
*వరుసగా ఐదవ వారం కూడా ఇండియా లో కోవిడ్ కొత్త కేసుల కన్నా, కోలుకున్న కేసులు ఎక్కువ నమోదయ్యాయి
.* గత 24 గంటలలో 54,157 కోవిడ్ పేషెంట్లు కోలుకోగా, కొత్తగా నిర్ధారణ అయన కేసుల సంఖ్య 47,638
* జాతీయ స్థాయి రికవరీ రేటు 92.32 శాతానికి మెరుగుపడింది.
* ఈ రోజుకు యాక్టివ్ కేసులు 5,20,773గా ఉన్నాయి
.* ప్రస్తుత కోవిడ్ మహమ్మారి ,భారతీయ ప్రజలకు సహజంగా ఉండే బాధ్యత, కరుణ, జాతీయ ఐక్యత, వినూత్న ఆవిష్కరణల స్ఫూర్తి వంటి వాటిని మరింత ముందుకు తెచ్చిందని ప్రధానమంత్రి అన్నారు.
* కోవిడ్ -19 కారణంగా మూతపడిన యూనివర్సిటీలు, కాలేజీలను తిరిగి తెరిచేందుకు యుజిసి మార్గదర్శకాలను విడదుదల చేసింది.
#Unite2FightCorona
#IndiaFightsCorona
గత 5 వారాలుగా కొత్త కేసులను మించిపోయిన కోవిడ్ నుంచి కోలుకున్న కేసులు.
తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య ఈరోజు 5.2 లక్షలుగా ఉంది.
గత 24 గంటలలో 50,000 కంటే తక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు రోజువారీగా కోవిడ్ నుంచి కోలుకుంటున్న కేసుల సంఖ్య 54,000గా ఉంది. వరుసగా గత 5 వారాలుగా ఇండియా కొత్త కేసులనుమించి కోలుకున్న కేసులను నమోదవుతుంది. గత 24 గంటలలో 54,157 కోవిడ్ పేషెంట్లు కోలుకున్నారు. కొత్తగా కోవిడ్ నిర్ధారణ అయిన కేసుల సంఖ్య47,638గా ఉన్నాయి. రోజువారీ సగటు కొత్తకేసులు గత 5 వారాలుగా తగ్గుముఖం పడుతున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో కొత్త కేసుల రోజువారీ సగటు 73,000గా ఉండగా అవి ప్రస్తుతం 46,000కు పడిపోయాయి. కోలుకుంటున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో యాక్టివ్‌కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. యాక్టివ్‌కేసులు ఇవాళ 5,20,773 గా ఉన్నాయి.మొత్తం పాజిటివ్‌కేసులలో యాక్టివ్ కేసులసంఖ్య 6.19 శాతం మాత్రమే. యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండగా కోలుకున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,765,966 గా ఉంది. కోలుకున్న కేసులు, యాక్టివ్ కేసుల మధ్య తేడా సుమారు 72.5 లశ్రీలు. ,(72,45,193) .జాతీయ రికవరీ రేటు మరింతగా మెరుగుపడి 92.32 శాతానికి పెరిగింది. 80 శాతం కొత్త కోలున్న కేసులు పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక్క రోజులో 11000 కేసులు కోలుకున్నాయి. 79 శాతం కొత్త కేసులు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచి ఉన్నాయి. మహారాష్ట్రలో చాలా ఎ క్కువ కేసులు అంటే సుమారు 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానం కేరళకు దక్కుతున్నది. కేరళ లో 9000 కు పైగా కొత్తకేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 670 మరణాలు సంభవించాయి. ఇందులో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచి 86 శాతం వరకు ఉన్నాయి. 38 శాతం పైగా తాజా మరణాలు మహారాష్ట్ర నుంచి నమోదయ్యాయి.(256 మరణాలు).ఢిల్లీ ఆ తర్వాతి స్థానంలో 66 మరణాలు నమోదు చేసింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670589
వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి
ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ సమావేశానికి నిన్న అధ్యక్షత వహించారు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, ఇండియా అత్యంత ధైర్యంగా కోవడ్ మహమ్మారిని ఎదుర్కొన్నదని చెప్పారు. ప్రపంచం ఇండియా జాతీయస్వరూపాన్ని, దాని వాస్తవ బలాన్నిచూసిందని ఆయన అన్నారు. ఈ మహమ్మారి భారతదేశ విలువలైన బాధ్యత, కరుణ, జాతీయ ఐక్యత ,వినూత్న ఆవిష్కరణల స్ఫూర్తిని విజ యవంతంగా బహిర్గతం చేసిందని ఆయన అన్నారు. ఇండియా ఈ మహమ్మారి సమయంలో తిరిగి కోలుకునేందుకు తనకుగల శక్తిని ప్రతిఫలింప చేసిందన్నారు. ఒకవైపు వైరస్‌తో పోరాడుతూనే మరోవైపు ఆర్థిక స్థిరత్వానికి కృషి చేసినట్టు ఆయన తెలిపారు. ఇండియాలోని వివిధ వ్యవస్థల బలం, ప్రజల మద్దతు, ప్రభుత్వ విధానాలలోని స్థిరత్వం వంటివి ఇందుకు దోహదపడ్డాయని ఆయన అన్నారు. పాత పద్ధతులకు బదులుగా నవభారతాన్ని నిర్మించడం జరుగుతుందని, ఇవాళ ఇండియా మెరుగైన భవిష్యత్తు దిశగా మార్పుచెందుతున్నదని ఆయన అన్నారు. భారత దేశం ఆత్మనిర్భరతను సాధించాలనేది కేవలం ఒక దార్శనికత మాత్రమే కాదని,ఇది ఒక ప్రణాళికా బద్ధమైన ఆర్ధిక వ్యూహమని ఆయన అన్నారు. ఈ వ్యూహం భారతదేశ వ్యాపార సామర్ధ్యాలు,ఈ దేశ కార్మికుల నైపుణ్యాలపై దృష్టిపెట్టినదని, ఇండియాను అంతర్జాతీయ తయారీ పవర్‌హౌస్‌గా చేసేందుకు నిర్దేశించినదని ఆయన అన్నారు.ఆవిష్కరణలలో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ వెలుగొందే లక్ష్యం కలిగి ఉందన్నారు. భారతదేశానికి గల అద్భుత మానవవనరులు ప్రపంచ అభివృద్ధికి దోహదపడనున్నాయని అన్నారు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670556
వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్‌లో ప్రధానమంత్రి చేసిన ప్రసంగ పాఠం వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670551
కోవిడ్ 19 వంటి ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొనేందుకు వైద్యపరికరాల పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేందుకు చేతులుకలిపిన ఇఇపిసి ఇండియా, ఎన్.ఐ.డి
వైద్యపరికరాల పరిశ్రమకు అవసరమైన డిజైన్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉన్నతీకరించేందుకు ఇఇపిసి ఇండియా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లు పరస్పరం చేతులు కలిపాయి.దీనితో దేశ ఆరోగ్య రంగ అవసరాలను తీర్చడానికి ప్రత్యేకించి కోవిడ్ -19 అనంతర పరిస్థితులలో వైద్యపరికరాల అవసరాలు తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. వినూత్నమైన, అత్యంత మెరుగైన డిజైన్లను రూపొందించి అమలు స్థాయికి తీసుకువెళ్లడానికి, ఎం.ఎస్.ఎం. ఇ మంత్రిత్వశాఖ ఆరోగ్యరంగానికి సంబంధించి ఏడు ఇంక్యుబేషన్ ఆలోచనలను ప్రత్యేకప్రభుత్వ పథకం కింద ఆమోదించినట్టు ఎం.ఎస్.ఎం.ఇ అడిషనల్‌సెక్రటరీ, డవలప్ మెంట్ కమిషనర్ ఈరోజు చెప్పారు. ఇఇపిసి ఇండియా- ఎన్.ఐడి డిజైన్ సిరీస్‌ను ఆవిష్కరించిన అనంతరం వెబినార్‌నుద్దేశించి మాట్లాడుతూ ఆయన, ఇది వైద్య రంగానికి సంబంధించి ప్రతిపాదించిన తొలి డిజైన్ సిరీస్ అని అన్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు కోవిడ్ అనంతర కాలంలో వైద్య పరికరాల పరిశ్రమకు డిజైన్ తోడ్పాటు గా పేరుపెట్టారు. ప్రస్తుత కోవిడ్ 19 మహమ్మారి సమయంలో , ఈ క్లిష్టపరిస్థితుల నుంచి బయటపడేందుకు దేశం ప్రయత్నిస్తున్నదని అన్నారు. కోవిడ్ పై పోరాటంలో మనం రోజుకు 2 లక్షల పిపిఇ కిట్లు తయారు చేయగలిగామని ఆయన అన్నారు. మన దేశంలో వైద్యపరికరాలు ఎంతో కీలకమైన రంగమని ఆయన తెలిపారు.. క్రిటికల్ కేర్‌కు సంబంధించిన ముఖ్యమైన వైద్య పరికరాలు సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నవని, ఈ విషయంలో నిరంతరం ఆవిష్కరణలు, నూతన డిజైన్‌లపై దృష్టిపెట్టాలని సింగ్ అన్నారు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670809
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ అనంతరం విశ్వవిద్యాలయాలు,కాలేజీలను తిరిగి తెరిచేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన యుజిసి
విశ్వవిద్యాలయాలు, కళాశాలలు తమ క్యాంపస్ లను తిరిగి తెరిచేందుకు విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం మార్గదర్శకాలు రూపొందించి , విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ , కేంద్ర హోం మంత్రిత్వశాఖ, కేంద్ర విద్యాశాఖ పరిశీలన , ఆమోదం అనంతరం విడుదల చేయడం జరిగింది. స్థానిక పరిస్థితులకు, ప్రభుత్వ అధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలను అమలు చేయవచ్చని యుజిసి తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలను గ్రేడెడ్‌పద్ధతిలో సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సంప్రదించిన మీదట యుజిసి రూపొందించిన ఆరోగ్య ప్రొటోకాల్స్, ఎస్.ఒ.పిలను పాటిస్తూ తెరవవచ్చు. ఈ మార్గదర్శకాలు , ఆయా క్యాంపస్‌లు తెరవడానికి ముందు ఉన్నత విద్యా సంస్థలు తీసుకోవలసిన చర్యలపై సవివరంగా ఉన్నాయి. ఉన్నత విద్యాసంస్థలు తీసుకోవలసిన భద్రతా చర్యలపైన , ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఇతర అధ్యయన ప్రదేశాలలో తగినజాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. హాస్టళ్లు, క్యాంపస్ లోపల,వెలుపల తగిన జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఆరోగ్యానికి సంబంధించి కౌన్సిలింగ్ కుచర్యలు తీసుకోవాలి. ఇంతకు ముందు విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం, కోవిడ్‌నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, అకడమిక్‌కాలండర్‌కు సంబంధించి మార్గదర్శకాలను 2020 ఏప్రిల్ 20 న, 2020 జూలై 6న జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు పరీక్షల నిర్వహణ,అకడమిక్ క్యాలండర్, అడ్మిషన్లు, ఆన్‌లైన్ బోధన వంటి అంశాలపై సవివరంగా తెలిపాయి.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670549
దేశీయ విమాన సర్వీసుల ఫేర్ బ్యాండ్‌లను 2021 ఫిబ్రవరి 24 వరకు పొడిగింపు.
విమానయాన సర్వీసులు ఆపరేట్ చేయాల్సిన ఫేర్‌బ్యాండ్లకు సంబంధించిన గడువును 2021 ఫిబ్రవరి 24 వరకు పొడిగిస్తూ పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఉత్తర్వులుజారీ చేసింది. ఫేర్‌బ్యాండ్‌లు 2020 మే 21 నుంచి అమలులోకి వచ్చాయి. రోజువారీ ప్రయాణికుల ట్రాఫిక్ 2020 నవం 1 నాటికి 2.05 లక్షలకు చేరుకుంది.
2020 మే నెలలో దేశీయ పౌరవిమానయాన రంగం తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభించినపుదడు, విమానయాన సంస్థలు వాటి సాధారణ సామర్ధ్యంలో 33 శాతం వరకు ప్రయాణించడానికి వీలు కలిగింది.( సమ్మర్‌షెడ్యూలు 2020 ప్రకారం). అప్పుడు సగటు రోజువారి ట్రాఫిక్ 30,000. ఈ పరిమితిని 2020 జూన్ 26 నుంచి 45 శాతానికి పెంచడం జరిగింది. ఈ పరిమితిని తిరిగి 60 శాతానికి 2020 సెప్టెంబర్ 2న పెంచడం జరిగింది.ప్రస్తుతం విమానయానసంస్థలు వాటి సామర్ధ్యంలో 60 శాతం వరకు ఆపరేట్ చేయవచ్చు.
మరిన్ని వివరాలకు : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1670381
పిఐబి క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం.
*అరుణాచల్ ప్రదేశ్ : అరుణాచల్‌ప్రదేశ్‌లో నిన్న కొత్తగా 84 కోవిడ్ కేసులు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1621 యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో రికవరీరేటు 89 శాతానికి పైగా ఉంది. ఇటానగర్ కేపిటల్ రీజియన్ ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం కోవిడ్ 19 కేసులలో 57.55 కేసులు కలిగి ఉంది
* అస్సాం : అస్సాంలో గత 24 గంటలలో 313 కోవిడ్ కేసులు గుర్తించడం జరిగింది. 27, 959 పరీక్షలు నిర్వహించారు. పాజిటివిటీ రేటు 1.12 శాతం.
* మేఘాల : మేఘాలయలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 989కి పెరిగింది. మొత్తం కోలుకున్న కేసులు 8813 గా ఉన్నాయి. రాష్ట్రంలో నమోదైన కొత్త కేసులు 92.
* మిజోరం : మిజోరంలో 32 వరకు కోవిడ్ -19 కొత్త కేసులు నిన్న నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2990కి చేరింది. యాక్టివ్ కేసులు 515 గా ఉన్నాయి.
* నాగాలాండ్ : నాగాలాండ్‌లో గురువారం నాడు 57 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 144 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
* మహారాష్ట్ర : మహారాష్ట్రలో రోజువారీ కోవిడ్ కేసులు తగ్గడం కోనసాగుతోంది. మహారాష్ట్రలో గురువారం 5,246 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి ఢిల్లీ రోజువారి రికార్డు కంటే తక్కువ. ముంబాయి లో 841 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో యాక్టివ్ కేస్‌లోడ్ 16,116కు పడిపోయింది. రాష్ట్ర క్రియాశీల కేస్‌లోడ్ లో ఆరో వంతు. రానున్న పండగలసీజన్ కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఒక పెద్ద సవాలు గా చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈరజు దీపావళికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్ (ఎస్.ఒ.పి)ని ప్రకటించింది. బాణాసంచా కాల్చవద్దని రాష్ట్రప్రభుత్వం ప్రజలకు సూచించింది.
* మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లో కోవిడ్ 19 కేసులు గురువారం నాడు 1,74,825 కు చేరుకున్నాయి.కొత్తగా 734 మంది కి కోవిడ్ నిర్ధారణ అయింది.ఐదుగురు మరణించడంతో మరణాల సంఖ్య మొత్తం 2,992కు పెరిగింది. గత 24 గంటలలో 817 మంది పేషెంట్లు కోవిడ్ నుంచికోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో కోవిడ్ నుంచి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,64,067 కు చేరింది.
*ఛత్తీస్‌ఘడ్ : ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఆరోగ్యకార్యకర్తల డాటాబేస్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించింది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులతో సహా అన్నింటి నుంచి సమాచారం సేకరిస్తున్నది. కోవిడ్ -19 వాక్సిన్ అందుబాటులోకి వస్తే వేయడానికి ఈ సమాచారం సేకరిస్తున్నారు.వివిధ శాఖలమధ్య సమన్వయానికి స్టేట్ టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశారు.
* గోవా : గోవా ,దేశంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతాలలో ఒకటి. విమానాల రాకపోకలు పెరగడం, హోటల్ బుకింగ్‌లుపెరగడంతో గోవాకు పర్యాటకుల రాక గణనీయంగా పెరగనుంది. ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఇక్సిగొ, గోవాకు బుకింగ్‌లు 74 శాతం పెరిగినట్టు తెలిపింది. గోవా పర్యటనకు సంబంధించి వివరాలు అడిగిన వారు అక్టోబర్‌లో 66 శాతం గా ఉన్నాయని తెలిపింది. 50 శాతం సామర్ధ్యంతో కాసినోలను తెరిచేందుకు గోవా ప్రభుత్వం ఈ వారం తొలినాళ్లలో అనుమతి ఇచ్చింది.
. * కేరళ : కేరళలో కోవిడ్ ప్రొటోకాల్స్‌ను ఖచ్చితంగా పాటిస్తూ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలును ప్రకటించింది. 1199 స్థానిక సంస్థలకు ఎన్నికలు డిసెంబర్ 8, 10, 14 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 16న నిర్వహిస్తారు. ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.భాస్కరన్, క్వారంటైన్‌లో ఉన్నవారు,కోవిడ్ పేషెంట్లకు ఓటు వేయడానికి తగిన ఏర్పాట్లుచేయడం జరుగుతుందని చెప్పారు.వీరుకనీసం మూడు రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మాస్కులు ధరించడం, గ్లొవ్‌లు వేసుకోవడం, సామాజికదూరం పాటించడం వంటివి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు పెరగడంతో కోవిడ్ మహమ్మారి కంట్రోల్‌కేంద్రాని బలోపేతం చేసినట్టు తెలిపారు. కేరళలో నిన్న 6820 కోత్త కేసులు నమోదయ్యాయి. 26 మరణాలు సంభవించాయి.
-----
* తమిళనాడు : మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమరేశ్వర్‌ప్రతాప్ సాహి కి కోవిడ్ -19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనను చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేరారు.వెట్రివెల్‌యాత్ర నిర్వహణకు బిజెపి నాయకులు రాష్ట్రప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్ీరోజు వెట్రివెల్‌యాత్రను ప్రారంభించేందుకు తిరుత్తణి బయలుదేరి వెళ్లారు. నెలరోజులపాటు నిర్వహించనున్న యాత్రా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాష్ట్రంలో పాఠశాలలు,కళాశాలలు ప్రారంభంకావడంలో మరింత జాప్యం జరగనున్నట్టు ప్రిన్స్ ఆఫ్ ఆర్కాట్ తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలు , కళాశాలలు తెరవడమంటే నిప్పుతో చెలగాటమాడడమే నని ఆయన అన్నారు.
* కర్ణాటక : కోవిడ్ 19మహమ్మారి నేపథ్యంలో బాణాసంచా కాల్చడాన్ని నిషేధించిన రాష్ట్రాలలో తాజాగ కర్ణాటక కూడాచేరింది. కర్ణాటకలో రోజుకు 3000 కేసులు సగటున నమోదవుతుండడంతో కర్ణాటక ఈ నిర్ణయం తీసుకుంది. కాగా కర్ణాటకలో ఈ ఏడాది డిసెంబర్‌లో జరగవలసిన గ్రామ పంచాయతి ఎన్నికలు 2021 ఫిబ్రవరి కి వాయిదా పడే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాలలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న దశలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరపడం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తూ డాక్టర్ ఎం.కె.సుదర్శన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ గురువారం నాడు సవివరమైన నివేదిక సమర్పించింది.
*ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు క్రమంగా పెరగతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెరవడం కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ సోకిన విద్యార్ధులు, ఉపాధ్యాయుల సంఖ్య క్రమంగా పెరగుతున్నది. విద్యాశాఖ తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో 70,790 మంది ఉపాధ్యాయులకు కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించగా అందులో 829 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విద్యార్థులకు సంబంధించి 95 , 763 నమూనాలను పరీక్షించగా 575 మంది విద్యార్ధులకు వైరస్ సోకినట్టు తేలింది.
* తెలంగాణ : తెలంగాణలో గత 24 గంటలలో 1602 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 982 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. నలుగురు మరణించారు. 1602 కొత్త కోవిడ్ కేసులలో జిహెచ్ఎంసి పరిధిలో 295 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 2,47,284 కాగా, యాక్టివ్ కేసులు 19,272 , మరణాలు 1366, కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,26,646 కాగా రికవరీ రేటు 91.65 శాతం..
FACT CHECK
*******
(Release ID: 1670842)
Visitor Counter : 186