ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఐదు వారాలుగా కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారే ఎక్కువ
ఐదు వారాలుగా కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారే ఎక్కువ
Posted On:
06 NOV 2020 11:19AM by PIB Hyderabad
గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నమోదైన కొత్త పాజిటివ్ కేసులు 50,000 కు దిగువన ఉన్నాయి. అదే సమయంలో కోలుకున్నవారి సంఖ్య 54,000 కు పైబడింది. ఆ విధంగా గడిచిన ఐదు వారాలుగా కొత్తగా వస్తున్న కేసులకంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గత 24 గంటలలో 54,157 మంది కోవిడ్ బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అదే సమయంలో కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అయినవారు 47,638 మంది.
రోజుకు నమోదవుతున్న కేసుల సగటు గడిచిన ఐదువారాలుగా తగ్గుతూ ఉంది. అక్టోబర్ మొదటి వారంలో రోజుకు సగటున 73,000 కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇప్పుడు రోజుకు సగటున 46,000 కేసులు వస్తున్నాయి.
చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య కూడా వేగంగా తగ్గుతూ వస్తోంది. ఈ రోజుకు మొత్తం పాజిటివ్ కేసులలో 6.19% మాత్రమే చికిత్సలో ఉన్నారు.
చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య తగ్గటం, కోలుకున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం క్రమంగా సాగుతూనే ఉంది. ఇప్పటివరకు మొత్తం కోలుకున్నవారు 77,65,966 మంది కాగా వారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా 72,45,193 కు చేరింది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారిశాతం 92.32% కి చేరింది. వీరిలో 80% కొత్త కేసులు కేవలం 10 రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఒకే రోజు 11,000 మంది కోలుకున్నారు.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 79% కేసులు 10 రాష్టాల నుంచి రాగా, 10,000 కు పైగా కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. 9,000 కు పైగా కేసులతో కేరళ రెండో స్థానంలో ఉంది.
గత 24 గంటలలో 670 మంది కోవిడ్ పాజిటివ్ బాధితులు మరణించారు. వీరిలో దాదాపు 86% మంది 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మృతులలో దాదాపు 38% మంది (256 మరణాలు) మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. 66 మరణాలతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది.
***
(Release ID: 1670589)
Visitor Counter : 228
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam