సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

వైద్య పరికరాల డిజైన్లకు కలసి పనిచేయనున్న ఈఈ పీసీ, ఎన్ఐడి ఆరోగ్య రంగ అవసరాలకు ప్రాధాన్యత

Posted On: 06 NOV 2020 4:17PM by PIB Hyderabad

దేశ ఆరోగ్య రంగ అవసరాలకు అనుగుణంగా వైద్య పరికరాలను రూపొందించడానికి ఇంజినీరింగ్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ అఫ్ ఇండియా (ఈఈ పీసీ)తో కలసి పనిచేయాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్ (ఎన్ఐడి) నిర్ణయించింది. దేశ ఆరోగ్య రంగ భవిషత్ అవసరాలను ​ముఖ్యంగా కొవిడ్ -19 తదనంతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు సంస్థలు కలసి పనిచేయాలని నిర్ణయించాయి. కొత్తగా వినూత్నంగా రూపకల్పన చేసిన పరికరాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకుని వెళ్ళడానికి సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ ఆరోగ్య రంగంలో ఏడు అంశాలను ప్రత్యేక ప్రభుత్వ పథకం కింద ఎంపిక చేసిందని శాఖ అదనపు కార్యదర్శి డెవలప్మెంట్ కమీషనర్ శ్రీ డి కె సింగ్ శుక్రవారం తెలిపారు. ఈఈ పీసీతో కలసి ఎన్ఐడి రూపొందించనున్న డిజైన్లను ఆయన వెబినార్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సింగ్ పోస్ట్ కోవిడ్ -19 పేరిట నూతన డిజైన్లను వైద్య పరికరాల పరిశ్రమ కోసం రూపొందిస్తున్నామని తెలిపారు.

 

' కొవిడ్ -19 వల్ల ఏర్పడిన క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడడానికి అనేక చర్యలను అమలు చేస్తున్నాము. కోవిడ్ -19ను ఎదుర్కోడానికి రోజుకి రెండు లక్షలకి మించి పిపిఇ కిట్లను ఉత్పత్తి చేసాము. వైద్య పరికరాలను విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవలసి వస్తున్నది. ఆరోగ్య సంరక్షణలో కీలకంగా మారిన వైద్య పరికరాల ఉత్పత్తి సాంకేతిక అంశాలతో ముడిపడి ఉంటుంది. వీటి డిజైన్లు, ఉత్పత్తిపై నిరంతరం దృష్టి సారించవలసి ఉంది ' అని అన్నారు.

ఈఈపీసీ చైర్మన్ శ్రీ మహేష్ దేశాయ్ తన ప్రారంభ ఉపన్యాసంలో తమ సంస్థ విధాన నిర్ణయాలను తీసుకుంటున్నవారిని,పరిశోధకులను, రూపకర్తలు, పరిశ్రమను ఒక వేదికపైకి తీసుకుని వస్తున్నదని తెలిపారు. కొవిడ్ -19 లాంటి సమస్యలను సమర్ధంగా ఎదుర్కొనే అంశంలో అమలు చేయవలసి ఉన్న చర్యలను చర్చించడానికి ఇటువంటి వేదికలు ఉపయోగపడతాయని అన్నారు.

 

ఎన్ఐడి డైరెక్టర్ శ్రీ ప్రవీణ్ నహర్ మాట్లాడుతూ ఫీజియోథెరపీ లేదా ఈసీజీ లాంటి చిన్న పరికరాల రూపకల్పన పోటీలో కూడా డిజైన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. డిజైన్లలో చేసిన మార్పుల వల్ల అనేక చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలు ప్రయోజనం పొందాయనన్నారు.

ఇంజనీరింగ్ ఉత్పతులను ఎగుమతి చేస్తున్న సంస్థలను ఈఈ పీసీ సమన్వయం చేస్తూ దేశ ఎగుమతుల్లో 25 శాతం వాటాను సమకూరుస్తున్నది.

పారిశ్రామిక పరికరాల రూపకల్పనలో ఎన్ఐడి అంతర్జాతీయ గుర్తింపును పొందింది.

కార్యక్రమంలో ఐబిఈఎఫ్ డిప్యూటీ సీఈఓ దుర్గా శక్తి, డిజైన్ డైరెక్షన్స్ డైరెక్టర్ సతీష్ గోఖలే, బెంగళూరుకి చెందిన ఐటీపీల్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ అగర్వాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

***

 


(Release ID: 1670809) Visitor Counter : 124