PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
18 JUL 2020 6:11PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,58, 692.
- కోవిడ్-19 నయమైనవారి సంఖ్య 6,53,750; కోలుకునేవారి శాతం 63గా నమోదు.
- చికిత్స పొందే-కోలుకునే కేసుల మధ్య అంతరం స్థిరంగా పెరుగుతూ ఇవాళ 2,95,058కి చేరిక.
- ఆస్పత్రులలో చికిత్స పొందే తీవ్ర పీడిత రోగులుసహా వైద్య పర్యవేక్షణలో ఏకాంత గృహవాసం సూచించబడిన 3,58,692 మంది రోగులకు పూర్తి శ్రద్ధతో వైద్యసేవలు.
- బీహార్‌లో కోవిడ్-19 నిర్వహణపై అంచనా కోసం కేంద్ర బృందం నియామకం.
- ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19పై పోరులో కోలుకునే శాతం భారత్‌లో అధికంగా ఉండటానికి తోడ్పడుతున్నది మన మూలాల్లోని ఆరోగ్య వ్యవస్థే: ప్రధానమంత్రి.
- కోవిడ్-19 కాలంలో పన్ను చెల్లింపుదారులకు రూ.71,229 కోట్లు వాపసు చేసిన ఆదాయపు పన్ను శాఖ


కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం; దేశంలో యాక్టివ్ కేసులు 3,58,692 మాత్రమే; కోలుకున్నవారి సంఖ్య: 6,53,750కి చేరిక
దేశవ్యాప్తంగా కోవిడ్-19 సమర్థ నిర్వహణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలు సంయుక్తంగా సకాల, చురుకైన, క్రమబద్ధ వ్యూహంతో చేపట్టిన చర్యలతో వాస్తవంగా చికిత్స పొందే రోగుల సంఖ్య ప్రస్తుతం నిర్వహించదగిన స్థాయిలోనే ఉంది. తదనుగుణంగా ఇవాళ్టికి చికిత్స పొ్ందుతున్న కోవిడ్ రోగుల సంఖ్య 3,58,692 కాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 6,53,750గా ఉంది. అంటే... చికిత్స పొందేవారికన్నా కోలుకునేవారి సంఖ్య 2,95,058 అధికంగా నమోదైంది. దీంతో ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స పొందే తీవ్ర పీడిత రోగులుసహా వైద్య పర్యవేక్షణలో ఏకాంత గృహవాసం సూచించబడిన 3,58,692 మందికి పూర్తి శ్రద్ధతో వైద్యసేవలు అందుతున్నాయి. ఇక బీహార్‌లో రాష్ట్రంలో కోవిడ్-19 నిర్వహణపై అంచనాతోపాటు అవసరమైన మేర సహాయం అందించడంలో భాగంగా కేంద్ర పరిశీలన బృందం ఏర్పాటైంది. కాగా, గడచిన 24 గంటల్లో 17,994 మంది కోలుకోగా, దేశవ్యాప్తంగా కోలుకునేవారి జాతీయ సగటు ఇప్పుడు 63 శాతంగా నమోదైంది. మరోవైపు దేశంలో ఇప్పటిదాకా 1,34,33,742 నమూనాలను పరీక్షించగా ప్రతి పది లక్షల జనాభాకు నిర్వహిస్తున్న రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య ఇప్పుడు 9734.6కు పెరిగింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639655
‘ఈకొసాక్’ అత్యున్నత స్థాయి విభాగం సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి కీలక ఉపన్యాసం; ప్రపంచంలో కోవిడ్‌నుంచి కోలుకునేవారి శాతం భారత్‌లో అధికంగా ఉండటానికి తోడ్పడింది జనమూలాల్లోని ఆరోగ్య వ్యవస్థే: ప్రధాని
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న ఐక్యరాజ్యసమితి అత్యున్నత విభాగమైన ‘ఆర్థిక-సామాజిక మండలి’ వార్షిక సదస్సునుద్దేశించి వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ అనంతర ప్రపంచంలో సమకాలీన ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించగల “సంస్కరణాత్మక బహుపాక్షికత”పై భారత్ పిలుపును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. “అందరితో కలసి.. అందరి ప్రగతి కోసం... అందరి విశ్వాసం” చూరగొంటూ ముందుకు సాగాలన్న భారతదేశ విధానాన్ని విశదీకరించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నిర్దేశిత ‘సుస్థిర ప్రగతి లక్ష్యాల’ మార్గంలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నదని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా తొలుత స్పందించే భారత స్వభావాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ మేరకు వివిధ దేశాలకు మందులు, వైద్య పరికరాల సరఫరాద్వారా భారత ప్రభుత్వం, భారతీయ ఔషధ కంపెనీలు తోడ్పడిన తీరును వివరించారు. అలాగే సార్క్ దేశాలతో సంయుక్త ప్రతిస్పందనను సమన్వయం చేసుకుంటూ వచ్చిన విధానాన్ని గుర్తుచేశారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639564
ఐరాస 75వ వార్షికోత్సవం సందర్భంగా ‘ఈకొసాక్’ సదస్సులో ప్రధాని ప్రసంగం పూర్తిపాఠం
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639566
కోవిడ్-19 కాలంలో పన్ను చెల్లింపుదారులకు రూ.71,229 కోట్లు వాపసు చేసిన సీబీడీటీ
కోవిడ్-19 మహమ్మారి కాలంలో పన్ను చెల్లింపుదారులకు ద్రవ్యలభ్యత దిశగా ముందస్తుగా చెల్లించిన ఆదాయపు పన్నును సత్వరం వాపసు చేయాలని ప్రభుత్వం 2020 ఏప్రిల్ 8వ తేదీన నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 2020 జూలై 11 వరకూ 21.24 లక్షలకుపైగా అభ్యర్థనలపై రూ.71,229 కోట్ల పన్ను వాపసు మొత్తాలను విడుదల చేసింది. ఆ మేరకు 19.79 లక్షల వ్యక్తిగత అభ్యర్థనల కింద రూ.24,603 కోట్లు, అదేవిధంగా 1.45 లక్షల కార్పొరేట్ అభ్యర్థన కింద రూ.46,626 కోట్లు పన్ను వాపసుకింద విడుదల చేసింది. వాపసులకు సంబంధించిన అన్ని అభ్యర్థనలనూ ప్రాధాన్యం ప్రాతిపదికన 2020 ఆగస్టు 31నాటికి పూర్తి చేయనుంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639483
కోవిడ్-19 సమయంలో మధుమేహులు చక్కెర పరిమాణాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
కోవిడ్-19 మహమ్మారి సమయంలో మధుమేహులు తమ రక్తంలో చక్కెర పరిమాణాన్ని కచ్చితంగా నియంత్రించుకోవాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. “హలో డయాబెటిస్ అకాడెమియా-2020” డిజిటల్ సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒకవైపు కోవిడ్ సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ భారత్ పూర్తి నిబ్బరంతో ముందుకు వెళ్తున్నదని, మహమ్మారి కాలంలో కార్యాచరణ-మేధో సమాజం రెండూ ఉత్తమ రీతిలో కర్తవ్యం నిర్వర్తించాయని ప్రశంసించారు. ఆ మేరకు ప్రతికూల పరిస్థితుల్లోనూ కొత్త విషయాల ఆవిష్కరణకు కోవిడ్ మనలను ప్రేరేపించిందని ఆయన చెప్పారు. మధుమేహులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, దీనివల్ల కరోనావంటి వ్యాధులను ఎదుర్కొనే శక్తి క్షీణించి, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సలహా ఇచ్చారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639511
భారత-అమెరికా వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన
ప్రపంచ మానవాళికి సమస్యాత్మకంగా మారిన సంక్షోభం ప్రభావం ఇంధన అవసరాల మీద, అంతర్జాతీయ ఇంధన విపణులపైన, సుస్థిర ఇంధన ప్రగతిమీద కూడా పడింది. ఈ నేపథ్యంలో భారత్-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకంగా మారింది. ఈ మేరకు ఇవాళ అమెరికా ఇంధనశాఖ మంత్రి డాన్ బ్రౌలెట్, భారత పెట్రోలియం-సహజవాయు-ఉక్కు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా అమెరికా-భారత్ వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధించిన కీలక విజయాలు, ఇతర అంశాల్లో రెండు దేశాలూ సహరించుకోవాల్సిన ప్రాధాన్య రంగాలపై వారు చర్చించుకున్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639588
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- పంజాబ్: రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు, మరణాలపై పంజాబ్ ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇతరత్రా అవసరంలేని విధుల్లోగల పోలీసు సిబ్బందిని ఉపసహరించి, రాబోయే కొద్ది నెలలపాటు కోవిడ్ ప్రత్యేక దళాలను రూపొందించాలని డీజీపీని ఆదేశించారు. మరోవైపు భద్రత నిబంధనలను ఉల్లంఘించేవారు, ముఖ్యంగా మాస్కులు ధరించనివారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధి వ్యాప్తిని అదుపుచేసే దిశగా కేసులు ఎక్కువగా నమోదయ్యే నగరాల్లో ఆంక్షలను, నిబంధనలను కఠినంగా అమలుచేసేలా ఎస్‌ఎస్‌పీలను ఆదేశించాలని ఆయన డీజీపీకి సూచించారు.
- హర్యానా: దిగ్బంధ విముక్తి రెండోదశలో కోవిడ్-19 ముప్పు అధికంగా ఉన్నందున మాస్కులు తప్పక ధరించేలా ప్రజలను ప్రోత్సహిస్తూ ప్రత్యేక ప్రచారం చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ కూడళ్లు, పట్టణ స్థానిక సంస్థల వాహనాలు, సమాచార-ప్రజా సంబంధాలు- భాషలశాఖ ప్రచార వాహనాలను కూడా అవగాహన కల్పన కోసం ఉపయోగించాలని సూచించారు.
- హిమాచల్ ప్రదేశ్: ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమం నిర్వహించరాదని రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ నిర్ణయించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాజ్ భవన్‌లో 'ఎట్ హోమ్' నిర్వహించే సంప్రదాయం అనాదిగా కొనసాగుతోందని ఆయన గుర్తుచేశారు. అయితే, ఈ ఏడాది ప్రతి ఒక్కరి ఆరోగ్యం-భద్రత దృష్ట్యా రద్దు చేసినట్లు తెలిపారు.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో శుక్రవారం ఒకేరోజు 8,308 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 2,92,589కి చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. మహారాష్ట్రలో ఒకేరోజు 8,000 కేసులు నమోదు కావడం ఇది మూడోసారి. వైరస్ బారినపడి శుక్రవారం 258మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 11,452కు పెరిగింది. కోవిడ్ మహమ్మారి మహారాష్ట్రలోని పాల సరఫరా గొలుసును కూడా ప్రభావితం చేసింది. రాష్ట్రంలో రోజువారీ 1.19 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుండగా 47 లక్షల లీటర్లు అమ్ముడు కావడంలేదు. దీంతో పాల ఉత్పత్తిదారులు, రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని, వారికి సహాయం అందించాలని రైతు సంస్థలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
- గుజరాత్: రాష్ట్రంలో శుక్రవారం దాదాపు 950 కొత్త కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 46,449కి చేరింది. కొత్త కేసులలో 234 సూరత్ నుంచి, 184 అహ్మదాబాద్ నుంచి నమోదైనవే. గత 24 గంటలలో 12,800 నమూనాలను సేకరించిన నేపథ్యంలో రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ మేరకు అహ్మదాబాద్‌లో శుక్రవారం 3,000 నమూనాలను పరీక్షించారు.
- రాజస్థాన్: రాష్ట్రంలో శుక్రవారం 656మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం 27,786 కేసులలో ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 20,626కు చేరగా, మృతుల సంఖ్య 546గా ఉంది.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడంతోపాటు గృహనిర్బంధ, సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.100 నుంచి 1,000 వరకూ జరిమానా విధించబడుతుంది. వాణిజ్య సంస్థలు, దుకాణాల యజమానులు వారి ప్రాంగణాల్లో సామాజిక దూరం విధివిధానాలను ఉల్లంఘిస్తే రూ.200 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల ధారణ కూడా తప్పనిసరి చేయబడింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో 1,429 యాక్టివ్ కేసులున్నాయి.
- కేరళ: రాష్ట్రంలో కోవిడ్-19 విస్తరిస్తున్న దృష్ట్యా ప్రభుత్వం అవసరమైన అన్ని నియంత్రణ చర్యలూ తీసుకుంటున్నదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలాజ పేర్కొన్నారు. కోవిడ్ రోగులకు చికిత్స రేటుపై ప్రైవేటు ఆస్పత్రులతో చర్చించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. తిరువనంతపురం పరిధిలోని తీర ప్రాంతమంతటా ఇవాళ్టినుంచి దిగ్బంధం అమలులోకి వచ్చింది. ఇక ఉత్తర కాసరగోడ్ జిల్లాలో కఠినమైన ఆంక్షలు విధించారు. కన్నూర్-కాసరగోడ్ సరిహద్దులు మూసివేశారు. రాష్ట్రంలో నిన్న 791 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 532 పరిచయాల ద్వారా సంక్రమించినవి కాగా, మూలం తెలియని కేసులు 42 ఉన్నాయి. రాష్ట్రంలో నిర్ధారిత కేసుల సంఖ్య 11,066 కాగా, ప్రస్తుతం 6,029 మంది చికిత్స పొందుతున్నారు.
- తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత 24 గంటల్లో ముగ్గురు మరణించడంతో మృతుల సంఖ్య 28కి చేరింది. ప్రస్తుతం 804మంది చికిత్స పొందుతున్నారు. ఇక తమిళనాడులోని కోయంబత్తూరులోగల కోడిస్సియా వాణిజ్య ప్రదర్శన ప్రాంగణంలోని కోవిడ్ సంరక్షణ కేంద్రంలో 300 మంది కోవిడ్ రోగులకు నాలుగు విశ్రాంతి గదులు కేటాయించడం ఊహాగానాలకు దారితీసింది. ఇక ఎక్స్-రే సదుపాయంగల సంచార వర్గీకరణ కేంద్రాలు మదురైలో కోవిడ్-19 మరణాలను తగ్గించడంలో తోడ్పడగలవని భావిస్తున్నారు. మదురైలో కేసులు వేగంగా పెరగడంతోపాటు ఆలస్యంగా ఆస్పత్రులకు తీసుకురావడం వంటి కారణాలవల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు నగరంలోని వైద్యులు చెబుతున్నారు. కాగా, తమిళనాడులో మరణాల శాతంతో పోలిస్తే జూలై 17 నాటికి 138 మరణాలతో మదురై నాలుగో స్థానంలో ఉంది. రాష్ట్రంలో నిన్న 4538 కొత్త కేసులు, 79 మరణాలు నమోదవగా, వీటిలో చెన్నై కేసులు 1243 ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య: 1,60,907; యాక్టివ్ కేసులు: 47,782; మరణాలు: 2315; చెన్నైలో యాక్టివ్ కేసులు: 14,923గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్రంలోని బెంగళూరుసహా ఇతర జిల్లాల్లో ఇటీవల కోవిడ్-19 కేసులు పెరిగిన దృష్ట్యా ఆస్పత్రులలోని పడకలను ఓ మోస్తరు, తీవ్ర బాధితుల కోసం వినియోగించేలా ఆరోగ్య-కుటుంబ సంక్షేమ కమిషనర్ ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఎవరైనా రోగి కోవిడ్‌తో మరణించినప్పుడు లేదా మరణించిన తర్వాత ఎవరికైనా వైరస్ సోకినట్లు తేలినప్పుడు అనుసరించాల్సిన విధివిధానాలను బీబీఎంపీ జారీచేసింది. కాగా, కోవిడ్-19 ఆరోగ్య నిబంధనలను ఉల్లంఘించిన రాజకీయ నాయకులు తదితరులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక రాష్ట్రంలో నిన్న 3693 కొత్త కేసులు, 115 మరణాలు నమోదయ్యాయి; వీటిలో బెంగళూరు నగరంలో 2208 నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు:55,115; యాక్టివ్ కేసులు: 33,205; మరణాలు: 1147గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: కోవిడ్-19 కారణంగా చెన్నై తదితర ప్రదేశాల నుంచి రాష్ట్రంలోని వివిధ గ్రామాలకు తిరిగివచ్చిన వలస కార్మికులు ప్రస్తుతం స్వస్థలాల్లో జీవనోపాధి లభించక తిరిగి ఆయా ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గత వారంలో (జూలై 10-17) కోవిడ్ కేసులు 9 శాతం వంతున పెరిగాయి. కాగా, జూలై 6 నుంచి రోజువారీ కొత్త కేసులు 1,000కిపైగా నమోదవుతున్నాయి. అలాగే మూడు రోజుల నుంచీ నిత్యం 2,000 మందికిపైగా ప్రజలకు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అవుతోంది. తిరుమల దేవస్థానంలో పలువురు పూజారుకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ కావడంతో శ్రీవారి ఆలయంలో దర్శనం కొనసాగించడంపై టీటీడీ ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇక రాష్ట్రంలో నిన్నటినుంచి 23,872 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో గత 24 గంటల్లో 3963 కొత్త కేసులు, 52 మరణాలు నమోదు కాగా, 1411 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 44,609; యాక్టివ్ కేసులు: 22,260; డిశ్చార్జ్: 21,763; మరణాలు: 586గా ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెంపుదిశగా ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లతో 5 లక్షల నమూనాలను పరీక్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కోవిడ్-19 ఆకస్మిక నిధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లు విడుదల చేశారు. కాగా రాష్ట్రంలో నిన్న 1478 కొత్త కేసులు, 7 మరణాలు నమోదవగా 1410 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 806 నమోదయ్యాయి. మొత్తంమీద ప్రస్తుతం కేసుల సంఖ్య: 42,496; యాక్టివ్ కేసులు: 13,389; మరణాలు: 403; డిశ్చార్జి అయినవి: 28,705గా ఉన్నాయి.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రానికి చెందిన 16000 మందికిపైగా పౌరులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరిగివచ్చారు. మరోవైపు కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35000 నమూనాలను సేకరించారు. ఇక కోవిడ్-19 రోగులకు చికిత్సకోసం అవసరమైన ప్రాణరక్షక ఔషధాలను సేకరిస్తున్నామని, రాబోయే రోజుల్లో మందులకు ఎలాంటి కొరత లేకుండా చూస్తామని అరుణాచల్ ప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి ఆలో లిబాంగ్ చెప్పారు. ఇందులో భాగంగా 20 కొత్త మెడికల్ అంబులెన్సు వాహనాలను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.
- అసోం: రాష్ట్రంలోని గువహటి నగరంలోగల జీఎంసీ ఆస్పత్రిలో కోవిడ్-19 సోకిన పదిమంది గర్భిణులు నలుగురు ఆడ, ఆరుగురు మగ శిశువులకు జన్మనిచ్చారని అసోం ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా వెల్లడించారు.
- మణిపూర్: రాష్ట్రంలోని ‘రిమ్స్’లో పీజీ కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న డాక్టర్ ఒకరికి రోగ నిర్ధారణ కావడంతో ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలను మూసివేశారు. తౌబాల్ జిల్లాలోని మొయిజింగ్ పంచాయతీలో కొత్త కేసుల నమోదుతో అక్కడి 1, 6, 8, 10 నంబరు వార్డులను నియంత్రణ జోన్లుగా ప్రకటిస్తూ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.
- మిజోరం: రాష్ట్రంలో ఇవాళ ఒక కోవిడ్ రోగి కోలుకున్నారు. దీంతో మిజోరంలో మొత్తం 282 కేసులకుగాను ప్రస్తుతం 121 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటిదాకా 161 మంది కోలుకున్నారు.
- నాగాలాండ్: రాష్ట్రంలో 22 కొత్త కేసులు నమోదవగా- పెరెన్‌లో 11, దిమాపూర్‌లో 8, కోహిమాలో 3 వంతున ఇవన్నీ దిగ్బంధ కేంద్రాల పరిధిలో నిర్ధారణ కావడం గమనార్హం. దీంతో నాగాలాండ్‌లో మొత్తం కేసుల సంఖ్య 978కి చేరగా, వీటిలో 573 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 405 మంది కోలుకున్నారు.
- సిక్కిం: రాష్ట్రంలోని తూర్పు ప్రాంత జిల్లాలు రోంగ్లీ, పాక్యాంగ్ పరిధిలోగల రెండు సబ్-డివిజన్లలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు సంబంధించి వివిధ సమస్యలపై చర్చించేందుకుం సిక్కిం ముఖ్యమంత్రి ఇవాళ సమ్మాన్ భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

****
(Release ID: 1639704)
Visitor Counter : 290
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam