ప్రధాన మంత్రి కార్యాలయం

ఇసిఒఎస్ఒసి యొక్క ఉన్నత స్థాయి విభాగాన్ని ఉద్దేశించి కీలకోపన్యాసమిచ్చిన ప్ర‌ధాన మంత్రి


సంస్కరింపబడిన ఐక్య రాజ్య సమితి కేంద్ర బిందువు గా సంస్కరించిన బహుపక్షవాదం అవసరం అంటూ పిలుపునిచ్చిన ప్ర‌ధాన మంత్రి

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనేటటువంటి మా యొక్క ధ్యేయం ఏ ఒక్కరి ని వెనుకపట్టున వదలివేయకూడదు అంటున్న ఎస్ డిజి ప్రాణప్రద సూత్రం లో ప్రతిధ్వనిస్తున్నది: ప్ర‌ధాన మంత్రి

అభివృద్ధి పథం లో ముందుకు సాగుతూ, మేము మన భూగ్రహం పట్ల మా బాధ్యత ను మరువడం లేదు: ప్ర‌ధాన మంత్రి

కోవిడ్ పై పోరు లో భారతదేశం ప్రపంచంలోకెల్లా అతి ఉత్తమమైన రోగనివృత్తి రేటుల ను సాధించడం లో మా కూకటివేళ్ల స్థాయి లోని ఆరోగ్య వ్యవస్థ సాయపడుతోంది : ప్ర‌ధాన మంత్రి

Posted On: 17 JUL 2020 8:46PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం జూలై 17వ తేదీ శుక్రవారం నాడు న్యూ యార్క్ లో జరిగిన ఐక్య రాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి (ఇసిఒఎస్ఒసి) కి చెందిన ఉన్నత స్థాయి విభాగం యొక్క ఈ సంవత్సరపు సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్ మాధ్యమం ద్వారా కీలకోపన్యాసాన్ని ఇచ్చారు.  

భద్రత మండలి లో ఓ శాశ్వతేతర సభ్యత్వ దేశం గా (2021-22 పదవీకాలాని కి గాను) భారతదేశం జూన్ 17వ తేదీ నాడు  ఎదురులేకుండా ఎన్నికైనప్పటి నుండి 
విస్తృత యుఎన్ సభ్యత్వదేశాల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించడం ఇదే తొలిసారి.

‘‘కోవిడ్- 19 అనంతర బహుపక్షవాదం: 75వ వార్షికోత్సవ వేళ ఎటువంటి యుఎన్ యొక్క ఆవశ్యకత మనకు ఉన్నది’’ అనేది ఈ సంవత్సరం జరిగే ఉన్నత స్థాయి విభాగం యొక్క ఇతివృత్తం గా ఉన్నది.

ఐక్య రాజ్య సమితి ని స్థాపించిన అనంతరం 75వ వార్షికోత్సవ వేళ యాదృచ్ఛికం గా చోటు చేసుకొంటున్నటువంటి ఇసిఒఎస్ఒసి యొక్క ఉన్నత స్థాయి విభాగ సదస్సు తాలూకు ఇతివృత్తం- ఐరాస భద్రత మండలి లో త్వరలో సభ్యత్వ సాధన అనేది భారతదేశం యొక్క ప్రాథమ్యం గా ఉండగా- ఆ ప్రాథమ్యాని కి అనుగుణం గా కూడాను ఉన్నది.  కోవిడ్-19 తదనంతర జగత్తు లో ‘సంస్కరించిన బహుపక్షవాదం’ ఆవశ్యకత ఉందని, అది  సమకాలిక ప్రపంచ  వాస్తవికత ను ప్రతిబింబిస్తుందంటూ భారతదేశం ఇచ్చిన పిలుపు ను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.

ఇసిఒఎస్ఒసి తో మరియు స్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్ డిజి) తో సహా ఐరాస అభివృద్ధి ప్రధాన కృషి తో భారతదేశాని కి దీర్ఘకాలం గా ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో మరొక మారు జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు.  ఏ ఒక్కరి ని వెనుకపట్టున వదలివేయకూడదు అంటున్న ఎస్ డిజి ప్రాణప్రద సూత్రం లో ప్రతిధ్వనిస్తున్నదని ఆయన చెప్పారు.   

భారతదేశం తన విశాల జనాభా యొక్క సామాజిక, ఆర్థిక సూచికల ను మెరుగుపరచడం లో సాధించిన సాఫల్యం ప్రపంచ ఎస్ డిజి లక్ష్యాల పైన ఒక మహత్వపూర్ణమైనటువంటి ప్రభావాన్ని ప్రసరిస్తుందని ప్రధాన మంత్రి వివరించారు.  అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలు వాటి యొక్క ఎస్ డిజి లక్ష్యాల ను చేరుకోవడం లో ఆయా దేశాల కు సాయపడాలని భారతదేశం వచనబద్ధురాలు అయివుందని కూడా ఆయన చెప్పారు. 

భారతదేశం ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి అభివృద్ధి ప్రధానమైన కృషి ని గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు.  ఈ క్రమం లో, ‘‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’’ ద్వారా ఆరోగ్య రక్షణ సంబంధి విజ్ఞాన లభ్యత ను మెరుగుపరచడం, మహిళల కు సాధికారిత కల్పన, ఆర్థిక సేవల ను అందరి అందుబాటులో కి తీసుకు పోవడం, ఇంకా ‘‘హౌసింగ్ ఫార్ ఆల్’’ కార్యక్రమం, అలాగే ‘‘ఆయుష్మాన్ భారత్’’ ల వంటి ప్రముఖ పథకాల అండ దండల తో గృహాల లభ్యత ను, స్వాస్థ్య సంరక్షణ ను విస్తరించడం గురించి ఆయన పేర్కొన్నారు.  

పర్యావరణ సమతుల్యత ను కొనసాగించడం పట్ల, అలాగే జీవవైవిధ్య పరిరక్షణ పట్ల భారతదేశం వహిస్తున్న శ్రద్ధ ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు.  ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ మరియు కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ల స్థాపన లో భారతదేశం 
ప్రధాన పాత్ర ను పోషించిన సంగతి ని ఆయన గుర్తు చేశారు. 

భారతదేశం తన ప్రాంతం లో ప్రథమ  అనుక్రియదారు దేశం భూమిక ను వహిస్తున్న సంగతి ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వివిధ దేశాల కు భారత ప్రభుత్వం మరియు భారత ఔషధ నిర్మాణ కంపెనీ లు ఔషధాల సరఫరా కు పూచీ పడడాన్ని, అలాగే ఎస్ఎఎఆర్ సి సభ్యత్వ దేశాలన్నిటి కి కలిపి ఒక సంయుక్త ప్రతిస్పందన సంబంధి వ్యూహాన్ని సమన్వయపరచడాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.

ప్రధాన మంత్రి ఇసిఒఎస్ఒసి ని ఉద్దేశించి ప్రసంగించడం ఇప్పటికి ఇది రెండో సారి.  ఇంతకు ముందు, 2016 వ సంవత్సరం జనవరి మాసం లో, ఇసిఒఎస్ఒసి యొక్క 70వ వార్షికోత్సవం జరిగిన సందర్భం లో ఆయన కీలకోపన్యాసాన్ని ఇచ్చారు.  


 

***
 



(Release ID: 1639564) Visitor Counter : 312