ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రస్తుతం దేశంలో కోవిడ్ బాధితులు 3,58,692 మాత్రమే

6,53,750కి పెరిగిన కోలుకున్నవారి సంఖ్య

అత్యవసరంగా బీహార్ కు ప్రత్యేక కేంద్ర బృందాలు

Posted On: 18 JUL 2020 2:18PM by PIB Hyderabad

సకాలంలో స్పందించి వ్యూహాత్మకంగా తీసుకుంటున్న చర్యల ఫలితంగాను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అనుసరిస్తున్న చికిత్స కారణంగాను ప్రస్తుతం కోవిడ్ బాధితుల సంఖ్య అదుపులో ఉంది. ప్రస్తుతం కోవిడ్ తో బాధపడుతున్నవారు 3,58,692 మంది మాత్రమే.

కోలుకున్నవారి సంఖ్య మరింత పెరిగి 6,53,750కు చేరింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికీ మధ్య అంతరం బాగా పెరుగుతోంది.  ఇంకా బాధితులుగా ఉన్న  3,58,692 మందికి చికిత్స అందుతొంది.

కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలు సమన్వయం చేసుకుంటూ  కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయడం వలన ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నారు. అవసరమైనప్పుడు కేంద్రం తన ప్రత్యేక బృందాలను పంపుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తోంది.  అదే కోవలో బీహార్ కు కూడా కేంద్ర బృందాలను పంపింది. కోవిడ్ వ్యాప్తి తీరును అంచనా వేయడంతో బాటు కట్టడి తీసుకోవాల్సిన చర్యలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది. ఈ బృందంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త  కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్, ఎం సి డి సి డైరెక్టర్ డాక్టర ఎస్ కె సింగ్,   ఎయిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర డాక్టర్ నీరజ్ నిశ్చల ఉన్నారు. ఈ బృందం రేపు బీహార్ చేరుకుంటుంది.

కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టడం కొనసాగుతోంది.  సోకే అవకాశం ఉన్నవాళ్లను గుర్తించటం, కంటెయిన్మెంట్, బఫర్ జిన్లను గుర్తించి వ్యాపించకుండా చర్యలు తీసుకోవడం, బాధితులకు సమర్థంగా చికిత్స అందించటం జరుగుతోంది. ఇందుకు గాను ప్రామాణిక చికిత్సా విధానాలు అనుసరిస్తున్నారు. ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు పెంచటానికి కూడా అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఈ చర్యల వల్లనే కొలుకున్నవారి సంఖ్య బాగా పెరిగింది. 

గడిచిన 24గంటల్లో 17,994 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. కోలుకున్నవారి శాతం 63% కు చేరింది.

భారత వైద్య పరిశోధన మండలి తాజా వ్యూహంలో భాగంగా ఆర్ ఎం పి డాక్టర్లు కూడా పరీక్షలకు సిఫార్సు చేసే అవకాశం కల్పించటంతో పరీక్షల సంఖ్య బాగా పెరిగింది. గత 24 గంటల్లో మొత్తం  3,61,024 శాంపిల్స్ పరీక్షించారు. దీంతో ఇప్పటిదాకా జరిపిన మొత్తం పరీక్షలు1,34,33,742కి చేరాయి. దాంతో దేశంలో ప్రతి పది లక్షల మందిలో  9734.6.పరీక్షలు చేసినట్టయింది

గేటెడ్ కమ్యూనిటీలలో, కాంప్లెక్స్ లలో నివసించే వారు కోరిన పక్షంలో అక్కడ ఒక కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసింది.

వివరాలు చూడాల్సిన చిరునామా: 

https://www.mohfw.gov.in/pdf/CovidCareFacilityinGatedcomplexes.pdf

గేటెడ కాంప్లెక్స్ లలో ఉండేవారికోసం ఒక సలహా పత్రాన్ని కూడా

విడుదల చేసింది. అది ఇక్కడ చూడవచ్చు.  

https://www.mohfw.gov.in/pdf/AdvisoryforRWAsonCOVID19.pdf

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి

 

***


(Release ID: 1639655) Visitor Counter : 215