ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా కప్-2025లో భారత పురుషుల హాకీ జట్టు అసాధారణ విజయం.. ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
08 SEP 2025 7:20AM by PIB Hyderabad
బీహార్‌లోని రాజ్‌గీర్‌లో నిర్వహించిన ఆసియా కప్-2025లో అద్భుత గెలుపును సొంతం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ‘‘గతంలో విజేతలైన దక్షిణ కొరియా జట్టుపై ఆధిపత్యాన్ని సాధించిన కారణంగా ఈ విజయం మరింత ప్రత్యేకమైంద’’ని శ్రీ మోదీ అభివర్ణించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘బీహార్‌లోని రాజ్‌గీర్‌లో నిర్వహించిన ఆసియా కప్-2025లో మన పురుషుల జట్టు వైభవోపేత విజయాన్ని చేజిక్కించుకొన్నందుకు ఇవే అభినందనలు. గతంలో విజేతగా ఉన్న దక్షిణ కొరియాపై వారు పైచేయి సాధించారు కాబట్టి, ఈ గెలుపు మరింత గొప్పది.
భారత హాకీనే కాక భారతీయ క్రీడారంగం కూడా ఎంతో సంతోషించదగ్గ ఘడియ ఇది. మన క్రీడాకారులు తరచూ విజయాలను అందుకుంటూ, దేశానికి మరింత కీర్తిని సంపాదించి పెట్టాలని నేను ఆకాంక్షిస్తున్నాను.’’
***
(Release ID: 2164694)
Visitor Counter : 2
Read this release in:
Odia
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam