ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ ఉక్కు రంగంలో నాయకత్వ స్థానం దిశగా భారత్ .. విధాన పరమైన ఊతం, నవకల్పన
ఎలా తోడ్పడుతున్నదీ వివరించిన వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 JUN 2025 1:35PM by PIB Hyderabad
ప్రపంచ ఉక్కు రంగంలో నాయకత్వ స్థానం దిశగా భారత్ ప్రస్థానానికి నవకల్పన, విధాన పరమైన ఊతం ఎలా తోడ్పాటును అందిస్తున్నదీ వివరించిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకొన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి ‘ఎక్స్’లో పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి స్పందిస్తూ:
‘‘మౌలిక సదుపాయాల కల్పన మొదలు రక్షణ రంగం వరకు, అలాగే విద్యుత్తు ఆధారిత ప్రయాణ సాధనాలు మొదలు స్వచ్ఛ ఇంధనం వరకు చూస్తే... భారత్ పురోగతిలో కీలక పాత్ర ఉక్కు రంగానిదే. ప్రపంచ ఉక్కు రంగంలో నాయకత్వ స్థానాన్ని చేజిక్కించుకొనే దిశగా మన దేశం సాగిస్తున్న ప్రస్థానాన్ని విధాన పరమైన మద్దతు, నవకల్పన ఏ విధంగా వేగవంతం చేస్తున్నాయో కేంద్ర మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి (@hd_kumaraswamy) వివరించారు.’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2140748)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam