ప్రధాన మంత్రి కార్యాలయం
టీకామందు ను వేయించుకొన్నందుకు 15-18 ఏళ్ల వయస్సు కలిగిన యువత కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
03 JAN 2022 10:20PM by PIB Hyderabad
పదిహేనేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఈ రోజు న టీకామందు ను ఇప్పించుకొన్నందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి అభినందనలను తెలియజేశారు. ఈ వయోవర్గంలోని పెద్ద పిల్లలకు నేటి నుంచి వ్యాక్సీన్ లను వేయడం మొదలైంది. వీరి తల్లితండ్రుల కు కూడా ప్రధాన మంత్రి అభినందనలను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న మనం కోవిడ్-19 బారి నుంచి మన యువత ను సురక్షితం గా ఉంచడం కోసం ఒక ముఖ్యమైనటువంటి చర్య ను చేపట్టాం. టీకామందు ను ఇప్పించుకొన్న 15-18 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన నా యువ మిత్రులు అందరి కి ఇవే అభినందన లు. నేను వారి తల్లితండ్రుల కు కూడాను అభినందన లు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల లో టీకామందు వేయించుకోవలసింది గా నేను ఇతర యువతీయువకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
The Prime Minister also retweeted the Union Health and Family Welfare Minister Dr Mansukh Mandaviya's tweets in this regard.
******
DS/SKS
(Release ID: 1787406)
Visitor Counter : 153
Read this release in:
Gujarati
,
English
,
Bengali
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Tamil
,
Kannada
,
Malayalam