PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 06 JAN 2021 5:59PM by PIB Hyderabad

Coat of arms of India PNG images free download

  • దేశంలో గత 12 రోజులుగా కోవిడ్-19 వల్ల సంభవించిన తాజా మరణాలు 300కన్నా తక్కువే.
  • దేశవ్యాప్తంగా ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 2,27,546 మాత్రమే.
  • గత 24 గంటల్లో కోలుకున్న కేసులు 21,314 కాగా, ఇదే వ్యవధిలో నమోదైన కొత్త కేసులు 18,088 మాత్రమే.
  • కోలుకునేవారి సగటు మరింత మెరుగుపడి 96.36 శాతానికి పెరుగుదల
  • ప్రజారోగ్య సదుపాయాలలో 162 పీఎస్ఏ ప్రత్యేక మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘పీఎం కేర్స్ ఫండ్ ట్రస్ట్’ నుంచి రూ. 201.58 కోట్లు కేటాయింపు.
  • అత్యవసర పరిస్థితుల్లో సీరం, భారత్ బయోటెక్ సంస్థల టీకాల పరిమిత వినియోగానికి ఆమోదం. మూడోదశ మూడోదశ ప్రయోగ పరీక్షల నిమిత్తం కాడిలా హెల్త్‌కేర్‌ సంస్థకు అనుమతి.

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Image

కోవిడ్ మరణాల్లో స్థిరంగా తగ్గుదల; వరుసగా 12 రోజులనుంచి 300కన్నా తక్కువగా రోజువారీ మరణాలు; చురుకైన కేసులు 2.19 శాతానికి తగ్గి, 2.27 లక్షలుగా నమోదు; 71 మందికి యూకే పరివర్తిత వైరస్ సోకిందని నిర్ధారణ

దేశంలో రోజువారీ కోవిడ్ మరణాల సంఖ్య స్థిరంగా తగ్గుతూ రోజువారీ తాజా మరణాల సంఖ్య వరుసగా 12 రోజులనుంచి 300కన్నా తక్కువగా నమోదవుతోంది.

ఈ మేరకు గత వారం రోజుల వ్యవధిలో ప్రతి 10 లక్షల జనాభాకు సగటున కేవలం ఒకేఒక్క మరణం మాత్రమే నమోదవుతోంది. మరోవైపు చురుకైన కేసుల సంఖ్య నిరంతరం తగ్గుతూ రావడం ఇంకొక విజయంగా చెప్పాలి. తదనుగుణంగా ఆస్పత్రులలో చికిత్స పొందేవారి సంఖ్య నేడు 2,27,546కు పరిమితమైంది. అంటే మొత్తం నమోదిత కేసులలో చురుకైన కేసుల వాటా మరింత పతనమై 2.19 శాతానికి దిగివచ్చింది. ఇక చురుకైన కేసులలో రోజువారీ కోలుకునే కేసులు కూడా నికరంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో గడచిన 24 గంటల్లో 21,314 మంది కోలుకున్నారు. ఆ మేరకు చురుకైన కేసులలో నికర తగ్గుదల 3,490గా నమోదైంది. ఇటీవలి కాలంలో రోజువారీ కేసులు 20,000కన్నా తక్కువగా ఉంటూ గత 24 గంటల్లో 18,088 మాత్రమే నమోదయ్యాయి. అంటే- భారతదేశంలో గడచిన 7 రోజులలో సగటున ప్రతి 10 లక్షల జనాభాకు నమోదైన కొత్త కేసులు కేవలం 96 మాత్రమే కావడం గమనార్హం. దీనితో పోలిస్తే బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో నమోదయ్యే కేసుల సంఖ్య అత్యధికంగా ఉంటోంది. అంతేకాకుండా భారతదేశంలో ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 99,97,272 కాగా, త్వరలోనే కోటి కేసుల స్థాయికి చేరనుంది. రోజువారీ కోలుకునే కేసులు కొత్త కేసులకన్నా అధికంగా ఉంటుండటంతో కోలుకునేవారి జాతీయ సగటు 96.36 శాతానికి చేరింది. ఇక తాజాగా కోలుకున్న కేసులలో 76.48 శాతం పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివి కాగా, కేరళలో అత్యధికంగా 4,922 మంది కోవిడ్ బారినుంచి బయటపడ్డారు. మహారాష్ట్ర (2,828), ఛత్తీస్‌గఢ్ (1,651 ) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తాజా నిర్ధారిత కేసులలో కేసులలో 79.05 శాతం పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే. ఆ మేరకు 24 గంటల్లో కేరళలో 5,615, మహారాష్ట్రలో 3,160, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 1,021 వంతున కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక దేశమంతటా గత 24 గంటల్లో నమోదైన 264 మరణాల్లో 73.48 శాతం పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివివే. వీటిలో మహారాష్ట్ర వాటా 24.24 శాతం (64) కాగా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 25మంది, కేరళలో 24 మంది వంతున ప్రాణాలు కోల్పోయారు. కాగా, యూకేలో తొలి పరివర్తిత వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో భారతదేశంలో దీనిబారిన పడినవారి సంఖ్య నేడు 71కి చేరింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1686476

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ-బ్రిటన్ ప్రధాని మాననీయ బోరిస్ జాన్సన్ మధ్య టెలిఫోన్ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న బ్రిటన్ ప్రధాని మాననీయ బోరిస్ జాన్సన్‌తో ఫోన్ ద్వారా సంభాషించారు. రానున్న గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా తనను ఆహ్వానించినందుకు ఈ సందర్భంగా జాన్సన్ తన కృతజ్ఞతను పునరుద్ఘాటించారు. అయితే, తమ దేశంలో కోవిడ్-19 పరిస్థితులవల్ల హాజరుకాలేకపోతున్నట్లు విచారం వ్యక్తం చేశారు. కాగా, బ్రిట‌న్‌లో ప్రత్యేక పరిస్థితులను తాను అర్థం చేసుకోగలనని, మహమ్మారిని త్వరగా నియంత్రించగలరన్న ఆశాభావం వ్యక్తంచేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కోవిడ్-19 వ్యాక్సిన్లను ప్రపంచానికి అందుబాటులో ఉంచడంసహా వివిధ అంశాలపై రెండు దేశాల సహకారాన్ని ఈ సందర్భంగా దేశాధినేతలు సమీక్షించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1686437

ఫ‌రీదాబాద్‌లోని డీబీటీ-టీహెచ్ఎస్టీఐలో సీఈపీఐ కేంద్రీకృత నెట్ వర్క్ ప్రయోగశాలను వర్చువల్ వేదికద్వారా ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్

కేంద్ర శాస్త్ర-సాంకేతిక, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ, భూ విజ్ఞాన‌ శాస్త్రాల శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిన్న ఫ‌రీదాబాద్‌లోని ‘‘ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌’’ (THSTI)లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోని ఏడు లేబొరేటరీలలో ఒకటైన ‘‘సెంట్రలైజ్డ్ నెట్‌వర్క్ ల్యాబ్ ఆఫ్ కోయిలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపరేడ్‌నెస్ ఇన్నోవేషన్స్’’ (సీఈపీఐ)ని న్యూఢిల్లీ నుంచి వర్చువల్ వేదికద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్  మాట్లాడుతూ- కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో పది నెలలుగా ‘డీబీటీ, బిరాక్’ నిర్విరామంగా కృషి చేయడాన్ని ప్రశంసించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1686395

ప్రజారోగ్య సదుపాయాలలో 162 పీఎస్ఏ ప్రత్యేక మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు పీఎం కేర్స్ ఫండ్ ట్రస్ట్నుంచి రూ. 201.58 కోట్లు కేటాయింపు

దేశంలోని ప్ర‌జారోగ్య కేంద్రాల్లో అద‌నంగా 162 ప్ర‌త్యేక ప్రెజ‌ర్ స్వింగ్ అబ్జార్ప్ష‌న్ (పీఎస్ఎ) మెడిక‌ల్ ఆక్సిజ‌న్ త‌యారీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘‘ప్ర‌ధాన‌మంత్రి అత్య‌వ‌స‌ర పౌర ‌స‌హాయ‌-ఉప‌శ‌మ‌న నిధి (పీఎం కేర్స్‌)’’ ట్ర‌స్టు  రూ.201.58 కోట్లు కేటాయించ‌నుంది. ఇందులో సెంట్ర‌ల్ మెడిక‌ల్ స‌ప్ల‌య్ స్టోర్ (సిఎమ్ఎస్ఎస్‌) ప్లాంట్ల స‌ర‌ఫ‌రా-ప్రారంభం, కార్య‌క‌లాపాలకు శ్రీకారంసహా నిర్వ‌హ‌ణ రుసుముల‌కు సంబంధించిన రూ.137.33 కోట్లు, వార్షిక మరమ్మతు ఒప్పందం సంబంధిత రూ.64. 25 కోట్లు కూడా భాగంగా ఉంటాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1686391

శాస్త్ర-సాంకేతిక విజ్ఞానం, ప‌రిశ్ర‌మ రంగాల్లో విలువ‌ సృష్టి ప్ర‌క్రియ‌ను ప‌టిష్ఠం చేయాలని వైజ్ఞానిక స‌మాజానికి ప్ర‌ధానమంత్రి పిలుపు

భారీ సృజనాత్మకత దిశగా విజ్ఞానశాస్త్ర విలువ సృష్టిని మరింత విస్తృతం చేయాలని ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమవారంనాడు వైజ్ఞానిక సమాజానికి పిలుపునిచ్చారు. నేషన‌ల్ మెట్రాల‌జీ కాన్‌క్లేవ్-2021లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సంద‌ర్భంగా దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా  ‘నేషన‌ల్ అటమిక్ టైమ్ స్కేల్’ను, ‘భార‌తీయ నిర్దేశ‌క ద్ర‌వ్య ప్ర‌ణాళికను జాతికి అంకితం చేశారు. అలాగే జాతీయ పర్యావరణ ప్రమాణాల ప్రయోగశాలకు శంకుస్థాప‌న చేశారు. చ‌రిత్ర ప‌రంగా ఏ దేశమైనా విజ్ఞానశాస్త్రాన్ని ప్రోత్స‌హించ‌డంలో చేసిన కృషికి తగినట్లుగానే ప్ర‌త్య‌క్ష ఫ‌లితాలను అందుకోగలిగిందని ప్ర‌ధానమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. దీన్నే శాస్త్ర-సాంకేతిక విజ్ఞానం, ప‌రిశ్ర‌మ రంగాల్లో విలువ సృష్టి ప్ర‌క్రియగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1685996

సీరమ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థల టీకాలకు ఆమోదం లభించడంపై జాతికి ప్రధానమంత్రి అభినందనలు

సీరమ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థల టీకాలకు డీసీజీఐ ఆమోదం లభించడాన్ని కరోనాపై ఉత్తేజపూరిత పోరును బలోపేతం చేయడంలో నిర్ణయాత్మక మలుపుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభివర్ణించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా వరుస సందేశాల్లో పేర్కొన్నారు. ఈ రెండు సంస్థల టీకాలకు డీసీజీఐ అనుమతి ఇవ్వడంవల్ల ఆరోగ్యకర, కోవిడ్ రహిత భారతదేశానికి బాటలుపరిచే ప్రక్రియ వేగం పుంజుకోగలదని పేర్కొన్నారు. ఈ దిశగా మన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు నిరంతరం, నిర్విరామంగా శ్రమించారంటూ అభినందనలు తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1685785

రాజ్‌కోట్‌లో ‘ఎయిమ్స్’ నిర్మాణానికి ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న‌

గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో ‘ఎయిమ్స్’ నిర్మాణానికి ప్రధానమంత్రి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత గురువారం దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ- మానవాళిని కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన లక్షలాది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య సిబ్బందిసహా ముందువరుసలోని కరోనా యోధుల కృషిని గుర్తుచేస్తూ వారిని కొనియాడారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1685066

గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో ఎయిమ్స్నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1685337

విజ్ఞాన‌శాస్త్ర రంగంలో భారతీయ కోవిడ్ టీకా గొప్ప ముందంజ: ఉప రాష్ట్రపతి

మానవాళికి ఎనలేని ఉపకారం చేయగల రెండు భారతీయ కోవిడ్ టీకాల అత్యవసర వాడకానికి ఆమోదం లభించడం భారత విజ్ఞానశాస్త్ర రంగం ముందంజకు నిదర్శనమని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ శ్రీ ఎం.వెంకయ్య నాయుడు కొనియాడారు. సోమవారం సామాజిక మాధ్యమాలద్వారా సందేశంలో భాగంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఆత్మనిర్భర భారత్ కేవలం భారతీయులకు మాత్రమేగాక విస్తృత మానవాళికి ఏ మేరకు ప్రయోజనం చేకూర్చగలదో చెప్పడానికి ఇదొక తిరుగులేని ఉదాహరణగా ఆయన అభివర్ణించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1685954

కోవిడ్-19 టీకాలిచ్చే ప్రక్రియకు సంసిద్ధం కావాలని 2021 జనవరి 2న  నమూనా టీకా ప్రక్రియ నిర్వహించిన రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్నతస్థాయి భేటీలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ఆదేశం

దేశవ్యాప్తంగా కోవిడ్-19 టీకాల ప్రక్రియకు సంసిద్ధత దిశగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థ సన్నాహాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ గురువారం దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సంబంధిత అధికారవర్గాలతో తన అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో కోవిడ్-19 టీకాల నమూనా ప్రక్రియను సమీక్షించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1685094

కోవిడ్-19 వైరస్ టీకాకు పరిమిత అత్యవసర ఆమోదంపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) పత్రికా ప్రకటన

సీరమ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థల కోవిడ్-19 వైరస్ టీకాలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నిపుణుల కమిటీ (సీడీఎస్సీవో) 2021 జనవరి 1న సమావేశమైంది. అన్ని అంశాలపై సమీక్షించిన తర్వాతే అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగానికి ఆమోదం తెలుపుతూ సిఫారసు చేసింది. దీంతోపాటు కాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ టీకా మూడోదశ ప్రయోగ పరీక్షలకు అనుమతి మంజూరు చేసింది. ఈ కమిటీలో పల్మనాలజీ, ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, పీడియాట్రిక్స్, ఇంటర్నల్ మెడిసిన్ తదితర రంగాలకు చెందిన ప్రత్యేక నిపుణులు సభ్యులుగా ఉన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1685784

దేశీయ వైద్య పరికరాల పరిశ్రమ 2020లో కోవిడ్-19 సవాలును ఎదుర్కొనే దిశగా పరిస్థితులను ఎలా ‘స్వీకరించి... పరిణామం చెంది... విస్తృతం కాగలిగిందంటే...

దేశీయ వైద్య ప‌రిక‌రాల రంగం 2020లో అద్భుత విజయాలు అందుకుంది. మహమ్మారి వ్యాప్తి ప్రారంభ దశలో మన దేశం వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కుల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడింది. వాస్తవానికి మహమ్మారిపై పోరుకు కీలకమైన ఈ ఉత్పత్తులకు అప్పట్లో ప్రామాణిక నిర్దిష్టతలేవీ లేవు. అయితే, మహమ్మారి తొలి దశలోనే దీని సవాళ్లను కేంద్ర ప్రభుత్వం ఎంతో ముందుగా గుర్తించింది. తదనుగుణంగా దేశమంతటా అత్యవసర వైద్య పరికరాల లభ్యత-సరఫరాలకు భరోసా ఇవ్వడంలో విజయం సాధించింది. కాగా, 2020 ఫిబ్రవరి-మార్చి మధ్య మన దేశంలో వెంటిలేటర్ సగటు ధర రూ.15 లక్షలు అయినప్పటికీ దాదాపు అన్నీ దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. కానీ, ఆ తర్వాత దేశీయ పరిశ్రమల రంగం వెంటిలేటర్ల తయారీ చేపట్టడంతో నేడు సగటు ధర రూ.2 నుంచి 10 లక్షల స్థాయికి దిగివచ్చింది. ఆ మేరకు గత 9 నెలల్లో, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు 36,433 వెంటిలేటర్లను పంపిణీ చేయగలమని మంత్రిత్వశాఖ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 12 నెలల్లోనే 36,433 'మేక్ ఇన్ ఇండియా' వెంటిలేటర్లు సరఫరా చేయబడ్డాయి. అదేవిధంగా పీపీఈ కిట్లకు సంబంధించి మార్చిలో ఒక చిన్న సంస్థ స్థాయి నుంచి భారత్ ఇవాళ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద తయారీదారుగా అవతరించింది. దీంతో రోజుకు 10 లక్షలకుపైగా పీపీఈ కవరాల్స్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తోంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1685273

డీబీటీ-బిరాక్ తోడ్పాటుగల జైడస్ కాడిలా ప్రతిపాదిత తొలి దేశీయ డీఎన్ఏ టీకా మూడో దశ ప్రయోగ పరీక్షలకు అనుమతి

డీబీటీ-బిరాక్ తోడ్పాటుగల జైడస్ కాడిలా ప్రతిపాదిత తొలి దేశీయ కోవిడ్-19 డీఎన్ఏ టీకా ‘‘జైకోవ్-డి’’ మూడో దశ ప్రయోగ పరీక్షలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజఐ) అనుమతి ఇచ్చింది. ఈ టీకా తొలి, మలిదశ ప్రయోగ పరీక్షలలో దేశవ్యాప్తంగా 1,000 మందికిపైగా పాలుపంచుకున్నారు. దీనిపై మధ్యంతర ఫలితాల సారాంశాన్ని సమీక్షించిన నిపుణుల కమిటీ సిఫారసు మేరకు మూడో దశలో 26,000 మందితో పరీక్షల నిర్వహణకు ఆమోదం లభించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1685908

 

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • కేరళ: కోవిడ్ టీకా పంపిణీలో రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. దీనికి సంబంధించి రాష్ట్రం నాలుగు కారణాలను పేర్కొంది. ‘‘తీవ్రతను ఆలస్యం చేయడం’’ద్వారా 8 నెలలుగా కరోనా వ్యాప్తిని అదుపులో ఉంచగలిగామని తెలిపింది. అయితే, ముఖ్యంగా రెండు నెలలనుంచీ కేసులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో టీకా పంపిణీ సందర్భంగా రాష్ట్రానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది.
  • తమిళనాడు: రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం 8,22,370 కేసులు నమోదవగా 12,177 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 7808 చురుకైన కేసులుండగా, 8,02,385 మంది డిశ్చార్జి అయ్యారు.
  • కర్ణాటక: రాష్ట్రంలో తొలిదశ టీకాల పంపిణీలో 3,57,313 మంది ఆరోగ్య కార్యకర్తలకు వేస్తామని, మొత్తంమీద 28,427 పంపిణీ కేంద్రాలు ప్రారంభిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ తెలిపారు. కోవిడ్ టీకా కోసం రాష్ట్రం సిద్ధంగా ఉందని, శనివారం నమూనా కసరత్తును విజయవంతంగా నిర్వహించామని ఆయన చెప్పారు.
  • ఆంధ్రప్రదేశ్: కోవిడ్ పరీక్షలకు సంబంధించి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ల ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అన్ని ఛార్జీలుసహా కిట్‌కు రూ.230 మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. కాగా, కోవిడ్-19 టీకాల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభించాలి, తొలి దశలో రాష్ట్రానికి ఎన్ని మోతాదులు అందుబాటులోకి వస్తాయనే అంశాలపై కేంద్రం నుంచి సమాచారం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు.
  • తెలంగాణ: కోవిడ్-19 వ్యాప్తి మొదలయ్యాక తెలంగాణలో ప్రస్తుతం రోజువారీ కేసుల నమోదు సగటు ప్రస్తుతం తగ్గింది. ఈ మేరకు జనవరి 5నాటికి రాష్ట్రంలో నిర్ధారిత కేసుల సగటు 0.6 శాతానికి పతనమైంది. కాగా, 2020 మార్చిలో కేసుల నమోదు సగటు 8.92 శాతంగా ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. ఇది జూన్‌లో గరిష్ఠ స్థాయికి చేరగా, డిసెంబరు 31, ఈ ఏడాది జనవరి 1 నాటికి రాష్ట్రంలో 1,000 టీకా నమూనా ప్రక్రియలను నిర్వహించారు. తెలంగాణలో నమోదైన మొత్తం కేసులు: 2,88,410 కాగా, ప్రస్తుతం చురుకైన కేసులు: 4982, మరణాలు 1556గా ఉన్నాయి. ఇక 97.73 శాతం కోలుకునే సగటుతో 2,81,872 మంది డిశ్చార్జి అయ్యారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో మంగళవారం నాటికి 18,50,189 మంది కోవిడ్-19 రోగులు సంపూర్ణంగా కోలుకోవడంతో మహారాష్ట్రలో కోలుకునే కేసుల సగటు 94.87 శాతానికి దూసుకెళ్లింది. కాగా, ఇదేరోజున రాఊంలో 3,160 కొత్త కేసులు, 64 మరణాలు నమోదవగా మరణాల సగటు 2.55 శాతంగా ఉంది. ముంబై సర్కిల్‌లో మంగళవారం 1085 కొత్త కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి, పూణె సర్కిల్‌లో 635 కొత్త కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి.
  • గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 655 కొత్త కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కోలుకునేవారి సగటు మరింత మెరుగుపడి 94.71 శాతానికి చేరింది. గుజరాత్‌లో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 2,48,581 కాగా, నేటివరకూ 2,35,426 మంది కోలుకున్నారు. ఈ మేరకు గత 24 గంటల్లో 868 మంది కోవిడ్ బారినుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీల కేసులు 8,830గా ఉన్నాయి. మరోవైపు ఆరోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా టీకాల నమూనా ప్రక్రియ నిర్వహణ అనంతరం వాస్తవ టీకాల కార్యక్రమానికి సన్నద్ధమవుతోంది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కొత్త కేసులకన్నా కోలుకునే కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ మేరకు నిర్ధారిత కేసుల సగటు 2.5 శాతానికి దిగివచ్చింది. మధ్యప్రదేశ్ రాఊంలో మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 2,45,368 కాగా, గత 24 గంటల్లో 14 మంది మరణించడంతో మృతుల సంఖ్య 3662కు పెరిగింది. ప్రస్తుతం 8,427 క్రియాశీల కేసులుండగా, ఇప్పటిదాకా 2,33,229 మంది కోలుకున్నారు.
  • ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో మంగళవారం మొత్తం 1021 కొత్త కేసులు నమోదవగా, ఒక్క రాయ్‌పూర్ జిల్లాలోనే గరిష్టంగా 231 ఉన్నాయి. మంగళవారం 1492 కోలుకోగా, క్రియాశీల కేసులు 9111గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2,71,988కి చేరింది. కాగా, రాష్ట్రంలో టీకాలిచ్చే ప్రక్రియకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో జనవరి 5నాటికి కోలుకున్న కేసుల సంఖ్య 3 లక్షల స్థాయిని దాటింది. కొత్త సంవత్సరం తొలి 5 రోజుల్లో 4,139 మంది కోలుకోగా, 2,432 కొత్త కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌లో 40,180 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, 58,889మంది కోలుకున్నారు. పాఠశాలలు, కళాశాలలు మరియు కోచింగ్ కేంద్రాలతో సహా అన్ని విద్యాసంస్థలను జనవరి 18 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • గోవా: మంగళవారం 80 కొత్త కేసులు నమోదవగా 1 మరణం సంభవించింది. కాగా, గోవాలో మొత్తం కేసుల సంఖ్య 51,415కు పెరగ్గా, ఇప్పటిదాకా 744 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 860 క్రియాశీల కేసులు ఉండగా కోలుకునేవారి సగటు 96.88 శాతంగా ఉంది. కోవిడ్-19 నిరోధానికి జారీచేసిన మార్గదర్శకాలను పర్యాటకులు, పార్టీలు చేసుకునేవారు ఉల్లంఘించినందున, కొత్త సంవత్సరంలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే శనివారం హెచ్చరించారు.
  • అస్సాం: రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,16,381కి చేరగా, డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 2,12,246గా ఉంది. ప్రస్తుత క్రియాశీల కేసులు 1728కాగా, మృతుల సంఖ్య 1,057గా ఉంది.
  • సిక్కిం: రాష్ట్రంలో ఈ వారం మొత్తం కేసులు 5938కి చేరగా, ఇప్పటిదాకా డిశ్చార్జ్ 5221 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుత క్రియాశీల కేసులు 493కగా, మరణాల సంఖ్య 129గా ఉంది.

 

FACT CHECK

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Image

 

 

 

 

Image

****



(Release ID: 1686710) Visitor Counter : 320