ప్రధాన మంత్రి కార్యాలయం
సార్వజనిక ఆరోగ్య కేంద్రాలలో 162 ప్రత్యేక పిఎస్ఎ మెడికల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటుల స్థాపన కు 201.58 కోట్ల రూపాయలు కేటాయించిన పిఎమ్ కేర్స్ ఫండ్ ట్రస్టు
Posted On:
05 JAN 2021 5:02PM by PIB Hyderabad
దేశం లో సార్వజనిక ఆరోగ్య కేంద్రాల లో అదనం గా 162 ప్రత్యేక ప్రెశర్ స్వింగ్ అబ్ జార్ ప్శన్ (పిఎస్ఎ) మెడికల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటులను ఏర్పాటు చేయడానికి 201.58 కోట్ల రూపాయలను ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ ఎండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్ యుయేశన్స్ (పిఎమ్ కేర్స్) ఫండ్ ట్రస్టు కేటాయిస్తోంది.
- మొత్తం ప్రాజెక్టు వ్యయం లో సెంట్రల్ మెడికల్ సప్లయ్ స్టోర్ (సిఎమ్ఎస్ఎస్) తాలూకు ప్లాంటు ల సరఫరా, కార్యకలాపాల ఆరంభం మరియు నిర్వహణ రుసుములకు సంబంధించిన 137.33 కోట్ల రూపాయలతో పాటు సమగ్ర వార్షిక మరమ్మత్తు ఒప్పందానికి సంబంధించి 64. 25 కోట్ల రూపాయలు కలిసి ఉన్నాయి.
- సేకరణ బాధ్యత ను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ కు చెందిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అయిన సెంట్రల్ మెడికల్ సప్లయ్ స్టోర్ (సిఎమ్ఎస్ఎస్) తాను తీసుకొంటుంది.
- మొత్తం 154.19 ఎమ్‌టి సామర్ధ్యంతో కూడిన 162 ప్లాంటులను 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల (అనుబంధం-1 ని చూడగలరు) లో స్థాపించడం జరుగుతుంది.
- ఈ ప్లాంటులను ఏర్పాటు చేసే ప్రభుత్వ ఆసుపత్రులను, సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను సంప్రదించి, గుర్తించడమైంది.
- ఈ ప్లాంటులకు మొదటి మూడు సంవత్సరాలకు గాను వారంటీ ఉంటుంది. తరువాతి 7 సంవత్సరాల కాలానికి గాను సిఎఎమ్‌సి (కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మెయిన్ టెనెన్స్ కాంట్రాక్టు) అనేది ప్రాజెక్టు లో భాగం గా ఉంటుంది.
- రోజువారీ కార్యకలాపాలు, నిర్వహణ (ఒ & ఎమ్) లను ఆసుపత్రులు/రాష్ట్రాలు తీసుకొంటాయి. సిఎఎమ్‌సి గడువు తీరిపోయిన తరువాత మొత్తం ఒ & ఎమ్ బాధ్యత ను ఆసుపత్రులు/రాష్ట్రాలు స్వీకరిస్తాయి.
- ఈ యంత్రాంగం సార్వజనిక స్వస్థత వ్యవస్థ ను మరింత పటిష్టపరచనుంది. అంతేకాకుండా, వైద్యపరమైన ప్రాణవాయువు అందుబాటు లో వీలైనంత తక్కువ ఖర్చు లో దీర్ఘకాలానికి క్రమేణా పెంచుకుంటూ పోయేందుకు కూడా వీలు ను కల్పిస్తుంది. వివిధ రకాలైన ఇతర వైద్యపరమైన స్థితిగతులకు తోడు ఒక మోస్తరు నుంచి, తీవ్రమైన కోవ కు చెందిన కొవిడ్-19 కేసుల లో తగినంతగాను, అంతరాయాలకు వీలు ఉండని విధం గాను ఆక్సిజన్ ను సరఫరా చేయడమనేది అత్యవసరం గా సమకూర్చుకోవలసిన ముందస్తు ఏర్పాటు. ఇటువంటి పరిస్థితులలో, ప్రజారోగ్య కేంద్రాలలో పిఎస్ఎ ఆక్సిజన్ కన్‌సెంటేటర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం, నిలవ మరియు సరఫరా వ్యవస్థ పై ఆ ఆరోగ్య కేంద్రం ఆధారపడడాన్ని తగ్గించే ఒక ముఖ్యమైన చర్య అని చెప్పాలి. అంతేకాకుండా, ఈ కేంద్రాలు వాటి సొంత ప్రాణవాయువు ఉత్పత్తి సామర్ధ్యాన్ని సంతరించుకొనేటట్లు చేయడం అని కూడా చెప్పవచ్చు. ఇది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం మీద ఆక్సిజన్ లభ్యత రాశి ని పెంచడం మాత్రమే కాకుండా ఆయా సార్వజనిక ఆరోగ్య కేంద్రాలలోని రోగులకు ప్రాణవాయువు తాలూకు మద్దతు ను సకాలం లో సమకూర్చడానికి కూడా మార్గాన్ని సుగమం చేస్తుంది.
అనుబంధం- 1
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం వారీగా పిఎస్ఎ ఒ2 కాన్ సెంటేటర్ ప్లాంటుల పంపిణీ వివరాలు
వరుస సంఖ్య
|
రాష్ట్రం /కేంద్రపాలిత ప్రాంతం పేరు
|
పిఎస్ఎ ఒ2 కాన్ సెంట్రేటర్ ప్లాంటు ల మొత్తం సంఖ్య
|
1
|
అసమ్
|
6
|
2
|
మిజోరమ్
|
1
|
3
|
మేఘాలయ
|
3
|
4
|
మణిపుర్
|
3
|
5
|
నాగాలాండ్
|
3
|
6
|
సిక్కిమ్
|
1
|
7
|
త్రిపుర
|
2
|
8
|
ఉత్తరాఖండ్
|
7
|
9
|
హిమాచల్ ప్రదేశ్
|
7
|
10
|
లక్షద్వీప్
|
2
|
11
|
చండీగఢ్
|
3
|
12
|
పుదుచ్చేరీ
|
6
|
13
|
దిల్లీ
|
8
|
14
|
లద్దాఖ్
|
3
|
15
|
జమ్ము & కశ్మీర్
|
6
|
16
|
బిహార్
|
5
|
17
|
ఛత్తీస్ గఢ్
|
4
|
18
|
మధ్య ప్రదేశ్
|
8
|
19
|
మహారాష్ట్ర
|
10
|
20
|
ఒడిశా
|
7
|
21
|
ఉత్తర్ ప్రదేశ్
|
14
|
22
|
పశ్చిమ బంగాల్
|
5
|
23
|
ఆంధ్ర ప్రదేశ్
|
5
|
24
|
హరియాణా
|
6
|
25
|
గోవా
|
2
|
26
|
పంజాబ్
|
3
|
27
|
రాజస్థాన్
|
4
|
28
|
ఝార్ ఖండ్
|
4
|
29
|
గుజరాత్
|
8
|
30
|
తెలంగాణ
|
5
|
31
|
కేరళ
|
5
|
32
|
కర్నాటక
|
6
|
|
మొత్తం
|
162
|
గమనిక: మిగిలిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి పిఎస్ఎ ఆవశ్యకతలను గురించి తెలియజేయవలసి ఉంది.
***
(Release ID: 1686391)
Visitor Counter : 333
Read this release in:
Odia
,
Marathi
,
Malayalam
,
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada