శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

బయోటెక్నాలజీ శాఖ పరిధిలో కేంద్రీయ వ్యవస్థీకృత లేబరేటరీ

వర్చువల్ పద్ధతిలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ చేతుల మీదుగా ప్రారంభం

ప్రపంచంలోని 7 ప్రత్యేక తరహా లేబరీటరీల్లో ఇదీ ఒకటి

కోవిడ్-19 పరిష్కార మార్గాలపై ఇ-బుక్ కూడా ఆవిష్కరణ

బయోటెక్నాలజీ శాఖ భాగస్వామ్యంతో విశాఖపట్నం, ఎ.ఎం.టి.జెడ్., కోటి వ్యాధినిర్ధారణ కిట్లను ఉత్పత్తి చేసినట్టు ప్రకటన,

Posted On: 05 JAN 2021 5:27PM by PIB Hyderabad

   అంటువ్యాధులపై, చికిత్స, సృజనాత్మక సన్నద్థతకు సంబంధించిన కేంద్రీయ వ్యవస్థీకృత పరిశోధనాగారాన్ని (సెపీ-సి.ఇ.పి.ఐ.ని) కేంద్ర సైన్స్ టెక్నాలజీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమం, భూగోళ శాస్త్రాల అధ్యయన శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ న్యూఢిల్లీనుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఫరీదాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ లేబరేటరీని,.. ప్రపంచంలోని ఇలాంటి 7 లేబరేటరీల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు.  ఫరీదాబాద్ లో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ (డి.బి.టి.) పరిధిలో పనిచేసే ట్రాన్స్.లేషనల్ హెల్త్ సైన్స్ టెక్నాలజీ ఇన్.స్టిట్యూట్ (టి.హెచ్.ఎస్.టి.ఐ.) ఆవరణలో ఈ లేబరేటరీని ఏర్పాటు చేశారు. నేషనల్ అక్రెడీషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ (ఎన్.ఎ.బి.ఎల్.) నుంచి ఈ సంస్థకు గుర్తింపు (ఐ.ఎస్.ఒ. 17025:2017) కూడా ఉంది.

 

https://ci4.googleusercontent.com/proxy/noFyt8fzkqRqfDihVbSeCQ9rei1uR0sfqS7bOVF_6pF3YMSlIv1SHAB9PlkwMMQsdTGrmJL1cVeP6exnKSn_4I67xzGmcvxFl081wmTWxVcEP1iwR0jgEnckhw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003FDCL.jpghttps://ci3.googleusercontent.com/proxy/Mn_GiThTilx3WtxkLvYMA8dNb1kuRfbMmdrVWGmE0cePJE1S2X-MnRFHJpTxm8QXvsK4Fube3Yw2u_W9CRQZxVmZzGPOuOzRcjEao3y7FONKZ-fTZrOa0yrJfQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00422OI.jpghttps://ci5.googleusercontent.com/proxy/K6P89Jq28t8pA2ERFSAyqLl5NCsVydvs0iMUZGej2B8NRihYk9R7Rd5u9Yhb0sQOtN4hRgoYSutPXtJsWuXmzjFQqCfcpEql-IR2u34BTwCDtfAuqWvuZkiFWg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005GNJ2.jpg

 

   డి.బి.టి. కార్యదర్శి డాక్టర్ రేణూ సావంత్; డి.బి.టి. సంయుక్త కార్యదర్శి, భారత్ ఇమ్యూనలాజికల్, బయలాజికల్ కార్పొరేషన్ (బి.ఐ.బి.సి.ఒ.ఎల్.) మేనేజింగ్ డైరెక్టర్ చంద్రప్రకాశ్ గోయెల్; అదనపు కార్యదర్శి, ఆర్థిక సలహాదారు విశ్వజిత్ సహాయ్; డి.బి.టి. సలహాదారు ఆల్కా శర్మ; టి.హెచ్.ఎస్.టి.ఐ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆఫీసర్ ఇన్ చార్జి, ఎన్.ఐ.ఎబి. డైరెక్టర్ డాక్టర్ సుబీర్ ఎస్. మజుందార్;  విశాఖపట్నానికి చెందిన ఆంధ్రా మెడ్ టెక్ జోన్ (ఎ.ఎం.టి.జెడ్.) మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జితేంద్ర శర్మ;  డి.బి.టి.కి చెందిన సైంటిస్ట్ ‘ఇ’, డాక్టర్ జ్యోతి లగానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు ఆన్ లైన్ ద్వారా పాలుపంచుకున్నారు.  

ఈ సందర్భంగా కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, కోవిడ్ వైరస్ పై పోరాటంలో పటిష్టమైన నిరోధక చర్యల రూపకల్పనలో గత 10 నెలలుగా అవిశ్రాంతంగా కృషి చేసిన బయోటెక్నాలజీ శాఖ, బయెటెక్నాలజీ పరిశ్రమ పరిశోధనా మండలి (బిరాక్-బి.ఐ.ఆర్.ఎ.సి.) సిబ్బందికి అభినందనలు తెలిపారు. కోవిడ్ నిరోధక వ్యాక్సీన్ తయారీ దిశగా నాణ్యమైన సేవలందించడంలో, వాటిని ప్రపంచ స్థాయిలో ఆమోదయోగ్యంగా తీర్చిదిద్దడంలో సి.ఇ.పి.ఐ. లేబరేటరీ అదనపు సదుపాయం అవుతుందన్నారు. బయోటెక్నాలజీ శాఖ (డి.బి.టి.) భాగస్వామ్యంతో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడ్ టెక్ జోన్ (ఎ.ఎం.టి.జెడ్.) కోటికిపైగా వ్యాధినిర్ధారణ కిట్లను తయారు చేసిందని కేంద్రమంత్రి ప్రకటించారు.

  ప్రపంచ స్థాయి కోవిడ్ కిట్లను, సంబంధిత ఉత్పాదనలకు సంబంధించి దేశాన్ని దిగుమతిదారునుంచి ఎగుమతిదారుగా తీర్చిదిద్దడంలో భారతీయ శాస్త్రవేత్తలు గణనీయమైన సేవలందించారని,  గతఏడాది ఎంతో కష్టకాలంలో కూడా వారీ ఘనతను సాధించారని అన్నారు. కోవిడ్ మహమ్మారిపై సమైక్య పోరాటంలో శాస్త్రవేత్తలు, ముందువరుసలోని కోవిడ్ యుద్ధవీరులు, సాధారణ ప్రజలు నిర్వహించిన పాత్ర ఎంతో గణనీయమైనదన్నారు. “కోవిడ్-19కు వ్యాక్సీన్లను రూపొందించడంలో ఈ రోజు దేశం ముందువరుసలో ఉందని” అన్నారు. “30 వ్యాక్సీన్లలో రెండింటింటి వినియోగానికి ఇప్పటికే ఔషధ నియంత్రణ సంస్థ ఆమోద ముద్ర వేసిందని” అన్నారు.  మిగతా వాటికి ఆమోదం వివిధ దశల్లో ఉందని అన్నారు.

    భవిష్యత్తులో అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించడమే లక్ష్యంగా సి.ఇ.పి.ఐ. లేబరేటరీ అనేది ఒక సృజనాత్మక చర్య.  ప్రజలు, ప్రైవేటు సంస్థలు, ధర్మ వితరణ సంస్థలు, పౌర సంస్థల మధ్య సహకార భాగస్వామ్యంతో ఇది రూపొందింది. 2017లో దావోస్ లో ఈ ప్రయత్నానికి పునాది పడింది.  భారతదేశంలో సి.ఇ.పి.ఐ. లేబరేటరీకి కేంద్ర సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ శాఖ తగిన మద్దతు ఇస్తోంది. సత్వరం వ్యాక్సీన్ రూపకల్పన ద్వారా, అంటువ్యాధులపై, చికిత్సకు, సృజనాత్మక సన్నద్థతకు ఈ లేబరేటరీ దోహదం చేస్తోంది. అటువ్యాధుల నిరోధంకోసం ప్రజారోగ్య వ్యవస్థ సమన్వయంతో సన్నద్ధం కావడానికి కూడా ఇది దోహదపడుతోంది. ప్రమాణబద్ధమైన విశ్లేషణ ద్వారా కొత్త కోవిడ్-19 వ్యాక్సీన్ల సామర్థ్యాన్ని నిర్ధారించడం, తయారైన వ్యాక్సీన్.కు ప్రపంచ స్థాయి ఆమోదం, ప్రపంచ వ్యాప్త వినియోగానికి అవకాశం లభించేలా చూడటంపై ప్రస్తుతం ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.

  కొత్తగా ఏర్పాటైన కేంద్రీయ వ్యవస్థీకృత పరిశోధనాగారం పరిధిలోకి ఎంపికైన పరీక్షా కేంద్రాలు: నెక్సెలిస్ (కెనడా), ప్రజారోగ్య శాఖ, ఇంగ్లండ్, విస్ మెడెరీస్రీ (ఇటలీ), విరో క్లినిక్స్ బయోసైన్సెస్ బి.వి (నెదర్లాండ్స్), క్యు-2 సొల్యూషన్స్ (అమెరికా), అంతర్జాతీయ విరేచన వ్యాధి పరిశోధనా కేంద్రం  (బంగ్లాదేశ్), నేషనల్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ (యు.కె.),  ట్రాన్స్.లేషనల్ హెల్త్ సైన్సెస్, టెక్నలాజికల్ ఇన్.స్టిట్యూట్ (భారత్). ఈ కేంద్రీయ వ్యవస్థీకృత లేబరేటరీలకోసం కోటీ 60లక్షల అమెరికన్ డాలర్ల వ్యయానికి సి.ఇ.పి.ఐ. నెట్ వర్క్ ఆమోదించింది. కోవిడ్ వ్యాక్సీన్లను రూపొందించేవారంతా,  ప్రయోగదశలోని తమ వ్యాక్సీన్ వ్యాధినిరోధక సామర్థ్యం నిర్ధారణకోసం ఈ లేబరేటరీల వ్యవస్థను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

   కోవిడ్-19 వైరస్ కు పరిష్కార విధానాలపై సైన్స్,టెక్నాలజీ శాఖ తయారు చేసిన ఇ-బుక్ ను కూడా డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. వైరస్ మహమ్మారి వ్యాప్తి నిరోధానికి బయోటెక్నాలజీ శాఖ తీసుకున్న చర్యలను ఇ-బుక్ లో పొందుపరిచారు. స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సీన్.కు తయారీ నుంచి సంప్రదాయ విజ్ఞానం ప్రాతిపదికగా వ్యాధి నిర్ధారణ సూత్రాల రూపకల్పన వరకూ అన్ని కార్యకలాపాలపై బయోటెక్నాలజీ శాఖ తన దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసేందుకు తగిన సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. కోవిడ్ నిరోధానికి బయోటెక్నాలజీ శాఖ సహాయంతో రూపుదిద్దుకున్న కార్యకలాపాలను కూడా ఇ-బుక్ తెలియజేస్తుంది.

నేపథ్య సమాచార వివరాలకోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి:

 

****(Release ID: 1686395) Visitor Counter : 321