PIB Headquarters

కోవిడ్ -19 మీద పిఐబి రోజువారీ బులిటెన్

Posted On: 11 DEC 2020 5:51PM by PIB Hyderabad

Coat of arms of India PNG images free download

(కోవిడ్ కి సంబంధించి గత 24 గంటలలో జారీచేసిన పత్రికాప్రకటనలు, పిఐబి క్షేత్రస్థాయి అధికారులు సమాచారం, పిఐబి చేపట్టిన నిజనిర్థారణ ఇందులో ఉంటాయి)

  • భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గి నేడు 3.63 లక్షలకు ( 3,63,749) తగ్గుదల
  • గత 24 గంటలలో కోలుకొని డిశ్చార్జ్ అయినవారు 37,528 మంది కాగా, తాజాగా నిర్థారణ జరిగిన కేసులు 29,398  
  • కోలుకున్నవారి శాతం మరింత మెరుగుపడి నేడు 94.84% కు చేరిక
  • గత 24 గంటలలో మొత్తం 414 కోవిడ్ మరణాలు నమోదు

#Unite2FightCorona

#IndiaFightsCorona

Image

మరో చరిత్రాత్మక సాధన: 146 రోజుల తరువాత చికిత్సలో ఉన్నవారి సంఖ్య 3.63 లక్షలకు తగ్గుదల ;

రోజువారీ కొత్త కేసుల సంఖ్య 30 వేలకు లోపే 

భారతదేశంలో మొత్తం చికిత్సలో ఉన్నవారి సంఖ్య గణనీయంగా పడిపోతూ ఉంది. ప్రస్తుతం సుమారు 3.63 లక్షలకు దగ్గర్లో 3,63,749 గా నమోదైంది. ఇది 146 రోజుల తరువాత ఇంత తక్కువ స్థాయికి చేరింది.  2020 జులై 18న చికిత్సలో ఉన్నవారి సంఖ్య  3,58,692 గా నమోదైంది.  దేశంలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య స్థిరంగా తగ్గుతూ వస్తోంది.  భారత్ లో ఇప్పుడు ఇంకా చికిత్సలో ఉన్నవారు దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో  3.71%  మాత్రమే. గత 24 గంటలలో 37,528 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీనివల్ల మొత్తం చికిత్సలో ఉన్నవారి సంఖ్య  8,544 మేరకు తగ్గింది. భారతదేశంలో రోజువారీ కొత్త కేసులు 30,000 లోపు ఉంటున్నాయి. గడిచిన 24 గంటలలో కొత్త కేసులు 29,398 నమోదయ్యాయి. ఇప్పటివరకు కోవిడ్ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 93  లక్షలకు దగ్గరవుతూ 92,90,834 గా తేలింది. కోలుకున్నవారికి, ఇంకా చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం అది 89 లక్షలు దాటి  89,27,085కు చేరింది.  కొత్తగా వస్తున్న కేసులకు, కొత్తగా నమోదైన కోలుకున్నవారికి మధ్య తేడా క్రమంగా పెరుగుతూ ఉండటంతో కోలుకున్నవారి శాతం  మెరుగుపడుతూ నేడు 94.84% అయింది. కొత్తగా కోలుకున్నవారిలో 79.90% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్టు తేలింది. కర్నాటకలో అత్యధికంగా ఒక్క రోజులో 5,076 మంది కోలుకోగా మహారాష్ట్రలో 5,068 మంది, కేరళలో 4,847 మంది కోలుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. గత వారం రోజులలో సగటున రోజువారీ కోలుకున్నవారి సంఖ్యను ఈ చిత్రపటం చూపుతోంది. సగటున రోజుకు మహారాష్ట్రలో అత్యధికంగా  6,703  మంది కోలుకోగా, ఆతరువాత స్థానాల్లో  కేరళ  (5,173(, ఢిల్లీ (4,362) ఉన్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 72.39%  మంది 10 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. కేరళలో అత్యధికంగా 4,470 కొత్త కేసులు రాగా మహారాష్ట్రలో 3,824 కేసులు నమోదయ్యాయి.. గడిచిన 24 గంటలలో 414 మరణాలు నమోదయ్యాయి. అందులో  79.95% మరణాలు పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. గరిష్ఠంగా మహారాష్ట్రలో  70 మంది చనిపోగా ఢిల్లీలో 61 మంది, పశ్చిమ బెంగాల్ లో 49 మంది చనిపోయారు.                                                                                                                                   

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679971

దక్షిణాసియాలో టీకాలపై ప్రపంచ బ్యాంక్ అంతర్ మంత్రిత్వశాఖల సమావేశంలో ప్రసంగించిన డాక్టర్ హర్ష వర్ధన్

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ నిన్న జరిగిన  దక్షిణాసియా టీకాల ప్రపంచ బ్యాంక్ అంతర్ మంత్రిత్వశాఖల సమావేశంలో డిజిటల్ పద్ధతిలో ప్రసంగించారు. కోవిడ్ సంక్షోభం విషయంలో చురుగ్గా, అప్రమత్తంగా వ్యూహాత్మకంగా భారత దేశం వ్యవహరించిన తీరును ఆయన ఈ సమావేశంలో వివరించారు. సమర్థవంతమైన ప్రణాళిక, వ్యూహాత్మక యాజమాన్యం కారణంగానే భారత దేశం కోవిడ్ కేసుల సంఖ్యను ప్రతి పది లక్షల జనాభాలో 7,078 కి పరిమితం చేసిందని, ప్రపంచ సగటు 8,883 గా నమోదైందని గుర్తు చేశారు.. మరణాల శాతం  భారత్ లో 1.45% ఉందగా అంతర్జాతీయ సగటు 2.29% గా నమోదైందని చెప్పారు. భారతదేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశోధనలు సాగుతున్నాయని, ఇప్పుడు వాక్సిన్ ఉత్పత్తి  సామర్థ్యం పెంపుమీద, పంపిణీమీద దృష్టి సారించామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా  260 రకాల వాక్సిన్లు వివిధ దశాల్లో ఉన్నాయని గుర్తు చేస్తూ అందులో 8 భారత్ లోనే తయారవుతాయన్నారు.

వివరాలకు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679873

భారత్-ఉజ్బెకిస్తాన్ శిఖరాగ్ర సదస్సు వర్చువల్ సమావేశంలో ప్రధాని ప్రారంభోపన్యాసం

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679941

పిఎం స్వనిధి లబ్ధిదారుల సామాజిక, ఆర్థిక సమాచార సేకరణ

పిఎం  స్వనిధి లబ్ధిదారుల సామాజిక ఆర్థిక సమాచారాన్ని సేకరించే కార్యక్రమాన్ని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల ప్రతినిధులు, రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.  దీనికింద పిఎం స్వనిధి లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తారు.  ఈ సమాచారం ఆధారంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను అంచనావేయటం సాధ్యమవుతుంది. ప్రధాని దృక్కోణానికి అనుగుణంగా ఈ సమాచారాన్ని వినియోగిస్తారు. కేవలం వీధి వర్తకులకు రుణాలు ఇవ్వటం మాత్రమే కాకుండా సంపూర్ణ సామాజిక ఆర్థిక అభివ్టృద్ధి దిశగా ప్రణాళికల రూపకల్పనకు ఉపయోగపడుతుంది.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1680030

ఆస్పత్రుల నిర్వహణ సమాచార వ్యవస్థ నమూనా ప్రాజెక్ట్ ప్రారంభించిన భారతీయ రైల్వేలు

భారతీయ రైల్వేలు ఆస్పత్రుల నిర్వహణ సమాచార వ్యవస్థ నమూనా ప్రాజెక్ట్ ను ప్రారంభించాయి.  ఇది రైల్వేల ఆధ్వర్యంలో మరో కీలకమైన ఐటి ప్రాజెక్ట్ అయింది. సిబ్బంది సంక్షేమానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. రైల్ టెల్ కార్పొరేష తో కలిసి ఈ వ్యవస్థను రూపొందించారు. ఆస్పత్రి నిర్వహణలో సింగిల్ విండో విధానానికి ఇది ఉపయోగపడుతుంది. చికిత్స, వ్యాధి నిర్థారణ, ఫార్మసీ, పరీక్షలు వంటివి ఒకేచోట పూర్తవుతాయి.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1680110

ఈ-కోర్టుల ప్రాజెక్టు కింద 2927 కోర్టుల అనుసంధానానికి  హై స్పీడ్ వైడ్ ఏరియా నెట్ వర్క్ 

ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా  ఈ-కోర్టుల ప్రాజెక్టు కింద 2927 కోర్టుల అనుసంధానానికి  హై స్పీడ్ వైడ్ ఏరియా నెట్ వర్క్  ఉపయోగిస్తున్నారు. ఇందులో 97.86% లక్ష్యం పూర్తయింది. న్యాయశాఖ, బి ఎస్ ఎన్ ఎల్ ఉమ్మడిగా నిర్విరామంగా చేసిన కృషి వలన ఈ కార్యస్క్రమం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ నెట్ వర్క్ గా భావిస్తున్నారు. ఇప్పటివరకు 2992 కోర్టు సముదాయాలు అనుసంధానమయ్యాయి. ఇందుకోసమ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్, ఆర్ ఎఫ్, వి సాట్ ఉపయోగించుకున్నారు.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1680029

వినియోగదారుల వివాదాల వేగవంతమైన పరిష్కారానికి చర్యలు

దేశంలో అమ్ముడవుతున్న అనేక తేనె బ్రాండ్లు కల్తీవని ఫిర్యాదులు రావటంతో వినియోగదారుల వ్యవహారాల శాఖ రంగంలో దిగింది. కేవలం చక్కెర ద్రావణాన్ని ఉపయోగించి తేనెగా నమ్మించజూస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఇది ఆరోగ్యం మీద ప్రభావం చూపే అంశం కావటం, పైగా ఇది కరోనా సమయం కావటంతో ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వ సూచన మేరకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షస్న్ అథారిటీ రంగంలో దిగింది. ప్రాథమిక పరిశీలన అనంతరం దీన్ని అహార నియంత్రణ సంస్థ అయిన ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ కి అప్పగించగా దర్యాప్తు చేపట్టింది. ఇలా ఉండగా, ఇటీవలే 40 ఏళ్ల వ్యక్తి ఒక మొబైల్ సెంటర్ లో సేవలు నిరాకరించటంతో నిప్పంటించుకున్న ఘటన మీద కూడా  వినియోగదారుల వ్యవహారాల శాఖ దర్యాప్తు చేపట్టి లక్ష రూపాయల పరిహారంతోబాటు కొత్త ఫోన్ ఇప్పించగలిగింది.

వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679764

పిఐబి క్షేత్ర స్థాయి అధికారులు అందించిన సమాచారం

  • మహారాష్ట్ర: గురువారం నాటికి మహారాష్ట్రలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 18,68,172 అయింది. కొత్తగా  3,824 కేసుల నిర్థారణ జరిగింది.  ఒక్క ముంబయ్ నగరంలొనే గత 24 గంటలలో 798 కేసులు వచ్చాయి.  దీంతో ముంబయ్ లో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 2,88,696 అయింది. నగరంలో తాజాగా 13 మరణాలు నమోదు కాగా రాష్ట్రంలో మరణాల సంఖ్య 11,000 కు చేరింది. ప్రస్తుతం 11943 మంది బాధితులు ఇంక చికిత్సలో ఉన్నారు.  
  • గుజరాత్: గుజరాత్ లో గత 24 గంటలలో 1270 కొత్త కరోనా కెసులు నమోదయ్యాయి. గరిష్ఠంగా అహమ్మదాబాద్ లో  278 కేసులు రాగా, సూరత్ లో 196 కొత్త కేసులు వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 13820 మంది కోవిడ్ బాధితులు చికిత్సలో ఉన్నారు. వారిలో 72 మంది వెంటిలేటర్ మీదస్ ఉన్నారు. నిన్న 12 మంది చనిపోవటంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 4135 కి చేరింది. ఇలా ఉండగా, అహమ్మదాబాద్ లో మరో రెండు ప్రాంతాలు మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అందులో ఒక వృద్ధాశ్రమం కూడా ఉంది.
  • రాజస్థాన్: రాజస్థాన్ లో కొత్త కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య 19 వేలకు తగ్గింది. జైపూర్, జోధ్ పూర్ నగరాలలో కూడా కొత్త కేసులు తగ్గాయి. ఈ నెల మొదటి పది రోజులలో రాష్ట్రంలో దాదాపు 19 వేల కొత్త కేసులు వచ్చాయి. అదే సమయంలో దాదాపు 28,500 కేసులు కోలుకున్నట్టు నమోదయ్యాయి.  ఆ సమయంలో రాజధాని జైపూర్  లో సగటున రోజుకు 500 చొప్పున కేసులు కొత్తగా నమోదవుతూ వచ్చాయి.   అదే సమయంలో జోధ్ పూర్ లో సగటున 225 కొత్త కేసులు వచ్చాయి. ఇతర జిల్లాల్లో కూడా కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇలా ఉండగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరిన్ని పరీక్ష లు జరిపి వ్యాధి నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. 
  • మధ్యప్రదేశ్: గురువారం నాడు మధ్య ప్రదేశ్ లో 1,319 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు  2,19,893 కు చేరాయి.ఏడు మరణాలు తాజాగా నమోదయ్యాయి. మొత్తం మరణాలు. 3,373 కు చేరాయి.. 1,307  మంది ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య  2,03,294. కి చేరింది.  కొత్త కేసులు 1,319 లో ఇండోర్ లో 456 భోపాల్ లో 296 నమోదయ్యాయి. ఇండోర్ జిల్లాలో మొత్తం కేసులు 47,427 కాగా మరణాలు 799, భోపాల్ లో మొత్తం కేసులు  35,137 కాగా మరణాలు  537.
  • చత్తీస్ గఢ్: చత్తీస్ గఢ్ లో కొత్తగా 1,518 కేసులు రాగా 16మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 2,52,638 కి, మరణాలు 3,054 కి చేరాయి. కోలుకున్నవారి సంఖ్య . 2,30,238కి చేరగా 177 మంది ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 1,682 మంది హోమ్ ఐసొలేషన్  నుంచి విముక్తి పొందారు.
  • గోవా: గురువారం నాడు గోవాలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.  95 మందికి కొత్తగా కోవిడ్ పాజిటివ్ తేలింది. 159  మంది కోలుకోగా మొత్తం కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 49,131 కి చేరింది.
  • అస్సాం: అస్సాం లో మరో 140 మందికొ కొవిడ్ పాజిటివ్ గా తేలింది. నిన్న 165 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  మొత్తం కేసుల సంఖ్య ఇప్పటికి 214305 కు చేరింది. డిశ్చార్జ్ అయిన మొత్తం బాధితుల సంఖ్య  209787కాగా ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు  3516 మంది, మొత్తం మరణాలు 999
  • కేరళ:  సూడాన్ లో సేవలందించి వచ్చిన ఒక సైనికుడిలో మలేరియా సంబంధమైన ప్లాస్మోడియం అండం గుర్తించినట్టు కేరళ ఆరోగ్య శాఖామంత్రి కెకె శైలజ వెల్లడించారు.  ఆ వ్యక్తికి కన్నూర్ లోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. సకాలంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం ద్వారా ఆ అంటు వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చునన్నారు. ఇలా ఉండగా రాష్ట్రంలో  4470 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మరణాల సంఖ్య 2533కి పెరిగింది..
  • తమిళనాడు: తమిళనాడులో తొలివిడత ఐదు లక్షలమందికి కోవిడ్ వాక్సిన్ ఇస్తారు. ఇందుకోసం 2800 వాక్సిన్ కేంద్రాలు నడుపుతారు.  ఏ సమయంలోనైనా కనీసం 2.5 కోట్ల డోసుల వాక్సిన్ నిల్వచేయగల 51 శీతలకేంద్రాలు సిద్ధమయ్యాయి. గత 24 గంటలలో  1,302 మంది కోవిడ్ బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో 1220 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య  7,95,240 కి చేరింది. చికిత్సలో ఉన్న కేసులు 10,491 నుంచి 10,392 కు పడిపోయాయి.  
  • కర్నాటక: మూడో దశ కోవిడ్ వాక్సిన్ పరీక్షలు బెలగావి లో మొదలయ్యాయి.  ఔట్ పేషెంట్ విభాగాలు యథావిధిగా నడవాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితిని సమీక్షించటానికి ఆరోగ్య శాఖామంత్రి కె. సుధాకర్ ఈ రోజు సమావేశం నిర్వహించారు.
  • ఆంధ్రప్రదేశ్:  ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మొత్తం కోవిడ్ పరీక్షలు కోటి దాటి 1.06 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో ప్రతి పది లక్షల జనాభాలో సుమారు 2 లక్షల మందికి పరీక్షలు చేసినట్టయింది.  అన్ని జిల్లాలూ 100 లోపు కేసులు నమోదు చేసుకోగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 95 కేసులు, ఆ తరువాత కృష్ణా జిల్లాలో  86 వచ్చాయి.   అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 7 కేసులు, కడప జిల్లాలో 13 వచ్చాయి.  గురు వారం, శుక్రవారం రెండేసి మరణాలు నమోదు కాగా ఇది గత ఆరు నెలల్లో అత్యల్పం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులు 8,74,515 కు చేరుకోగా, కోలుకున్నవారి సంఖ్య; 8,62,230 , మరణాలు 7,049 అయ్యాయి. ప్రస్తుతం చికిత్సలో ఉన్న వారి సంఖ్య 5,236 కి తగ్గింది.
  • తెలంగాణ: తెలంగాణలో గత 24 గంటలలో వచ్చిన కొత్త కేసులు 612 కాగా, 502 మంది కోలుకున్నారు, ముగ్గురు మరణించారు. ఇప్పటివరకు మొత్తం కేసులు; 2,76,516 ; చికిత్సలో ఉన్నవారు: 7,604 మంది, మరణాలు 1485, కోలుకొని డిశ్చార్జ్ అయినవారు:2,67,427 మంది. కోలుకున్నవారి శాతం  96.71 కాగా జాతీయ స్థాయి శాతం 94.8.

 

నిజనిర్థారణ

Image

 

Image

*******



(Release ID: 1680122) Visitor Counter : 309