ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మరో చరిత్రాత్మక సాధన: 146 రోజుల తరువాత
చికిత్సలో ఉన్నవారి సంఖ్య 3.63 లక్షలకు తగ్గుదల
రోజువారీ కొత్త కేసుల సంఖ్య 30 వేలకు లోపే
Posted On:
11 DEC 2020 11:47AM by PIB Hyderabad
భారతదేశంలో మొత్తం చికిత్సలో ఉన్నవారి సంఖ్య గణనీయంగా పడిపోతూ ఉంది. ప్రస్తుతం సుమారు 3.63 లక్షలకు దగ్గర్లో 3,63,749 గా నమోదైంది. ఇది 146 రోజుల తరువాత ఇంత తక్కువ స్థాయికి చేరింది. 2020 జులై 18న చికిత్సలో ఉన్నవారి సంఖ్య 3,58,692 గా నమోదైంది. దేశంలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య స్థిరంగా తగ్గుతూ వస్తోంది. భారత్ లో ఇప్పుడు ఇంకా చికిత్సలో ఉన్నవారు దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో 3.71% మాత్రమే. గత 24 గంటలలో 37,528 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీనివల్ల మొత్తం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 8,544 మేరకు తగ్గింది.
భారతదేశంలో రోజువారీ కొత్త కేసులు 30,000 లోపు ఉంటున్నాయి. గడిచిన 24 గంటలలో కొత్త కేసులు 29,398 నమోదయ్యాయి.
ఇప్పటివరకు కోవిడ్ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 93 లక్షలకు దగ్గరవుతూ 92,90,834 గా తేలింది. కోలుకున్నవారికి, ఇంకా చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం అది 89 లక్షలు దాటి 89,27,085కు చేరింది. కొత్తగా వస్తున్న కేసులకు, కొత్తగా నమోదైన కోలుకున్నవారికి మధ్య తేడా క్రమంగా పెరుగుతూ ఉండటంతో కోలుకున్నవారి శాతం మెరుగుపడుతూ నేడు 94.84% అయింది.
కొత్తగా కోలుకున్నవారిలో 79.90% మంది కేవలం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్టు తేలింది. కర్నాటకలో అత్యధికంగా ఒక్క రోజులో 5,076 మంది కోలుకోగా మహారాష్ట్రలో 5,068 మంది, కేరళలో 4,847 మంది కోలుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
గత వారం రోజులలో సగటున రోజువారీ కోలుకున్నవారి సంఖ్యను ఈ చిత్రపటం చూపుతోంది. సగటున రోజుకు మహారాష్ట్రలో అత్యధికంగా 6,703 మంది కోలుకోగా, ఆతరువాత స్థానాల్లో కేరళ (5,173(, ఢిల్లీ (4,362) ఉన్నాయి.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 72.39% మంది 10 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. కేరళలో అత్యధికంగా 4,470 కొత్త కేసులు రాగా మహారాష్ట్రలో 3,824 కేసులు నమోదయ్యాయి..
గడిచిన 24 గంటలలో 414 మరణాలు నమోదయ్యాయి. అందులో 79.95% మరణాలు పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. గరిష్ఠంగా మహారాష్ట్రలో 70 మంది చనిపోగా ఢిల్లీలో 61 మంది, పశ్చిమ బెంగాల్ లో 49 మంది చనిపోయారు.
***
(Release ID: 1679971)
Visitor Counter : 249
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam